పిస్తా హౌస్ ఓనర్ పడిన కష్టాలు తెలిస్తే షాకే!

హలీమ్ అన్నంతనే పిస్తాహౌస్ గుర్తుకొస్తుంది. హైదరాబాద్ హలీమ్ కు సరికొత్త ఇమేజ్ ను తీసుకురావటంలో పిస్తా హౌస్ కీలకం. రంజాన్ వచ్చిందంటే చాలు.. పిస్తాహౌస్ హలీమ్ కోసం ఎగబడుతుంటారు. సీజన్ మొత్తం వారి ఔట్ లెట్ల దగ్గర పండుగ వాతావరణం కనిపిస్తుంది. మరీ.. ఇంతలా ఆరాటమా? అన్న భావన కలగటం ఖాయం. ఇవాల్టి రోజున ప్రపంచంలోని పలు దేశాల్లో పిస్తాహౌస్ హలీమ్ కు ప్రత్యేక గుర్తింపే కాదు.. తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించటంలో దాని యజమాని మహ్మద్ అబ్దుల్ మాజిద్ కష్టమెంతో.

ఇవాల్టి రోజున తిరుగులేని బ్రాండ్ గా నిలిచినప్పటికి పెద్దగా పొంగిపోయినట్లుగా కనిపించరు. అందరితోనూ కలుపుగోలుగా ఉంటారు. కోట్లాది ఆస్తిపాస్తులు.. పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకున్నప్పటికీ తాను పడిన కష్టనష్టాల్ని.. ఇబ్బందుల్ని మర్చిపోరు. కొన్నేళ్ల క్రితం ఇదే మాజిద్.. బతకలేక కుటుంబ సభ్యులంతా కలిసి చనిపోవాలనుకున్న ఆలోచన కూడా చేయటం తెలిస్తే షాక్ తినాల్సిందే.

ఇంతకూ అలాంటి పరిస్థితి ఎందుకొచ్చింది? పిస్తా హౌస్ ఓనర్ తన గతం గురించి ఏం చెబుతారన్నది చూస్తే.. స్ఫూర్తి వంతంగానే కాదు.. కష్టం వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనాలే కానీ వెనక్కి తగ్గకూడదన్న సత్యం బోధ పడుతుంది.

తండ్రిది నాంపల్లిలో బట్టల వ్యాపారం. చిన్నతనం నుంచి షాపుకు వెళ్లేవాడు. తొమ్మిదిమంది పిల్లల్లో చివరివాడు. షాపును మరింత విస్తరించాలనుకున్నా.. వ్యాపారం పెద్దగా సాగేది కాదు. దీంతో.. ఏడాది మొత్తం వ్యాపారం సాగే ఫుడ్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇవ్వాలనుకున్నారు. ఇందులో భాగంగా రెండేళ్లపాటు ఢిల్లీ.. ముంబయి.. జైపూర్ తదితర ప్రాంతాలకు వెళ్లి బిర్యానీ.. మిఠాయిలు.. రకరకాల బేకరీ ఐటెమ్స్ తయారీ నేర్చుకున్నారు.

హైదరాబాద్ కు తిరిగి వచ్చి రూ.50లక్షలతో 1997లో పిస్తా హౌస్ స్టార్ట్ చేశారు. బ్యాంకు రుణంతో పాటు.. తెలిసిన వారి దగ్గరా అప్పు చేశారు. ఆదాయం అనుకున్నంత రాకున్నా.. కాస్త కష్టపడితే మొత్తం అప్పు తీర్చాలనుకున్నవేళ.. ఊహించని కష్టం ఎదురైంది. అప్పట్లో పిస్తా హౌస్ లో కొన్న పదార్థాలు తిని కొందరికి ఫుడ్ పాయిజనింగ్ జరిగిందని.. దాదాపు పదకొండు మంది చనిపోయినట్లుగా పేపర్లో వార్త వచ్చింది. పుడ్ పాయిజనింగ్ జరిగింది నిజమే అయినా ఎవరూ చనిపోలేదు. ఆ తప్పు ఎలా జరిగిందో అర్థం కాకున్నా షాపుకు తాళం వేయాల్సి వచ్చింది.

