టీడీపీ తెలుగు మహిళ.. రాష్ట్ర అధ్యక్షురాలు.. మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత ఏం చేస్తున్నారు ? ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ? ఇదీ.. ఇప్పుడు పార్టీలో కీలక నేతల ప్రశ్న. పదవి అందిపుచ్చుకున్నప్పుడు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి..జగన్ సర్కారుపై విమర్శలు చేసి.. మీడియాలో గుర్తింపు పొందారు. అయితే.. తర్వాత తర్వాత మాత్రం ఆమె సైలెంట్ అయ్యారు. ఇక, స్థానిక ఎన్నికల్లో తన నియోజకవర్గం.. పాయకరావు పేటలోనూ పార్టీని ముందుండి నడిపించలేక పోయారు. పాయకరావపేటలో స్థానిక కేడర్లో మెజార్టీ వర్గాలు ఆమె నాయకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుండడంతో అక్కడ స్థానిక ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయింది.
అదే సమయంలో పార్టీ తరఫున వాయిస్ కూడా వినిపించలేకపోయారు. కేవలం ఇప్పుడు చిన్నపాటి ప్రకటనలకు మాత్రమే పరిమితమయ్యారు. కానీ.. చంద్రబాబు ఆమెపై చాలానే ఆశలు పెట్టుకున్నారనే వాదన ఉంది. ముఖ్యంగా ఎస్సీ నియోజకవర్గమైన తిరుపతిలో వచ్చే నెల 17న జరగనున్న పార్లమెంటు ఉప ఎన్నికలో టీడీపీ తరపున పనబాక లక్ష్మిని నిలబెట్టారు. ఆదిలో ఇక్కడ పార్టీకి చేదోడు వాదోడుగా ఉండాలంటూ.. వంగలపూడికి బాధ్యతలు అప్పగించారనే ప్రచారం జరిగింది. దీంతో హుటాహుటిన ఆమె.. తిరుపతిలో మకాం వేసి.. ఒకింత వేడి పుట్టించారు.
అయితే.. పనబాక నుంచి ఖర్చుల విషయంలో సహకారం లేదని పేర్కొంటూ.. నాలుగు రోజులకే ఆమె తిరుగుటపా కట్టారు.. ఆ తర్వాత మళ్లీ తిరుపతి మొహం చూడలేదు. ఇక, ఇప్పుడు ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. దీంతో అక్కడికి వెళ్లి పార్టీ తరఫున ప్రచారం చేస్తారనే ఆశలు ఉన్నా.. ఇప్పటి వరకు అనిత ఎక్కడా దూకుడు ప్రదర్శించలేదు. పైగా ఎవరినీ కలుపుకొని పోవడం లేదనే వాదన కూడా వినిపిస్తుండడం గమనార్హం. నిజానికి ఎస్సీ నాయకులు సమైక్యంగా ఉండి.. తిరుపతిలో పార్టీని పరుగులు పెట్టించాలని చంద్రబాబు ఆశించారు.
ఈ క్రమంలోనే వారికి అనేక పదవులు కూడా ఇచ్చారు. ఆదిలో అంతా బాగానే ఉందని అనుకున్నప్పటికీ.. రాను రాను.. ఈ నేతల మధ్యే ఆధిపత్య పోరు సాగడం.. ఖర్చులు లెక్కలు వేసుకోవడం .. వంటివి ప్రధానంగా వీరిలో అనైక్యతకు దారితీశాయి. ఫలితంగా వంగలపూడి సహా పలువురు నాయకులు.. సైలెంట్ అయ్యారు. ఈ ఎఫెక్ట్ తిరుపతిపై ఉంటుందనే అంచనాలు కూడా వస్తున్నాయి. మొత్తానికి ఇప్పుడు తిరుపతిని కూడా దక్కించుకోకపోయినా.. కనీసం గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లు కూడా రాబట్టుకోలేకపోయినా పార్టీ పరువు మరింత పాతాళంలో పడిపోవడం ఖాయం.
This post was last modified on March 23, 2021 5:59 pm
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ తో వైఎస్ షర్మిల సంబంధం ఉందని సోషల్ మీడియాలో చాలాకాలంగా దుష్ప్రచారం జరుగుతోన్న సంగతి…
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసన మండలిలో వైసీపీ, కూటమి పార్టీల సభ్యుల మధ్య వాడీ వేడీ వాదనలు జరుగుతున్న…
టాలీవుడ్ లో నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్లల పెళ్లి విషయం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. సమంతతో…
బిలియనీర్.. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన అదానీ అధినేత గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన కేసు క్రియేట్ చేసిన కార్పొరేట్ సంచలనం…
వైసీపీ అధినేత జగన్ పై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. తాజాగా వెలుగు చూసిన…
అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ తన అల్లరి చేష్టలతో ఎంత ఫేమస్ అయ్యాడో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ఎప్పటికప్పుడు…