కరోనా వైరస్ నేపధ్యంలో ప్రవేశపెడుతున్న బడ్జెట్ లో కేంద్రప్రభుత్వం సరికొత్త పద్దతిని అమలు చేస్తోంది. మామూలుగా కేంద్ర ఆర్ధికమంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టగానే దానికి సంబంధించిన కాపీలను పార్లమెంటులోని ఎంపిలందరికీ పంపిణీ చేస్తారు. ఆ తర్వాత మీడియాకు అందచేస్తారు. ఈ కాపీలనే పార్లమెంటు లైబ్రరీతో పాటు ఇతర వర్గాలకు కూడా అందుబాటులో ఉంచుతారు.
అయితే కరోనా వైరస్ కరాణంగా కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ చదివేందుకు కాపీని సిద్ధం చేశారు. మంత్రి చదవే కాపీని కూడా పుస్తకరూపంలో కాకుండా ట్యాబ్ లో లోడ్ చేశారు. కాబట్టి తాజా బడ్జెట్ కాపీల రూపంలో ఎవరికీ దొరకదు. ప్రధానమంత్రి నరేంద్రమోడితో పాటు కేంద్రమంత్రులకు, ఎంపిలకు కూడా బడ్జెట్ తాలూకు కాపీలను ఆన్ లైన్లోనే ఉంచారు.
అలాగే మీడియాకు సాఫ్ట్ కాపీల రూపంలోనే బడ్జెట్ ను అందుబాటులోకి తెస్తున్నారు. ఇక జనరల్ పబ్లిక్ కు మినీస్టీరియ్ యాప్ రూపంలో మొత్తం బడ్జెట్ ను అందుబాటులోకి తెచ్చారు. అంటే హోలు మొత్తం మీద చూస్తే ఈసారి ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా పేపర్ లెస్ బడ్జెట్ అన్న విషయం అర్ధమైపోయింది. వాస్తవాలు మాట్లాడుకుంటే ప్రతిసారి బడ్జెట్ కాపీలను వందల్లో ప్రింట్ చేయటమే కానీ దాన్ని పూర్తిగా చదవేంత సీన్ దాదాపు ఉండదు.
బడ్జెట్ కాపీలను దాదాపు 700 మంది ఎంపిలకు పంపిణీ చేస్తారు. వీరిలో ఎంతమంది ఎంపిలు బడ్జెట్ కాపీలను చదవుతారో అనుమానమే. బడ్డెట్ కాపీలను క్షుణ్ణంగా చదవి తర్వాత సమావేశాల్లో మాట్లాడాలి. కానీ చాలామంది చదవరు, సమావేశాల్లో నోరిప్పరు. కాబట్టి ఇంతకాలం బడ్జెట్ కాపీల ప్రింటింగ్ పేరుతో డబ్బు దండగ చేసిందనే అనుకోవాలి. కాకపోతే ఈ మాటను ఎంపిలు అంగీకరించకపోవచ్చు. కారణం ఏదైనా కానీండి బడ్జెట్ కాపీల ప్రింటింగ్ కు బ్రేక్ పడిందన్నది వాస్తవం.
This post was last modified on February 1, 2021 11:32 am
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…