ఆమొక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. ఆమె సర్వీసులో ఎక్కువ భాగం కర్నాటకలో జరిగిపోయింది. ఏదో కొంత కాలం ఏపిలో డిప్యుటేషన్ మీద పనిచేశారు. అంటే ఐఏఎస్ అధికారిణిగా రత్నప్రభ మన జనాలకు తెలిసింది చాలా చాలా తక్కువనే చెప్పాలి. అలాంటి ఆమెను బీజేపీ తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో తమ అభ్యర్ధిగా పోటీలోకి దింపింది.
అభ్యర్ధిగా రత్నప్రభ పేరు ఖరారయ్యే సమయానికి పార్టీలోని నేతల్లో చాలామందికి ఆమెవరో కూడా తెలీదు. అలాంటి రత్నప్రభ అభ్యర్ధిత్వాన్ని ముందే ఖరారు చేసి ప్రచారంలోకి దించాల్సింది. అలాంటిది నామినేషన్లు ఇక రెండు రోజుల్లో ముగుస్తుందనగా మాత్రమే ఆమె పేరును ఖరారు చేసింది అధిష్టానం. చివరి నిముషంలో అభ్యర్ధిత్వం ఖరారైన కారణంగా చాలామంది నేతలకు ఆమె పరిచయం కూడా కాలేదు.
అసలే రాజకీయాలకు కొత్త. దానికితోడు పార్టీలోనే చాలామంది నేతలకు పరిచయంలేదు. అలాంటిది ఇక ఆమెకు ప్రచారం చేసేదెవరు ? ఆమెకోసం పనిచేసేదెవరు ? ఇదే విషయం పోలింగ్ రోజున స్పష్టంగా బయటపడిపోయింది. ఎలాగంటే పోలింగ్ మొదలైన కాద్దిసేపటికే ఉన్నకొద్ది ఏజెంట్లు కూడా బయటకు వెళ్ళిపోయారట. అసలు ఏజెంట్లే దొరకని బీజేపీకి దొరికిన కొద్దిమంది ఏజెంట్లు కూడా పోలింగ్ అయిపోగానే వెళ్ళిపోయారంటే ఏమిటర్ధం ?
ఇలాంటి నేపధ్యం ఉన్న పార్టీ అభ్యర్ధిగా ఉపఎన్నికలో గెలుస్తానని రత్నప్రభ ఎలా అనుకున్నారో అర్ధం కావటంలేదు. ప్రచారంలో నేతలు కూడా పెద్దగా పాల్గొనలేదు. ఎందుకంటే ఏడు నియోజకవర్గాల్లో రత్నప్రభకు ప్రచారం చేసేంత మంది నేతలు కూడా పార్టీలో లేరు. మరి తానే పోటీ చేయటానికి ఉత్సాహం చూపారో లేకపోతే బీజేపీ అగ్రనేతలే ఆమెను రంగంలోకి దింపారో తెలీదు. చివరకు ఆమెకు డిపాజిట్ కూడా దక్కలేదు. అందుకనే ఇపుడందరు రత్నప్రభను చూసి పాపం…రత్నప్రభ అనుకుంటున్నారు.
This post was last modified on May 3, 2021 3:09 pm
‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది పంజాబీ భామ మెహ్రీన్ పిర్జాదా. ఆ తర్వాత ఆమెకు మంచి మంచి…
అలియా భట్ ఎలా అన్ని బాధ్యతలను బ్యాలెన్స్ చేస్తుందో చూసి చాలామందికి ఆశ్చర్యమే. కొత్త ఇల్లు, సినిమాలు, బిజినెస్ పనులు,…
రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న మోహన్ లాల్ ప్యాన్ ఇండియా మూవీ వృషభ డిసెంబర్ 25 మళయాళంతో పాటు తెలుగులోనూ సమాంతరంగా…
శాండల్ వుడ్ హీరో ఉపేంద్ర ఎంత టిపికల్ గా ఆలోచిస్తారో తొంభై దశకంలో సినిమాలు చూసిన వాళ్లకు బాగా తెలుసు.…
ఏపీలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు కూటమి ప్రభుత్వం వేగం పెంచింది. ఇటీవల ఉపాధ్యాయ నియామకాలను పూర్తి చేసిన ప్రభుత్వం, ఇప్పుడు…
నాలుగు గంటల విచారణలో అన్నీ ముక్తసరి సమాధానాలే..! కొన్నిటికి మౌనం, మరికొన్నిటికి తెలియదు అంటూ దాటవేత.. విచారణలో ఇదీ సీఐడీ…