Movie News

మోహన్ బాబుని మిస్ చేసిన మహేష్ బాబు

ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న శ్రీనివాస మంగాపురం మీద సినిమా కంటే ఎక్కువగా మహేష్ బాబు ఆ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తాడా రాడానే దాని మీద ఎక్కువ డిబేట్స్ జరుగుతున్నాయి. రాక గురించి అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఒక వీడియో బైట్ ద్వారా వాటిని కొంత తగ్గించే ప్రయత్నం చేశారు సూపర్ స్టార్. ఈ క్రమంలో నటీనటులకు, దర్శకుడు అజయ్ భూపతి, నిర్మాతలు అశ్విని దత్ – కిరణ్ తదితరులకు శుభాకాంక్షలు అందజేసి హిట్టవ్వాలని కోరుకున్నారు.

ఇక్కడ దాకా బాగానే ఉంది కానీ శ్రీనివాస మంగాపురంలో ఒక కీలక పాత్ర పోషించిన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారి గురించి ప్రస్తావించడం మహేష్ బాబు మర్చిపోయాడు. అలాని వీళ్ళ మధ్య బాండింగ్ లేదని కాదు. మహేష్ చైల్డ్ ఆర్టిస్టుగా ఉన్నప్పుడే కొడుకు దిద్దిన కాపురం లాంటి వాటిలో మోహన్ బాబు ప్రతినాయక పాత్రలు పోషించారు. కృష్ణ గారితో కూడా అనుబంధం ఉండేది. అలాంటిది ఆయన గురించి చెప్పకపోవడం ఏమిటనే ప్రశ్న తలెత్తడం సహజం.

కారణాలు ఏమైనా, ఏది ఎలా ఉన్నా ఈ మూవీకి మోహన్ బాబు క్యారెక్టర్ చాలా ప్లస్ అవుతుందనేది యూనిట్ నుంచి వినిపిస్తున్న మాట. జయకృష్ణ ఘట్టమనేనికి గ్రాండ్ వెల్కమ్ వచ్చేలా టీమ్ చేస్తున్న ప్రమోషన్లు కొలిక్కి వస్తున్నాయి. ప్రీ రిలీజ్ వేడుకతో గుమ్మడికాయ కొట్టేసి పబ్లిసిటీకి శుభం కార్డు వేయబోతున్నారు. సీనియర్ హీరోయిన్ రవీనాటాండన్ కూతురు రశ తదాని ఈ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమవుతోంది. లుక్స్ గట్రా బాగానే ఉన్నాయి మరి.

పేరు, ప్రోమోలు ప్రేమకథనే ఫీలింగ్ కలిగించినా ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయట. ఫ్యాక్షనిజంతో పాటు ఎలేవేషన్లు, కుట్రలు కుతంత్రాలు, మాస్ అంశాలు అన్నీ పొందుపరిచి అజయ్ భూపతి కంప్లీట్ ప్యాకేజీగా రూపొందించారని సమాచారం. తండ్రి రమేష్ బాబు సోలో హీరోగా మిస్ చేసుకున్న స్టార్ డం జయకృష్ణ రూపంలో తీరాలనేది కృష్ణ గారు బ్రతికి ఉన్నపుడు కోరుకున్నారు. ఇప్పుడది నిజమైతే ఆ ఫ్యామిలీకి అంతకన్నా కావాల్సింది ఏముంటుంది. 

This post was last modified on July 26, 2026 12:58 pm

Share

Recent Posts

ఆలస్యం ‘ఆదర్శం’ కాకుంటే చాలు

ఫిలిం నగర్ వర్గాల్లో కొత్త ప్రచారం వెంకటేష్ అభిమానులను టెన్షన్ కు గురి చేస్తోంది. అక్టోబర్ 2 నుంచి ఆల్రెడీ…

2 hours ago

బీఆర్ఎస్‌కు క‌ష్ట కాల‌మా… న‌ష్ట కాల‌మా?!

దానం నాగేంద‌ర్‌పై వేటు ప‌డ‌డం.. ఖైర‌తాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావ‌డం.. ఇటీవ‌ల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…

6 hours ago

నాని న‌న్ను భ‌రించాల్సిందే… వేరే దారి లేదు – ఓదెల‌

శ్రీకాంత్ ఓదెల‌.. ఈ పేరు చెప్ప‌గానే అంద‌రికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…

8 hours ago

నానిని వీళ్లు పట్టుకున్నారు… వాళ్లు వదిలేశారు

నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…

8 hours ago

ప్యారడైజ్ మీటింగులో పదనిసలు

నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…

10 hours ago

ట్రబుల్ బృందానికి టైమ్ కలిసి వస్తోంది

వచ్చే వారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చే సెలవు రోజుకి, చెప్పుకోదగ్గ సినిమాలే పోటీకి రెడీ అవుతున్నాయి.…

11 hours ago