ఏపీ సీఎం జగన్ సొంత బాబాయి.. మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించిన కేసు.. ఇప్పటి వరకు ఎటూ తేలలేదు. 2019, మార్చి 15న జరిగిన ఈ హత్యకు సంబంధించి వైసీపీ నేతలు అనేక టర్న్‌లు తీసుకున్నారు. ఈ కేసును సీబీఐ కూడా టేకప్ చేసింది. అయితే.. ఇప్పటి వరకు నిందితులు ఎవరు? అనేది ఇతమిత్థంగా బయటకు రాలేదు. ఒకవైపు వైఎస్ కుటుంబం నుంచి కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సీఎం జగన్ కేంద్రంగా ఈ హత్య కేసుకు సంబంధించి అనేక అనుమానాలు, విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నా.. నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఇలా.. సాగుతున్న వివేకా కేసులో.. అనూహ్యంగా సంచలన మలుపు చోటు చేసుకుంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ డైరెక్టర్ జనరల్, ప్రస్తుతం జగన్ సర్కారుపై పోరాడుతున్న ఏబీ వెంకటేశ్వరరావు వివేకా హత్య కేసుకు సంబంధించి తన దగ్గర ఉన్న ఆధారాలను సమర్పిస్తానని ముందుకు రావడం.. ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆయన ఏకంగా సీబీఐ డైరెక్టర్ కు రాసిన లేఖ సంచలనం రేపుతోంది. ఈ హత్య దర్యాప్తులో తనకు తెలిసిన సమాచారాన్ని సీబీఐకి అందిస్తానని రెండు సార్లు కోరినా.. వారి నుంచి స్పందన రాలేదని లేఖలో పేర్కొన్న ఆయన.. నిఘా విభాగం సిబ్బంది ఘటనా స్థలానికి వెళితే వారిని లోనికి రానీయకుండా ఎంపీ అవినాష్ రెడ్డి అడ్డుకున్నారని లేఖలో తెలిపారు.
వివేకా హత్య కేసులో ఆసక్తికర విషయాన్ని బయటపెడుతూ ఏబీ సీబీఐకి లేఖను సంధించారు. 2019 మార్చి 15న పులివెందులలో వివేకా ఆయన స్వగృహంలో మరణించారన్న వెంకటేశ్వరరావు.. గుండెపోటుతో ప్రమాదవశాత్తూ బాత్రూంలో జారిపడి మరణించారని మధ్యాహ్నం వరకు సామాజిక మాధ్యమాల్లో ప్రసారమైందని లేఖలో తెలిపారు. ఆయన మృతదేహాన్ని ఆసుపత్రికి తీసుకువెళ్లిన తర్వాత హత్య కేసుగా తేలిందని ఆయన లేఖలో గుర్తుచేశారు. ఆసుపత్రికి చేరేవరకు మృతదేహం వారి బంధువుల ఆధీనంలోనే ఉందని వివరించారు. సీబీఐ జాయింట్ డైరెక్టర్ ఎన్.ఎం సింగ్ నేతృత్వంలో బృందం వైఎస్ వివేకా కేసు దర్యాప్తు చేస్తుందన్న వెంకటేశ్వరరావు.. రెండు సార్లు ఆయన్ని ఫోన్లో సంప్రదించినట్లు తెలిపారు.
వివేకా హత్య కేసుకు సంబంధించి తన వద్ద ఉన్న వివరాలను అందజేస్తానని చెప్పినట్లు వివరించారు. కేసు దర్యాప్తునకు ఉపయోగపడతాయని జేడీకి తెలిపినట్లు లేఖలో పేర్కొన్నారు. ఇంటెలిజెన్స్ డీజీగా పనిచేసిన తాను కేసు దర్యాప్తునకు సహకరిస్తానని స్వచ్ఛందంగా ముందుకు వచ్చినా.. ఏ అధికారీ పట్టించుకోకపోవటం ఆశ్చర్యానికి గురిచేస్తుందన్నారు. ఏపీ నిఘా విభాగం వద్ద ఉన్న అప్పటి సమాచారాన్ని తీసుకునేలా దర్యాప్తు అధికారిని ఆదేశించాలని.. ప్రస్తుత అధికారులను వివరాలను అడిగి తెలుసుకోవాలని లేఖలో కోరారు. ఈ పరిణామంతో సీఎం జగన్ అడ్డంగా ఇరుక్కున్నారనే వాదన వస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on April 16, 2021 9:32 pm
నివిన్ పౌలీ.. 11 ఏళ్ల ముందు ప్రేమమ్ మూవీతో పెద్ద హిట్టు కొట్టి స్టార్ ఇమేజ్ సంపాదించిన నటుడు. ఆ…
అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…
తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…
హీరో హీరోయిన్లకు.. పెద్ద టెక్నీషియన్లకు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోషకాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్టర్లు చేసేవాళ్లకు…
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…
మామూలుగా స్టార్ హీరోయిన్ల నుంచి కెరీర్ ఆరంభంలో గ్లామర్ మోతాదు ఎక్కువ ఉంటుంది. క్రమంగా గ్లామర్ పాత్రలు తగ్గించుకుని, పెర్ఫామెన్స్…