తెలంగాణ రాజకీయ అవనికపై మరో కొత్త పార్టీ పురుడు పోసుకునేందుకు సిద్ధమైంది. వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె.. వైఎస్ షర్మిల పొలిటికల్ ఎంట్రీ దాదాపు ఖరారైపోయింది. సన్నాహక సమావేశం కూడా భారీ ఎత్తున ప్రారంభం కావడంతో అందరి దృష్టీ ఇప్పుడు షర్మిల పార్టీపైనే పడింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నప్పటికీ.. ఇప్పటికిప్పుడు షర్మిలకు కలిసి వచ్చే అవకాశాలు ఏంటి? ప్రస్తుతం తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్తితి ఎలా ఉంది? ఈ నేపథ్యంలో షర్మిల ఎంట్రీ ఏమేరకు ప్రభావం చూపుతుంది? ఇప్పటి వరకు ఉన్న పాలిటిక్స్ ను ఎలా మలుపు తిప్పగలుగుతారు? తెలంగాణ ప్రజల నాడి ఏంటి? అనే అంశాలు ఆసక్తిగా మారాయి.
ఛాన్స్-1: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యమ్నాయం కోసం.. ఇటు నాయకులు, అటు ప్రజలు ఎదురు చూస్తున్నారనే వాస్తవం. తెలంగాణ సాధించుకున్నా.. నాటి ఉద్యమ సమయంలో ఉన్న స్ఫూర్తి.. నాడు ఏ లక్ష్యంతో అయితే.. రాష్ట్రాన్ని సాధించారో.. అది నెరవేరలేదనే వాదన బలంగా ఉంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు.. నేటికి కడగట్టునే ఉన్నాయి. వలస కార్మికుల జాబితాలో బిహార్, యూపీ తర్వాత ప్లేస్ తెలంగాణే కావడం గమనార్హం. దీని నుంచి తమను కాపాడే నాయకత్వం కావాలని ఇక్కడి ప్రజలు కోరుతున్న మాట వాస్తవం.
ఛాన్స్-2: ప‌్రస్తుతం ఉన్న అధికార పార్టీ కుటుంబ పార్టీగా మారిందనే వాదన బలంగా ఉంది. అదేసమయం లో నాడు ఉద్యమ సమయంలో చేసిన ప్రధాన వాగ్దానం ఎస్సీని ముఖ్యమంత్రిని చేస్తానన్న హామీని కేసీ ఆర్ నెరవేర్చలేకపోయారు. అదేసమయంలో నాడు ఏ ఉద్దేశంతో అయితే.. రాష్ట్రాన్ని సాధించారో.. ఆ ఉద్దేశాన్ని నేటికీ అమలు చేయలేక పోయారనే వెలితి కూడా ఉంది. ఇది ఇప్పుడు షర్మిలకు కలిసి వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితమైన అభివృద్ధి కూడా షర్మిలకు కలిసి వస్తుంది.
ఛాన్స్ -3: తెలంగాణలో ప్రస్తుతం రాజకీయ శూన్యత భారీగా ఉంది. ఒక్క అధికార పార్టీ తప్ప.. ప్రత్యామ్నాయ పార్టీ లేకుండా పోయిందనే వాదన ఉంది. అయితే.. బీజేపీ దూకుడుగా ఉన్నా.. మతతత్వ పార్టీగా ఉన్న ముద్ర నేపథ్యంలో బీజేపీ ప్రజలకు ఏమేరకు దగ్గరవుతుందనే వాదన కూడా ఉంది. కాంగ్రెస్ విషయాన్ని తీసుకుంటే.. పడుతూ.. లేస్తూ.. ఉన్న పార్టీకి పగ్గాలు పట్టుకుని నడిపించే నాయకుడు కూడా కరువు కావడం గమనార్హం. ఈ పరిస్థితి షర్మిలకు కలిసి వస్తుంది.
ఛాన్స్-4: రెడ్డి సామాజిక వర్గం సహా ముస్లింలు, ఎస్సీలు.. షర్మిలకు అండగా ఉండే అవకాశం మెండుగా ఉంది. ఈ వర్గాలు తప్పని సరి పరిస్థితిలోనే కేసీఆర్‌కు మద్దతిస్తున్న విషయం.. ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సమయంలోనే రుజువైంది. ముఖ్యంగా ఓవైసీ వంటివారు షర్మిలకు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది.
ఛాన్స్-5: ఇప్పటి వరకు అనేక పార్టీలు వచ్చాయి. వీటికి భిన్నంగా.. షర్మిల ఇప్పటికే తెలంగాణలో పాదయాత్ర చేసి ఉండడం. ఇక్కడి ప్రజలకు కనెక్ట్ కావడం వంటివి కలిసి వస్తాయని పరిశీలకులు భావిస్తున్నారు. అదేసమయంలో సీఎం స్థాయిలో ఒక మహిళ రాజకీయ అరంగేట్రం చేయడం.. ముఖ్యంగా వైఎస్ కుమార్తెగా ఉన్న చరిష్మా.. వంటివి షర్మిలకు కలిసి వస్తాయి. క్లీన్ ఇమేజ్ కూడా దోహదపడుతుందనేది విశ్లేషకుల అభిప్రాయం.
కొసమెరుపు: ఇన్ని ప్లస్‌లు ఉన్నప్పటికీ.. ఏపీకి చెందిన కుటుంబం అనే ముద్రను ఇతర రాజకీయ పార్టీలు.. బలంగా ప్రచారంలోకి తీసుకువెళ్లే అవకాశం ఉంది. దీనిని ఎలా తట్టుకుని నిలబడతారో చూడాలి.
This post was last modified on February 9, 2021 2:28 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…