కొందరు నటనలోకి రావాలని ముందే ఒక లక్ష్యం పెట్టుకుని పని చేస్తారు. కొందరు అనుకోకుండా ఈ రంగంలోకి అడుగు పెడతారు. ఎలా వచ్చినా సరే.. ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిపోవాలని, మంచి పేరు తెచ్చుకోవాలని, బాగా డబ్బులు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకుంటుంటారు. ఐతే ఒకప్పుడు తెలుగులో నంబర్ వన్ హీరోయిన్ స్థాయికి ఎదిగి, ఇప్పుడు బాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన రకుల్ ప్రీత్ సింగ్.. జస్ట్ ఒక కారు కొనుక్కుంటే చాలు అనే టార్గెట్‌తో సినిమాల్లోకి అడుగుపెట్టిందట.
తనకు అనుకోకుండా సినిమా అవకాశం వచ్చిందని.. ఆ ఒక్క సినిమా చేసి, దాని ద్వారా వచ్చే పారితోషకంతో ఒక కారు కొనుక్కుంటే చాలు అనుకున్నానని ఆమె తాజాగా ఒక కార్యక్రమంలో వెల్లడించడం విశేషం. తాను కాలేజీలో చదువుకుంటున్న సమయంలో అనుకోకుండా కన్నడ ఫిలిం ఇండస్ట్రీ నుంచి తనకు ఒక అవకాశం వచ్చిందని.. ఎవరో కొందరు తన ఫొటోలు చూసి తన తండ్రిని కలిసి తమ చిత్రంలో నటించమని అడిగారని రకుల్ వెల్లడించింది. అప్పుడు తనకు ఏం చెప్పాలో అర్థం కలాలేదని.. సినిమాలపై తనకు అప్పుడంత అవగాహన లేదని రకుల్ తెలిపింది.
ఐతే ఈ సినిమాలో నటిస్తే రూ.5 లక్షల పారితోషకం ఇస్తామని అన్నారని.. ఆ డబ్బులతో కారు కొనుక్కోవచ్చని.. అప్పుడు తన స్నేహితుల బృందంలో కారు కొన్న తొలి అమ్మాయిని తానే అవుతాననే ఒకే కారణంతో ఆ సినిమా చేయడానికి ఒప్పుకున్నానని రకుల్ తెలిపింది. ఐతే ఆ సినిమా కోసం 40 రోజులు షూటింగ్‌లో పాల్గొన్నాక కెమెరా ముందు ఉండడం తనకెంతో ఇష్టమని గ్రహించానని.. అప్పుడే నటనను సీరియస్‌గా తీసుకున్నానని.. గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాక సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నానని.. అలా 2013లో పూర్తి స్థాయిలో సినీ రంగంలోకి అడుగుపెట్టానని ఆమె వెల్లడించింది.
ఎవరి ప్రమేయం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అన్నీ సొంతంగా నేర్చుకున్నాననంది. తొలి సినిమా చేశాక కొన్ని పెద్ద సినిమాల్లో అవకాశాలు వచ్చినప్పటికీ, చదువు కోసం వాటిని వదులుకున్నట్లు ఆమె చెప్పింది. కారు కోసం రకుల్ చేసిన కన్నడ సినిమా పేరు.. గిల్లి. తర్వాత ఆమె 2013లో ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ మూవీతో టాలీవుడ్లోకి అడుగుపెట్టింది.
This post was last modified on July 26, 2026 11:16 am
దానం నాగేందర్‌పై వేటు పడడం.. ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావడం.. ఇటీవల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…
శ్రీకాంత్ ఓదెల.. ఈ పేరు చెప్పగానే అందరికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…
నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…
నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…
వచ్చే వారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చే సెలవు రోజుకి, చెప్పుకోదగ్గ సినిమాలే పోటీకి రెడీ అవుతున్నాయి.…
సెప్టెంబర్ అయిపోతోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా ప్రచారం చేసుకున్న రామాయణ పార్ట్ 1 విడుదలకు కేవలం నలభై రోజులు…