‘ఆ మంత్రి చాలా కూల్… చాలా ఇంప్రెసివ్’- ఇదీ ఇప్పుడు వైసీపీలో జరుగుతున్న చర్చ. జగన్ కేబినెట్లో ఎంతో మంది మంత్రులు ఉన్నా కూడా ఈ మాటే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఎందుకు హైలెట్ అవుతోంది ? అన్న విషయం ఆసక్తిగా మారింది. ముఖ్య మంత్రి జగన్ సొంత జిల్లాకు చెందిన కడప ఎమ్మెల్యే మంత్రి అంజాద్ బాషా గురించి ముఖ్యమంత్రి జగనే ఈ కామెంట్లు చేసినట్టు సమాచారం. దీనికి కారణం ఏంటంటే.. తాజాగా జరగాల్సిన కేబినెట్ సమావేశాన్ని జగన్ వాయిదా వేశారు. దీంతో సోషల్ మీడియాలో అనేక కామెంట్లు వచ్చాయి. ముఖ్యంగా టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు.
కేబినెట్‌మంత్రులకే కరోనా వచ్చినప్పుడు.. కరోనా భయం ఉన్నప్పుడు ఇంటర్ పరీక్షలు ఎలా నిర్వహిస్తారని.. నారా లోకేష్ ప్రశ్నించారు. ఇది జరిగిన వెంటనే మంత్రి అంజాద్ బాషా స్పందించారు. “సార్ వర్చువల్‌గా భేటీ అవుదాం. ఆన్‌లైన్‌లో కేబినెట్ మీట్ పెట్టుకుందాం అని సూచించారట. అయితే.. అప్పటికే జగన్ నిర్ణయం తీసుకోవడంతో ఈ ప్రతిపాదనను పక్కన పెట్టారు. అయితే.. జగన్ మాత్రం అంజాద్ సూచనలపై హర్షం వ్యక్తం చేస్తూ.. “నువ్వు చాలా కూల్ అన్నా.. ఎందుకు స్పందిస్తావ్! వాళ్లంతే.. వాళ్లేదో అన్నారని.. మనం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. వర్చువల్‌గా అక్కరలేదు. ” అని చెప్పినట్టు మంత్రుల మధ్య చర్చ సాగుతోంది.
ఇక, కరోనా సమయంలో మసీదులు, దర్గాల్లో కోవిడ్ కేంద్రాలను ఏర్పాటు చేసేలా కూడా అంజాద్ బాషా మైనార్టీ నేతలను సానుకూల పరుస్తున్న విషయం కూడా జగన్ వరకు చేరిందని.. ఆయన హ్యాపీగా ఫీలయ్యారని అంటున్నారు. ఇప్పటికే కడపలోని ప్రముఖ మసీదును కోవిడ్ కేంద్రంగా మార్చి 100 పడకలనను ఏర్పాటు చేయాలని నిర్ణయించారని, దీనికి అనుమతి కోసం వెయిట్ చేస్తున్నారని తెలిసి.. వెంటనే అనుమతి ఇచ్చేలా కూడా జగన్ ఆదేశించినట్టు సమాచారం.
మొత్తంగా .. కీలక సమయంలో ప్రభుత్వానికి మచ్చరాకుండా వ్యవహరిస్తున్న మంత్రి అంజాద్‌పై జగన్ ప్రశంసలు కురిపించారని.. వైసీపీలో చర్చ సాగుతుండడం గమనార్హం. ఇక, ఇది జరిగిన తర్వాత.. ప్రముఖ దేవాలయాల్లోని వసతి గృహాలను కోవిడ్ వైద్యానికి వినియోగించుకునేలా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. దీనిపైనా నాయకులు చర్చిస్తున్నారు. అయితే.. బాషాకు వచ్చిన రెస్పాన్స్ మాత్రం వెలంపల్లికి రాకపోవడం గమనార్హం.
This post was last modified on May 5, 2021 8:16 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…