చూస్తుంటే అలాగే వ్యవహారం. రాజకీయాలకు తాను పనికిరాడని ఎప్పుడో డిసైడ్ చేసుకుని కాడిదింపేసిన మెగాస్టార్ చిరంజీవిని మళ్ళీ బలవంతంగా రొంపిలోకి దింపేట్లే ఉన్నారు చూస్తుంటే. రెండు రోజుల క్రితం జనసేన అగ్రనేత నాదెండ్ల మనోహర్ పొలిటికల్ రీ ఎంట్రీ గురించి ప్రకటించారో లేదో వెంటనే ఈరోజు బీజేపీ చీఫ్ సోమువీర్రాజు రంగంలోకి దిగిపోయారు. వీర్రాజు అధ్యక్షుడు కాగానే కనీసం బాధ్యతలు తీసుకోకుండానే అప్పట్లో చిరంజీవిని కలిసి మాట్లాడిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పుడు వీర్రాజు ఏమడిగారో చిరంజీవి ఏమి చెప్పారో ఎవరికీ తెలీదు.
ఆ భేటి తర్వాత ఇద్దరు సైలెంట్ అయిపోయారు. నిజానికి రాజకీయాలకు సెట్ అయ్యేంత విషయం చిరంజీవిలో లేదని ఎప్పుడో జనాలకు అర్ధమైపోయింది. సినిమాల్లో లాగే పార్టీ పెట్టగానే అర్జంటుగా అధికారంలోకి వచ్చేస్తామని అనుకుని ఉండవచ్చు. అందుకనే ప్రజారాజ్యంపార్టీ పెట్టేందుకు తీసుకున్న సమయం కూడా పార్టీని మూసేసేందుకు తీసుకోలేదు. 2009 ఎన్నికల ఫలితాల్లో ఎక్కడో నిలబడగానే కాంగ్రెస్ లో కలిపేశారు. తర్వాత రాజ్యసభ సభ్యత్వం తీసుకుని ఎంఎల్ఏగా రాజీనామా చేసేసి తర్వాత కేంద్రమంత్రి కూడా అయిపోయారు.
సరే అదంతా చరిత్రగా మిగిలిపోయింది లేండి. తాజా విషయానికి వస్తే వీర్రాజు మాట్లాడుతూ చిరంజీవి తమ పార్టీకి మద్దతుగా నిలబడుతారని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. సరైన సమయంలో మెగాస్టార్ రంగంలోకి దిగుతారని, తమకు ప్రచారం చేస్తానని బీజేపీ చీఫ్ గట్టిగానే చెప్పారు. నాదెండ్ల, వీర్రాజు వరస చూస్తుంటే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల్లో ప్రచారానికి దింపేట్లే ఉన్నారు. ఎలాగూ తమ్ముడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా కాదనేది లేదు కాబట్టి మిత్రపక్షాల అభ్యర్ధి తరపున ప్రచారంలోకి దిగుతారేమో చూడాలి.
చిరంజీవి కూడా ప్రచారం పేరుతో మద్దతుగా రంగంలోకి దిగితే మిత్రపక్షాలకు కావాల్సినంత కాపు ఫ్లేవర్ దొరుకుతుందనటంలో సందేహం లేదు. ఎందుకంటే పవన్+వీర్రాజు ఇద్దరూ కాపులే. అప్పట్లో కాపుల కోసమే చిరంజీవి ప్రజారాజ్యంపార్టీ పెట్టాడనే ప్రచారం విపరీతంగా జరిగింది. జరిగిన ఆ ప్రచారం కూడా చివరకు కొంపముంచేసింది. మళ్ళీ ఇపుడు అలాంటి కలరింగే అందరికీ కనబడుతుందనటంలో సందేహం లేదు. మొహమాటానికి మిత్రపక్షాల తరపున ప్రచారంలోకి దిగితే చిరంజీవి ఎవరిని విమర్శిస్తు మాట్లాడుతారు ?
జగన్మోహన్ రెడ్డితో చిరంజీవికి మంచి సంబంధాలే ఉన్నాయి. కాబట్టి తమ్ముడు, వీర్రాజు లాగ ప్రభుత్వంపై విరుచుకుపడే అవకాశాలు తక్కువే. అలాగే చంద్రబాబునాయుడుతో కూడా సంబంధాలు బాగానే ఉండేవి. కాబట్టి చంద్రబాబుపైన ఇపుడు విమర్శలు చేయటానికి కూడా ఏమీలేదు. జగన్+చంద్రబాబుపై ఆరోపణలు, విమర్శలు చేయకపోతే వీర్రాజు ఒప్పుకుంటారా ? చూద్దాం మెగాస్టార్ ఒకవేళ రంగంలోకి దిగితే ఏమవుతుందో ?
This post was last modified on February 3, 2021 1:08 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…