విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో విచిత్రమైన పరిస్దితి తలెత్తింది. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు వెల్లడై ఇంకా పదిరోజులు కూడా కాలేదు. అప్పుడు టీడీపీ తరపున గెలిచిన కార్పొరేటర్లలో ఏడుగురు వైసీపీ ఎంఎల్ఏతో భేటీ అయ్యారు. దీంతో టీడీపీలో ఒక్కసారిగా కలకలం రేగింది. భేటి విషయం బయటపడగానే పార్టీ ఏడుగురు కార్పొరేటర్లకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. దాంతో టీడీపీ రాజకీయలు ఒక్కసారిగా వేడెక్కాయి.
ఇంతకీ విషయం ఏమిటంటే జీవిఎంసి పరిధిలోని గాజువాక నియోజకవర్గం పరిధిలోని డివిజన్లలో ఎనిమిది చోట్ల టీడీపీ గెలిచింది. మరి ఏమయ్యిందో ఏమో ఎనిమిది మందిలో ఏడుగురు గాజువాక వైసీపీ ఎంఎల్ఏ తిప్పలనాగిరెడ్డితో భేటి అయ్యారు. భేటి సందర్భంగా ఎంఎల్ఏకి పూలబొకే ఇచ్చి మేయర్ స్ధానాన్ని పార్టీ గెలుచుకోవటం పట్ల సంతోషాన్ని వ్యక్తంచేశారు.
ఎంఎల్ఏతో భేటిఅయిన కార్పొరేటర్లలో పల్లా శ్రీనివాస్, పులి లక్ష్మీబాయి, గంధం శ్రీనివాసరావు, రౌతు శ్రీనివాసరావు, లేళ్ళ కోటేశ్వరరావు, బొండా జగన్నాధం, మొల్లి ముత్యాలనాయుడున్నారు. తమ పార్టీ కార్పొరేటర్లు అధికారపార్టీ ఎంఎల్ఏతో భేటిఅయిన విషయం తెలియగానే పార్టీలో సంచలనంగా మారింది. అధికారపార్టీ ఎంఎల్ఏని ఎందుకు కలవాల్సొచ్చింది ? ఇందుకు పార్టీ అధ్యక్షుని అనుమతుందా అనే విషయాలు తెలుసుకునేందుకు వీళ్ళు ఏడుగురికి షోకాజ్ నోటీసిచ్చారు.
రెండు రోజుల్లో షోకాజ్ నోటీసుకు బదులివ్వకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని కూడా అందులో హెచ్చరించారు. దాంతో విషయం ముదిరి పాకానపడుతోంది. క్రమశిక్షణ చర్యలు తీసుకునేంత ధైర్యం పార్టీ నాయకత్వం చేస్తుందా అనేది సందేహమే. ఒకవేళ వీళ్ళంతా టీడీపీలో నుండి వైసీపీలోకి ఫిరాయిస్తే చేయగలిగేది కూడా ఏమీలేదు. ఫలితాలు వచ్చిన వారంలోపే వీళ్ళంతా అధికారపార్టీ ఎంఎల్ఏని కలవాల్సిన అవసరం ఏమొచ్చిందో ఎవరికీ అర్ధం కావటంలేదు. మొత్తానికి జీవిఎంసి టీడీపీలో ముసలం మొదలయ్యేట్లే ఉంది.
This post was last modified on March 20, 2021 3:19 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…