తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. 2026-27 వార్షిక బడ్జెట్‌ను ఈ నెల 20 లేదా 21న సభలో ప్రవేశ పెట్టాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన కసరత్తు కూడా పూర్తయింది. ఇక, తొలి రోజు కేవలం.. గవర్నర్ ప్రసంగంతో సరిపుచ్చేసినా.. అసలు సభ మాత్రం మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. అయితే.. ఈ దఫా కూడా.. సభ వాడివేడిగా కంటే.. మరింత హాట్ హాట్‌గానే ముందుకు సాగనుంది.
ప్రభుత్వ వైఫల్యాలు.. అంటూ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ పెద్దచిట్టానే రెడీ చేసుకుంది. వీటిలో మూసీ నది ప్రక్షాళన అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించనున్నారు. ప్రక్షాళన పేరుతో అవినీతికి పాల్పడుతున్నారన్న వాదనను బలంగా వినిపించేందుకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు ఇప్పటికే ప్రిపేర్ అయ్యారు. ఇక, పెట్టుబడులను కూడా ప్రభుత్వం భూతద్దంలో చూపిస్తోందని.. వచ్చినవి గోరంత ప్రకటనలేమో కొండంత అనే వాదనను కూడా పార్టీ తెరమీదికి తెచ్చింది.
మరీ ముఖ్యంగా రెండు కీలక అంశాలు.. ప్రస్తుత సభను కుదిపేయనున్నాయి. 1) తాజాగా హైదరాబాద్‌లో పట్టుబడిన డ్రగ్స్ వ్యవహారం. దీనిలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అరెస్టు.. వంటివాటిని అధికార పార్టీ ప్రధాన అస్త్రంగా మార్చుకుంటోంది. 2) తమ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ లాగేసుకుని.. స్పీకర్ ద్వారా క్లీన్ చిట్ ఇచ్చిందన్న వాదనను బీఆర్ఎస్ పార్టీ ప్రముఖంగా ప్రస్తావించనుంది. ఈ రెండు అంశాలపై ప్రధానంగా అసెంబ్లీ బడ్జెట్ భేటీలో యుద్ధానికి ఇరు పక్షాలు యుద్ధానికి రెడీ అవుతున్నాయి.
ఇదిలావుంటే.. ప్రస్తుతం పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కొరతగామారిన గ్యాస్ సిలిండర్లు.. కొన్ని జిల్లాల్లో వినియోగదారులపై పోలీసుల ప్రవర్తన వంటివాటిని కూడా బీఆర్ఎస్.. సభా వేదికగా ప్రస్తావించేందుకు ప్రభుత్వ ఉదాశీన వైఖరిని ఎండగట్టేందుకు రెడీగా ఉంది.
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన హోటల్ వ్యవస్థ దాదాపు ఆగిపోయింది. హైదరాబాద్‌లో అయితే.. మరింత ఎక్కువగా ఉంది. ఈ వ్యవహారాలు కూడా చర్చకు రానున్నాయి. మొత్తంగా ఇరు పక్షాల మధ్య ఆయా అంశాలు వాడి వేడి కంటే కూడా.. యుద్ధానికి రెడీ చేస్తున్నాయని అంటున్నాయి పరిశీలకులు.
This post was last modified on March 16, 2026 2:22 pm
గ్రేటర్ హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి తర్వాత.. పార్టీ పుంజుకుంటున్న పరిస్థితి…
రాజమౌళితో సినిమా చేయాలని ఇప్పుడు ఇండియాలో ఉన్న ప్రతి పేరున్న హీరో ఆశపడుతుంటాడు అనడంలో సందేహం లేదు. ఐతే రాజమౌళి…
రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యర్థులతో వైరం ఎలా ఉన్నా.. ప్రజలతో మాత్రం పార్టీలకు సాన్నిహిత్యం ఉండాలి. అది కొరవడితే.. ఎప్పటికీ చేరువ…
నేచురల్ స్టార్ నాని కెరీర్లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ చిత్రాల్లో శ్యామ్ సింగరాయ్ ఒకటి. ట్యాక్సీవాలాతో దర్శకుడిగా పరిచయం అయిన రాహుల్…
పెద్ద బడ్జెట్ పెట్టి, చాలా కాలం కష్టపడి, ఎన్నో ఆశలతో చేసిన సినిమాకు నెగెటివ్ టాక్ వస్తే తట్టుకోవడం తేలిక…
ఏపీ సీఎం చంద్రబాబు రాజధాని అమరావతి విషయంలో అత్యంత శ్రద్ధ చూపిస్తున్న విషయం తెలిసిందే. రైతుల నుంచి భూములు సమీకరించడం(పూలింగ్)…