అప్పటికే పెళ్లి కావటం.. ఆరుగురు పిల్లలు ఉండటం.. అందరూ చిన్నవాళ్లు కావటంతో కుటుంబం ఆర్థికంగా చాలానే కష్టాల్ని పడింది. వ్యాపారం బాగున్నప్పుడు అక్కున చేర్చుకున్న వారంతా దగ్గరకు వెళితేనే ఇబ్బంది పడేవారు. కొందరైతే పలుకరించటం మానేశారు. బంధువులు మొక్కుబడిగా ఫంక్షన్లకు పిలిచేవారే తప్పించి.. వెళ్లకపోయినా అస్సలు పట్టించుకునే వారు కాదు.

ఓవైపు అప్పులు.. మరోవైపు ఏంచేయాలో తోచని పరిస్థితి. అప్పుడున్నవి రెండు మార్గాలే. ఒకటి ఊరెళ్లిపోవటం.. రెండోది కుటుంబం మొత్తం చచ్చిపోవాలనుకోవటం. అయితే.. ఆ రెండు కాకుండా మూడో మార్గాన్ని ఎంచుకున్నారు. ఎక్కడైతే తాను ఫెయిల్ అయ్యానో.. అక్కడే మళ్లీ మొదలు పెట్టాలన్న ఉద్దేశంతో మళ్లీ పిస్తాహౌస్ ను షురూ చేశారు. ఆస్తులన్ని అమ్మేసి అద్దె ఇంట్లోకి చేరి జీవితాన్ని మళ్లీ షురూ చేశారు. గతంలో మాదిరి బేకరీ కాకుండా శాలిబండలో హలీమ్.. బిర్యానీ అమ్మకాల్ని షురూ చేశారు. తక్కువ వ్యవధిలోనే పేరు రావటంతో పాటు.. పిస్తాహౌస్ హలీమ్ ఒక బ్రాండ్ గా మారింది.

ఇవాల్టి రోజున ఒక్క హైదరాబాద్ లోనే 18 శాఖలు ఉన్నా.. వాటిల్లో ఎక్కువ భాగం ఫ్రాంచైజీలుగా ఇచ్చేశారు. విదేశాల్లోనూ హలీమ్ అమ్మటం షురూ చేశారు. పిల్లలందరూ సెటిల్ అయ్యారు. పిస్తా హౌస్ హలీమ్ సామాన్యులే కాదు.. షారూక్ ఖాన్.. సల్మాన్ ఖాన్ లు మాత్రమే కాదు జూనియర్ ఎన్టీఆర్ మొదలు ఎందరో సెలబ్రిటీలు సైతం పిస్తాహౌస్ హలీమ్ కు అభిమానులు.

This post was last modified on May 18, 2020 4:41 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

సమీక్ష – ప్రసన్నవదనం

ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…

5 mins ago

నోట్ల కట్టలను వదలని శేఖర్ కమ్ముల

దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…

27 mins ago

నేష‌న‌ల్ లెవ‌ల్‌కు రేవంత్‌.. కాంగ్రెస్‌కు హ్యాపీ

పీసీసీ అధ్య‌క్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప‌ట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉంద‌ని తెలిసింది. లోక్‌స‌భ ఎన్నిక‌ల…

32 mins ago

బీఆర్ ఎస్‌కు భారీ షాక్‌.. ఎమ్మెల్సీ ఎన్నిక చెల్ల‌ద‌ని హైకోర్టు తీర్పు

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్‌కు భారీ షాక్ త‌గిలింది. ప్ర‌స్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠ‌ల్‌రావు…

1 hour ago

సలార్ అక్కడెందుకు ఫ్లాప్ అయ్యింది

స్టార్ హీరోలు నటించిన ప్యాన్ ఇండియా సినిమాలకు శాటిలైట్ ప్రీమియర్లు భారీ స్థాయిలో స్పందన తెచ్చుకుంటాయి. కానీ కొన్నిసార్లు మాత్రం…

2 hours ago

సమీక్ష – ఆ ఒక్కటి అడక్కు

గ్యారెంటీ కామెడీ ఉంటుందని అల్లరి నరేష్ సినిమాలకు పేరు. కానీ గత కొన్నేళ్లుగా ఈ జానర్ కు ఆదరణ తగ్గడం,…

3 hours ago