రాష్ట్రంలో ఉద్యోగుల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన ఉద్యోగ సంఘాల నాయకులు.. ఇప్పుడు అదే అధికార పార్టీని ఎదిరించలేక.. ఉద్యోగుల నుంచి వస్తున్న ఒత్తిళ్లు తట్టుకోలేక.. తీవ్ర సంకట స్థితిని ఎదుర్కొంటున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. విషయంలోకి వెళ్తే.. గతంలో చంద్రబాబు ప్రభుత్వానికి ఇచ్చిన సపోర్టు కన్నా.. ప్రస్తుత జగన్ ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలు భారీ ఎత్తున సపోర్టు చేస్తున్నారు. జగన్ వెంటే తాము అనే సంకేతాలు ఇస్తున్నారు.
ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలకు వ్యతిరేకంగా ప్రభుత్వం గళం వినిపించగానే.. ఉద్యోగ సంఘాలు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌పై నిప్పులు చెరిగారు. అవసరమైతే.. సుప్రీం కోర్టుకు వెళ్లయినా.. నిమ్మగడ్డ విషయాన్ని తేల్చుకుంటామని.. అన్ని ఉద్యోగ సంఘాలు నిప్పులు చెరిగాయి. నిమ్మగడ్డ ప్రభుత్వంతో పంతానికి పోయి ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేసిన వెంటనే ఉద్యోగ సంఘాలు తాము ఎన్నికల విధుల్లో పాల్గొనబోమని భీష్మించాయి. వన్‌సైడ్‌గా వీళ్లు నాడు జగన్ ప్రభుత్వానికి సపోర్ట్ చేశారు.
అయితే.. సుప్రీం కోర్టు జోక్యంతో వారు వెనక్కి తగ్గారు. అయితే.. ఇప్పుడు అదే ప్రభుత్వం కరోనా విషయంలో అనుసరిస్తున్న వ్యవహారం.. ఉద్యోగుల మద్య చిచ్చు పెడుతోంది. కేవలం సచివాలయంలోనే కరోనాతో 10 మంది ఉద్యోగులు చనిపోయారు. ఇక, రాష్ట్ర వ్యాప్తంగా పదుల సంఖ్యలో ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. అన్ని డిపార్ట్‌మెంట్లలో ఉద్యోగులు కరోనాతో ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో ఉద్యోగ సంఘాల నేతలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
ప్రభుత్వానికి కొన్నాళ్ల కిందట అనుకూలంగా వ్యవహరించిన ఉద్యోగ సంఘాల నాయకులు.. కనీసం ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోం అనే చిన్న డిమాండ్‌ను, ఉద్యోగులకు పీపీఈ కిట్లు ఇప్పించలేని పరిస్థితిలో ఉన్నారని అంటున్నారు. వీరి ఘోష కూడా ప్రభుత్వం ఎంత మాత్రం పట్టించుకునే పరిస్థితిలో లేదు.
నిజానికి ఉద్యోగ సంఘాల నాయకుల మధ్య కూడా ఈ విషయం చర్చకు వస్తున్నా.. ప్రభుత్వంతో చర్చించలేక పోతున్నారు. ట్విస్ట్ ఏంటంటే వీరికి ఇప్పుడు ముఖ్యమంత్రి మాత్రమే కాదు.. చివరకు జిల్లాల్లో వినతిపత్రాలు తీసుకునేందుకు మంత్రులు కూడా అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదట. ప్రస్తుతం వీరంతా తర్జన భర్జనలో ఉండడం గమనార్హం.
This post was last modified on May 5, 2021 8:07 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…