రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. బంధాలు, బాంధవ్యాలు కూడా రాజకీయాల్లో కనిపించడం లేదు. అన్నదమ్ములు సవాళ్లు చేసుకుంటున్నారు. తండ్రీ కూతుళ్లు కూడా ఎన్నికల్లో తలపడుతున్నారు. అయితే.. ఎంత దూకుడుగా రాజకీయాలు చేసినా.. మరీ అంత కుటుంబ సంబంధాలను తెంచేసుకుంటున్నారని అనలేం. ఎక్కడో ఒక చోట రాజీ పడుతున్నారు. అయితే.. వీటికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబ సభ్యులు. ఈ విషయం శ్రీకాకుళంలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. “అంత సీనియర్ అయి ఉండి.. అన్న కుటుంబానికే ఎసరు పెడుతున్నారే!” అని చర్చించుకుంటున్నారు.
విషయంలోకి వెళ్తే.. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. మరో 48 గంటల్లో మూడో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో స్పీకర్ సొంత జిల్లా శ్రీకాకుళం జిల్లాలోని తొగారాం
పంచాయతీకి కూడా ఈ మూడో దశలో ఎన్నికలు జరగనున్నాయి. వాస్తవానికి ఇక్కడ ఎవరినీ పోటీకి లేకుండా చేసుకునేందుకు సీతారాం ఎంతో ప్రయత్నించారని అప్పట్లోనే గుసగుసలు వినిపించాయి. అయితే.. అనూహ్యంగా ఆయన సొంత అన్న దివంగత తమ్మినేని శ్యామలరావు సతీమణి.. భారతమ్మ నామినేషన్ వేశారు.
ఇక, ఇదే పంచాయతీ నుంచి తమ్మినేని సీతారాం సతీమణి.. తమ్మినేని వాణి వైసీపీ బలపరిచిన అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ఇంత వరకు బాగానే ఉంది. ఒకే కుటుంబం అయినా.. బరిలో దిగారు కనుక .. ఎవరి దారిలో వారు ప్రచారం చేసుకుంటే.. ఎలాంటి ఇబ్బందీ ఉండదు. కానీ.. అనూహ్యంగా సీతారాం తెరచాటు రాజకీయాలకు వ్యూహం పన్నారని తెలుస్తోంది. తన సొంత సోదరుడి ఏకైక కుమారుడు.. భారతమ్మ బిడ్డను కుటుంబానికి దూరం చేసి.. తనవైపునకు తిప్పుకొన్నారట. దీంతో ఇప్పుడు భారతమ్మ కుటుంబంలో రాజకీయ చిచ్చు రగులుతోంది. ఆమె కుమారుడే.. ఎన్నికల ప్రచారానికి తల్లి తరఫున రంగంలోకి దిగేందుకు ముందుకు రావడం లేదు.
పైగా.. తల్లిని పోటీ నుంచి తప్పుకోవాలని నిత్యం గొడవ పడుతున్నారు. అయినా కూడా భారతమ్మ.. ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. కానీ, ఆమె తరఫున ప్రచారం చేసేందుకు.. కనీసం.. ఆమె తరఫున జెండా మోసేందుకు కూడా ఎవరినీ రాకుండా సీతారాం అనధికారికంగా ఆదేశాలు జారీ చేశారట. దీంతో ఒంటరిగానే భారతమ్మ ప్రచారం చేస్తుండగా.. తమ్మినేని సతీమణి వాణి మాత్రం దాదాపు వెయ్యిమందితో భారీ ర్యాలీలు, ప్రచారార్భాటాలు చేస్తున్నారు. గెలుపు ఎవరిది అయినప్పటికీ.. అన్న కుటుంబాన్ని ఒంటరిని చేయడం.. కనీసం వదిన అనే మర్యాద కూడా లేకుండా సీతారాం రాజకీయాలు చేస్తుండడం శ్రీకాకుళం జనాలకు ఆగ్రహం తెప్పిస్తోందని అంటున్నారు. మరి ఇక్కడ భారతమ్మ గెలిస్తే.. కనుక సీతారాంకు పెద్ద ఎదురు దెబ్బేనని విశ్లేషణలు వస్తున్నాయి.
This post was last modified on February 16, 2021 11:58 am
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…