చిలసౌ అనే చిన్న సినిమాతో దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే మంచి మార్కులు వేయించుకున్నాడు రాహుల్ రవీంద్రన్. ఒక నటుడు దర్శకుడిగా మారి ఇంత మంచి సినిమా తీస్తాడని ఎవరూ ఊహించలేదు. పెద్దగా అంచనాల్లేకుండా ఈ సినిమాకు వెళ్లిన ప్రేక్షకులు ఆశ్చర్యపోయే పనితనం చూపించాడు రాహుల్.
ప్రేక్షకుల్లాగే అక్కినేని నాగార్జున సైతం రాహుల్ వర్క్ చూసి ఇంప్రెస్ అయి అతడి దర్శకత్వంలో స్వీయ నిర్మాణంలో సినిమా చేశాడు. అదే.. మన్మథుడు-2. కానీ ఈ సినిమా అంచనాలను అందుకోవడంలో ఘోరంగా విఫలమైంది. నాగ్ కెరీర్లో పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఆ దెబ్బకు రాహుల్ కెరీర్ కూడా గాడి తప్పింది. ఇప్పటిదాకా దర్శకుడిగా తన మూడో సినిమాను మొదలుపెట్టలేకపోయాడు. ఐతే గీతా ఆర్ట్స్‌లో అతడి సినిమా ఓకే అయినట్లుగా వార్తలొస్తున్నాయి.
ఈ సంగతలా ఉంచితే.. రాహుల్ తాజాగా తన ట్విట్టర్ ఫాలోవర్లతో చిన్న చిట్ చాట్ చేశాడు. ఈ సందర్భంగా ఓ నెటిజన్ రాహుల్ తర్వాతి ప్రాజెక్టు గురించి అడుగుతూ నాగార్జున కోసం యాక్షన్ కథ రెడీ చేస్తున్నట్లు అప్పట్లో చెప్పారు కదా, ఆ సినిమా ఎప్పుడు అని అడిగాడు. దీనికి రాహుల్ ఆశ్చర్యకర సమాధానం ఇచ్చాడు.
మన్మథుడు-2 దెబ్బకు నాగ్ అభిమానులు తనను ఇప్పటికీ తిట్టుకుంటున్నారని.. కాబట్టి ఇప్పుడు నాగ్‌తో సినిమా వద్దులే అనేశాడు రాహుల్. భవిష్యత్తులో కుదిరితే నాగ్‌తో సినిమా చేస్తానేమో చూడాలని.. అభిమానులను తాను సంతృప్తిపరచగలనని అనుకున్నపుడు అది సాధ్యమవుతుందని.. ప్రస్తుతానికి మాత్రం ఈ విషయంలో నిరాశ పరుస్తున్నందుకు క్షమించాలని ఆ నెటిజన్‌కు బదులిచ్చాడు రాహుల్. మన్మథుడు-2 దెబ్బకు తాను డిప్రెషన్లోకి వెళ్లానని గతంలో చెప్పాడు రాహుల్. ఆ సినిమా అతణ్ని ఎంతగా నిరాశపరిచిందనడానికి తాజా వ్యాఖ్యలే ఉదాహరణ.
This post was last modified on March 22, 2021 7:19 am
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ పెట్టనున్నట్టు రాజ్యసభ మాజీ సభ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖపట్నంలో మాట్లాడిన ఆయన..…
తల్లిదండ్రులపై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వరకు ఉండాల్సిందే. కానీ, జ్యాతస్యహి ధ్రువో మృత్యు.. అన్నట్టుగా కాలం…