Political News

ప‌వ‌న్ కాపు భ‌జ‌న‌.. వెనుక ఏం జ‌రిగిందంటే!

ప‌వ‌న్ నోట స‌రికొత్త‌గా కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన వ్యాఖ్య‌లు అనూహ్యంగా దొర్లాయి. కాపులకు అండ‌గా ఉంటాన‌ని.. వారి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే బాధ్య‌త‌ను తీసుకుంటాన‌ని ప‌వ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అంతేకాదు.. కాపుల విష‌యంలో క‌న్నీరు పెట్టుకున్నంత ప‌నిచేశారు. వారు అనేక రంగాల్లో వెనుక‌బ‌డి ఉన్నార‌ని.. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ రాజ‌కీయ పార్ట అయినా.. కాపుల‌ను ఓటు బ్యాంకు కోణంలోనే చూసింద‌ని.. వారికి అండ‌గా నిలిచిన వారు ఏ ఒక్క‌రూ లేర‌ని కూడా ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. ఇక‌పై తాను కాపుల‌కు అన్ని విధాలా అండ‌గా నిలుస్తాన‌ని.. జ‌న‌సేన కూడా వారికి ద‌న్నుగా ఉంటుంద‌ని చెప్పుకొచ్చారు.

అయితే.. ప‌వ‌న్‌లో ఈ అనూహ్య ప‌రిణామం.. ఒక్క‌సారిగా క‌నిపించ‌డం.. సంచ‌ల‌నంగా మారింది. వాస్త‌వానికి తాను కూడా కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన నేతే అయిన‌ప్ప‌టికీ.. తాను స్వ‌యంగా సొంత పార్టీ పెట్టుకుని దాదాపు ఎనిమిదేళ్లు అవుతున్న‌ప్ప‌టికీ.. ఇప్ప‌టి వ‌ర‌కు కాపు అజెండాను అందుకోలేక పోయారు. త‌న‌కు కులంలేదు.. మ‌తం లేదు.. అంటూ..వ్యాఖ్య‌లు సంధించారు. అంతేకాదు.. త‌న‌కు ఒక కులానికి క‌ట్టేయ వ‌ద్ద‌ని కూడా చెప్పుకొచ్చారు. ఈ ప‌రిణామం.. గ‌త ఏడాది ఎన్నిక‌ల స‌మ‌యంలో తీవ్ర ప్ర‌భావం చూపించింది. అయినా.. ప‌వ‌న్‌లో ఎలాంటి మార్పూ రాలేదు. కానీ, అనూహ్యంగా ఇప్పుడు కాపుల భ‌జ‌న ప్రారంభించారు. మ‌రి దీనివెనుక ఏం జ‌రిగింది? రాత్రికి రాత్రి ఇంత మార్పు ఎలా వ‌చ్చింది? ఇదీ ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో సాగుతున్న చ‌ర్చ‌.

ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో చిరంజీవి, అల్లు అర‌వింద్‌, నాగ‌బాబులతో ప‌వ‌న్ భేటీ అయ్యార‌ని స‌మాచారం. ఈ సంద‌ర్భంగా పార్టీ ప‌రిస్థితిని తొలిసారి.. చిరంజీవి ప్ర‌స్థావించారని తెలిసింది. ఈ క్ర‌మంలోనే కీల‌క‌మైన కాపు సామాజిక వ‌ర్గాన్ని వ‌దిలేసి.. విన్యాసం చేయ‌డం స‌రికాద‌ని.. వైసీపీకి రెడ్లు, టీడీపీకి క‌మ్మ‌లు ఉన్నారు క‌నుక‌.. నీకు(ప‌వ‌న్‌) కాపుల అండ ఉంచుకోవ‌డం మంచిద‌ని.. ఈ విష‌యంలో ఇప్ప‌టికే చేసిన త‌ప్పుల‌ను స‌రిచేసుకోవాల‌ని, జారిపోకుండా చూసుకోవాల‌ని చిరు గ‌ట్టిగానే క్లాస్ ఇచ్చిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రో వైపు త‌న మిత్ర ప‌క్షం బీజేపీ.. కాపుల‌ను చేర‌దీసేందుకు నానాప్ర‌యాస ప‌డుతోంది. ఈ ప‌రిణామాల‌ను గ్ర‌హించిన ప‌వ‌న్‌.. త‌న దృక్ఫ‌థాన్ని మార్చుకుని కాపుల‌ను త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఈ ప‌రిణామం.. ముందుగానే చేసి ఉంటే.. అన్నో ఇన్నో సీట్లు వ‌చ్చేవ‌రి అంటున్నారు కూడా! మ‌రి ఇప్ప‌టికైనా ప‌వ‌న్ క‌ళ్లు తెరిచార‌ని అనుకోవాలా?! లేక‌.. అన్న ఒత్తిడితో ఇలా మారారా.. ! చూడాలి .. ఏం జ‌రుగుతుందో!!

This post was last modified on January 30, 2021 9:39 pm

Share

Recent Posts

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

9 minutes ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

1 hour ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

2 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

3 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

4 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

4 hours ago