Political News

ప్ర‌జానాడిని ప‌ట్ట‌లేని బీజేపీ-జ‌న‌సేన‌లు!!

ప్ర‌జ‌ల నాడిని ప‌ట్ట‌డంలో బీజేపీ-జ‌న‌సేన ఐక్య కూట‌మి విఫ‌ల‌మైందా? ప‌్ర‌జ‌ల ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా అడుగులు వేయ‌లేక పోతోందా? అంటే.. ఔన‌నే అంటున్నారు. తిరుప‌తి ఉప ఎన్నిక‌కు సంబంధించి.. క‌ర్ణాట‌క ప్ర‌భుత్వ‌ మాజీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ర‌త్న‌ప్ర‌భ ను రంగంలోకి దింపాల‌ని ఇరు పార్టీలు ఒక నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. దీనికి ఆమెను సంప్ర‌దించే ప‌నిని కూడా వేగం చేశారు. అయితే.. ఈ విష‌యంలో గ‌త ఎన్నిక‌ల అనుభ‌వం ఏం చెబుతోంద‌న్న‌ది కీల‌కంగా మారింది. గ‌తంలో 2019 ఎన్నిక‌ల్లో ఐపీఎస్‌, ఐఆర్ఎస్ ఉద్యోగుల‌కు చాలా పార్టీలు టికెట్లు ఇచ్చాయి. అయితే.. వారంతా ఓడిపోయారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. ప్ర‌భుత్వం ప‌నిచేసిన అనుభ‌వం ఉన్న‌ప్ప‌టికీ.. రాజ‌కీయాల్లోకి వ‌చ్చేస‌రికి .. ప్ర‌జ‌ల‌తో మ‌మేకం కావ‌డం ముఖ్యం.

ఈ విష‌యంలో ప్ర‌భుత్వ ప‌రిధిలో ఉన్న ఉద్యోగులుగా గుర్తింపు ఉన్న వారు గ‌త ఎన్నిక‌ల్లో ప్ర‌జాక్షేత్రంలోకి దిగినా.. ప్ర‌జ‌లు వారిని ఓన్ చేసుకోలేక పోయారు. అధికారుల‌కు-ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య ఉన్న గ్యాప్ కావొచ్చు.. లేదా మ‌రేదైనా విష‌యం కావొచ్చు. విశాఖ ప‌ట్నం పార్ల‌మెంటు స్థానం నుంచి సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ జ‌న‌సేన టికెట్‌పై పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు.

ఇక‌, వైసీపీ నుంచి గుంటూరు వెస్ట్ ప‌రిధిలో పోటీ చేసిన మాజీ ఐపీఎస్ అధికారి చంద్ర‌గిరి ఏసుర‌త్నం ప‌రిస్థితి కూడా ఇంతే. అదేవిదంగా హిందూపురం నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసిన మాజీ అధికారి.. మ‌హ‌మ్మ‌ద్ ఇక్బాల్ కూడా ప‌రాజ‌యం మూట‌గ‌ట్టు కున్నారు. ఇక‌, 2014లో విజ‌యం సాధించిన మాజీ ఐఆర్ ఎస్ అధికారి రావెల కిశోర్ బాబు.. గ‌త ఎన్నిక‌ల్లో డిపాజిట్ కూడా ద‌క్కించుకోలేక పోయారు.

అదేస‌మ‌యంలో డాక్ట‌ర్లుగా ఉండి.. పొలిటీషియ‌న్లుగా రంగంలోకి దిగిన వారు విజ‌యం సాధించ‌డం గ‌మ‌నార్హం. ఈ ప‌రిణామాలను గ‌మ‌నిస్తే.. గ‌తానికి భిన్నంగా ప్ర‌జ‌లు ఆలోచిస్తున్నార‌నే విష‌యం స్ప‌ష్టంగా తెలుస్తోంది. దీంతో టీడీపీ, వైసీపీలు చాలా జాగ్ర‌త్త‌గా అడుగులు వేస్తున్నాయి. ప్ర‌జ‌ల‌తో సంబంధాలు ఉన్న‌ప్ప‌టికీ.. అధికారుల‌కు అవ‌కాశం ఇచ్చే విష‌యంలో ఈ రెండు పార్టీలూ అంత‌ర్గ‌త మ‌థ‌నం చేస్తున్నాయి. కానీ, ఇప్పుడు జ‌న‌సేన‌-బీజేపీ ద్వ‌యం మాత్రం మ‌ళ్లీ మాజీ ఐఏఎస్ అధికారిణిని రంగంలోకి దింపేందుకు, అందునా.. కీల‌క‌మైన తిరుప‌తి పార్ల‌మెంటు స్థానం నుంచి పోటీ చేయించేందుకు సిద్ధ‌ప‌డ‌డం అంటే.. కోరి కోరి .. ఓట‌మిని కొని తెచ్చుకోవ‌డ‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఈ విష‌యంలో త‌మ ఆలోచ‌న‌ను ఇలానే కొన‌సాగిస్తారో.. లేక ఇక్క‌డితో ఫుల్ స్టాప్ పెడ‌తారో చూడాల‌ని అంటున్నారు.

This post was last modified on January 27, 2021 12:58 pm

Share

Recent Posts

సీఎం అయినా స్నేహం త‌ర్వాతే..

ఫిలిం ఇండ‌స్ట్రీలో చాలా ఏళ్ల పాటు నంబ‌ర్ స్థానానికి పోటీ ప‌డ్డ ఇద్ద‌రు టాప్ హీరోల మ‌ధ్య మంచి స్నేహం…

59 minutes ago

ఒత్తిడి బండి మీద ‘రణబాలి’ ప్రయాణం

ఏంటో టాలీవుడ్ లో ఏదీ మాట మీద అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందన్న గ్యారెంటీ లేకుండా పోతోంది. వాయిదాల పర్వంలో నలిగిపోతున్న…

1 hour ago

ఇప్ప‌టి వ‌ర‌కు లేనిది.. ఇప్పుడు మ‌ళ్లీ.. బాబు ఆగ్ర‌హానికి రీజ‌నేంటి?

ఏపీ సీఎం చంద్ర‌బాబు గ‌తానికి భిన్నంగా ఏపీలో పాల‌న సాగిస్తున్నారు. గ‌తంలో ఆయ‌న మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన స‌మ‌యంలో…

2 hours ago

మళ్ళీ పోలీస్ కథ… మళ్ళీ ఇంకో హిట్టు

అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…

5 hours ago

‘ఆదర్శ కుటుంబం’లో తుపాకుల కలకలం

టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…

6 hours ago

గ్రీన్‌కార్డ్ ఎఫెక్ట్ వల్ల భారత్‌కు లాభమా?

అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్‌కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…

7 hours ago