Political News

బాబును వెంటాడుతున్న భారీ సమస్య ఇదే

ఔను! ఎంత బిజీగా ఉన్నా.. త‌న‌కు ఇబ్బందిలేదు.. అనుకున్నా.. త‌న సొంత జిల్లా చిత్తూరుపై టీడీపీ అధినే త చంద్ర‌బాబు దృష్టి పెట్టాల‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. నానాటికీ తీసిక‌ట్టుగా మారుతున్న చిత్తూరు టీడీపీ వ్య‌వ‌హారం.. తాజాగా గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో మ‌రింత ప‌ల‌చ‌నైంది!

టీడీపీ అధినేత గా కంటే.. త‌న సొంత జిల్లాలో పార్టీ ప‌రిస్థితి ఇలా ఉంద‌నేది బాబుకు మింగుడుప‌డ‌ని విష‌య‌మే!! ప్ర‌స్తుతం పంచాయ‌తీ ఎన్నిక‌ల తొలి ద‌శకు ఆదివారంతో నామినేష‌న్ల ఘ‌ట్టం పూర్త‌వుతోంది. అయితే.. చంద్ర‌బాబు ఆశించిన విధంగా ఈ ప్ర‌క్రియ‌లో త‌మ్ముళ్లు దూకుడు చూపించ‌లేదు.

వాస్త‌వానికి చంద్ర‌బాబు హ‌యాంలో టీడీపీ పుంజుకున్న‌ది లేదు. పైగా చాలా వ‌ర‌కు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ కులు కూడా క‌రువ‌య్యారు. ఉదాహ‌ర‌ణ‌కు చంద్ర‌గిరి, శ్రీకాళ‌హ‌స్తి, న‌గ‌రి, తిరుప‌తి, పీలేరు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎవ‌రు పార్టీలో ఉన్నారో.. ఎవ‌రు లేరో..కూడా తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది.

ఇక‌, బాబు సొంత నియోజ‌క వ‌ర్గం కుప్పంలో గ‌డిచిన ఆరు మాసాల్లో ప‌రిస్థితి అనూహ్య‌మ‌లుపు తిరిగింది. మంత్రి పెద్దిరెడ్డి రామ‌చం ద్రారెడ్డి క‌నుస‌న్న‌ల్లో ఇక్క‌డ టీడీపీ శ్రేణుల‌ను వైసీపీలోకి తీసుకున్నారు. అదేస‌మ‌యంలో మినీ మునిసి పాలిటీగా గుర్తించారు. దీంతో చంద్ర‌బాబు సానుకూల‌త ఉన్నా.. వైసీపీ డామినేష‌న్ ఎక్కువ‌గా ఉండ‌డం గ‌మ‌నార్హం.

కుప్పం నియోజకవర్గంలోకూడా ఇప్ప‌టి వ‌ర‌కు ఆశించిన విధంగా నామినేష‌న్లు ప‌డ‌లేదు. వాస్త‌వానికి 2013 కంటే ఎక్కువ స్థానాల్లో టీడీపీ శ్రేణులు నామినేషన్లు వేసి గెలవాలని చంద్ర‌బాబు ఆశించారు. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఆశించిన విధంగా అభ్య‌ర్థులు ముందుకు రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇప్ప‌టి వ‌ర‌కు చూస్తే.. తొలి దశ ఎన్నికలకు చిత్తూరు రెవెన్యూ డివిజన్‌లోని 20 మండలాల్లో ఉన్న 454 సర్పంచి స్థానాలకు 157, 4142 వార్డు స్థానాలకు 105 నామినేషన్లు దాఖలయ్యాయి. అత్యధికంగా కార్వేటినగరంలో 25, అత్యల్పంగా పాలసముద్రంలో రెండు నామినేషన్లు సర్పంచి స్థానాలకు దాఖలయ్యాయి.

చిత్తూరు, నగరి, పుత్తూరు, నిండ్ర, పెనుమూరు, రామచంద్రాపురం, వడమాలపేట, గుడిపాల మండలాల్లో వార్డు మెంబర్‌ స్థానాలకు ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు కాలేదు. దీనిని బ‌ట్టి.. బాబు సొంత జిల్లా, సొంత నియోజ‌క‌వ‌ర్గంపై దృష్టి పెట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on February 1, 2021 8:01 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నెగిటివిటీ ప్రభావానికి సినీ బాధితులు ఎందరో

సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…

4 hours ago

విశాల్ ప్రభావం – 30 సినిమాల బూజు దులపాలి

పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…

5 hours ago

అఖండ 2 ఇంటర్వల్ కే మీకు పైసా వసూల్ : తమన్

ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…

6 hours ago

మాకు సలహాలు ఇవ్వండి బిల్ గేట్స్‌కు చంద్ర‌బాబు ఆహ్వానం

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ఐటీ దిగ్గ‌జ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు,…

7 hours ago

శార‌దా ‘స్వామి’ తిరుమల లో చేసింది తప్పే

విశాఖ‌ప‌ట్నంలోని శార‌దాపీఠం అధిప‌తి స్వ‌రూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్ర‌చారంలో ఉన్న విష‌యం తెలిసిందే. వైసీపీ హ‌యాంలో ఆయ‌న చుట్టూ…

7 hours ago

రిలయన్స్ న్యూ కరెన్సీ.. జియో కాయిన్

ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…

7 hours ago