Political News

బెంగాల్ ఎన్నిక‌ల్లో జ‌గ‌న‌న్న కానుక‌లు.. విష‌యం ఏంటంటే..!


నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నిక‌ల‌కు ముహూర్తం రెడీ అయిన వేళ‌.. అన్ని పార్టీలూ కూడా ప్ర‌జ‌ల‌ను మ‌చ్చిక చేసుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ప్ర‌జ‌ల‌పై ఉచితాల వ‌ర్షం కురిపిస్తున్నాయి. అయితే.. ఇక్క‌డ చిత్రం ఏంటంటే.. ఏపీలో సీఎం జ‌గ‌న్ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌ను ప‌శ్చిమ బెంగాల్ సీఎం, తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత మ‌మ‌తాబెన‌ర్జీ ప్ర‌క‌టించ‌డ‌మే! అసెంబ్లీ ఎన్నికల వేళ పార్టీలు ప్రకటిస్తున్నా మ్యానిఫెస్టోలు హాట్‌ టాపిక్‌గా మారాయి. తమిళనాడులో ప్రజలకు ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ అని చాలా వరకు ఉచితంగా వస్తువులు అందిస్తామని ప్రధాన పార్టీలు హామీ ఇచ్చాయి. త‌మిళ‌నాడులో ఆల్ ఫ్రీ నినాదం ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు వ‌స్తోంది.

అదే విధంగా కేరళ, అసోం, పశ్చిమ బెంగాల్‌లో కూడా పార్టీలు తమ మ్యానిఫెస్టోలో హామీలు కురిపించి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక‌, బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించిన హామీలు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న పథకాన్ని స్ఫూర్తిగా తీసుకున్నట్లు ఉంది. టీఎంసీ తరఫున ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్నికల మ్యానిఫెస్టోను ఇటీవ‌ల‌ విడుదల చేశారు. అందులో అనేక హామీలు ఇవ్వగా.. వాటిల్లో ఆంధ్రప్రదేశ్‌లో అమలుచేస్తున్న ‘ఇంటింటికి రేషన్‌ బియ్యం’ కార్యక్రమం మాదిరి పశ్చిమ బెంగాల్‌లో కూడా అమలుచేస్తామని మమతా బెనర్జీ ప్రకటించారు.

‘బంగ్లా శోబర్‌.. నిశ్చిత్‌ ఆహార్‌’లో భాగంగా ‘రాష్ట్రంలోని 1.5 కోట్ల రేషన్‌ కార్డుదారులందరూ ఇకపై చౌకధరల దుకాణానికి వెళ్లనవసరం లేదు.’ అని మేనిఫెస్టోలో తృణమూల్‌ కాంగ్రెస్‌ తెలిపింది. ఏపీలో సీఎం జగన్‌ జనవరి 21వ తేదీన ‘ఇంటింటికి రేషన్‌’ కార్యక్రమం ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఇంటింటికి రేషన్‌ సరుకుల పంపిణీని ‘ఘర్‌ ఘర్‌ రేషన్‌ యోజన’ పేరుతో ఢిల్లీ ప్రభుత్వం కూడా అమలు చేసేందుకు సిద్ధమైంది. మార్చి 25వ తేదీన ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రారంభించనున్నారు. అనంతరం ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ఢిల్లీ అంతటా అమలు చేయనున్నారు.

This post was last modified on March 21, 2021 7:26 pm

Share

Recent Posts

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

2 hours ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

3 hours ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

3 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

3 hours ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

5 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

5 hours ago