తన అన్న కొడుకు రానా దగ్గుబాటిని చూసి చాలా ఎమోషనల్ అయిపోయాడు సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్. రానా హీరోగా నటించిన అరణ్య సినిమాను తాను చూశానని.. ఇదొక అద్భుతమైన చిత్రం అని.. ఇందులో రానా పెర్ఫామెన్స్ చూసి ఆశ్చర్యపోయానని వెంకటేష్ వెల్లడించాడు.
లీడర్ సినిమాతో పరిచయం అయిన రానా.. తర్వాత ఘాజి, బాహుబలి, నేనే రాజు నేనే మంత్రి లాంటి విభిన్నమైన సినిమాలతో ప్రయాణం సాగించడం తనకు చాలా ఆనందం కలిగించిందని.. కానీ అవన్నీ ఒకెత్తయితే అరణ్య సినిమా మరో ఎత్తు అని వెంకీ అన్నాడు. ఫారెస్ట్ మ్యాన్‌గా నటించడం అంత తేలికైన విషయం కాదని, ఆ పాత్రను ఎంతో బాగా అర్థం చేసుకుని, ఎంతో హోమ్ వర్క్ చేసి రానా నటించాడని.. ఒక రకంగా చెప్పాలంటే ఆ పాత్రలో అతను జీవించేశాడని వెంకీ అభిప్రాయపడ్డాడు. అరణ్య ప్రి రిలీజ్ ఈవెంట్లో వెంకీ ఈ వ్యాఖ్యలు చేశాడు.
రానా గురించి మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక దశలో ఎమోషనల్ అయిన వెంకీ.. తనకు దూరంగా నిలబడ్డ రానాను దగ్గరికి పిలిచాడు. గద్గద స్వరంతో.. ఏమో అనుకున్నాను రా.. చాలా ఎదిగిపోయావ్ అంటూ అతణ్ని అభినందించాడు. అరణ్య సినిమాతో రానా తనను ఇన్‌స్పైర్ చేశాడని.. పాత్రను అర్థం చేసుకుని నటించడంలో తాను కూడా ఈ క్యారెక్టర్ చూసి నేర్చుకున్నట్లు వెంకీ తెలిపాడు.
అడవిలో రియల్ లొకేషన్లలో అరణ్య లాంటి సినిమా తీయడం ఆషామాషీ విషయం కాదని, దర్శకుడు ప్రభు సాల్మన్ అద్భుతంగా ఈ సినిమాను తీర్చిదిద్దాడని వెంకీ అన్నాడు. రానాను ఈ సినిమాలో లీడ్ రోల్‌కు తీసుకున్నందుకు ప్రభుకు వెంకీ కృతజ్ఞతలు చెప్పాడు. ప్రకృతి గురించి ఈ సినిమాలో గొప్పగా చెప్పారన్న వెంకీ.. ఇండియన్ స్క్రీన్ మీద అరణ్య లాంటి సినిమా రాలేదని.. ఇదొక గొప్ప థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను ప్రేక్షకులకు ఇస్తుందని అన్నాడు.
This post was last modified on March 22, 2021 7:12 am
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…