Movie News

మాస్టర్ డిజిటల్ రిలీజ్.. బిగ్ డిబేట్


తమిళంలో థియేటర్ల వ్యవస్థకు మళ్లీ ఊపిరినిచ్చిన సినిమా ‘మాస్టర్’. అక్టోబరులో థియేటర్ల పున:ప్రారంభానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చినా దాదాపు మూడు నెలలు అక్కడ థియేటర్లు పెద్దగా తెరుచుకోలేదు. సంక్రాంతికి ‘మాస్టర్’ సినిమా ఖరారయ్యాకే చాలా వరకు థియేటర్లను పున:ప్రారంభానికి ముస్తాబు చేశారు.

50 పర్సంట్ ఆక్యుపెన్సీలో తమ చిత్రాన్ని విడుదల చేయొద్దని ‘మాస్టర్’ నిర్మాతలు పట్టుబట్టి కూర్చున్నప్పటికీ.. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు వెళ్లి హీరో విజయ్‌ను కలిసి ‘మాస్టర్’ను సంక్రాంతికి విడుదల చేయడం ద్వారా తమను ఆదుకోవాలని వేడుకున్నారు. అతను వారి ఒత్తిడికి తలొగ్గాడు. ప్రభుత్వం ముందు ప్రకటించిన 100 పర్సంట్ ఆక్యుపెన్సీ నిర్ణయంపై వెనక్కి తగ్గాల్సి వచ్చినా ‘మాస్టర్’ విడుదల ఆగలేదు. 50 పర్సంట్ ఆక్యుపెన్సీలోనే ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించింది.

డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అందరూ సంతోషించారు. ఐతే డివైడ్ టాక్‌ను తట్టుకుని ఇంకా ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర చెప్పుకోదగ్గ షేర్ రాబడుతున్న సమయంలో దాన్ని గురువారం రాత్రి అమేజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేయాలని నిర్ణయించడం డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు పెద్ద షాక్. థియేటర్లలో బాగా ఆడుతున్న సమయంలో ‘మాస్టర్’ను ప్రైమ్‌లో విడుదల చేయడం ఎంత వరకు సమంజసం అనే ప్రశ్న వారి నుంచి వ్యక్తమవుతోంది. వేరే ఓటీటీ అయినా ఓకే కానీ.. లాక్ డౌన్ టైంలో దాదాపు ప్రతి ఇంట్లోనూ అమేజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ వచ్చేసిన నేపథ్యంలో ఇక ఫ్యామిలీస్ థియేటర్లకు వచ్చి ‘మాస్టర్’ను చూడరని.. చేజేతులా థియేటర్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని దెబ్బ కొట్టినట్లే అని అంటున్నారు. దీని వల్ల మున్ముందు తలెత్తే దుష్పరిణామాలపై హెచ్చరిక జారీ చేస్తున్నారు.

విజయ్ లాంటి పెద్ద హీరో సినిమా విడుదలైన రెండు వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తే మున్ముందు అన్ని సినిమాల పరిస్థితి ఇంతే అన్న అభిప్రాయం జనాల్లో వచ్చేస్తుందని.. ఇప్పటికే థియేటర్లకు జనాలు రావడం తగ్గిపోయిందని, మున్ముందు మరింత కోత తప్పదని, ఇది ప్రమాదకర ధోరణికి తావిస్తుందని.. థియేటర్ల వ్యవస్థ దారుణంగా దెబ్బ తింటుందని హెచ్చరిస్తున్నారు. ఐతే థియేటర్ల నుంచి రావాల్సిన ఆదాయంలో మాగ్జిమం వచ్చేసిందని, బయ్యర్లు సేఫ్ అయ్యారని, థియేటర్లలో విడుదలైన రెండు వారాలకే ఓటీటీలోకి తేవడం వల్ల తమకు అదనపు ఆదాయం వస్తుంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నామని.. కష్ట కాలంలో సినిమాను థియేటర్లలో రిలీజ్ చేసి ఎగ్జిబిటర్ వ్యవస్థకు ఊపిరులూదిన తమకు ఈ అవకాశం ఇవ్వాలని ‘మాస్టర్’ మేకర్స్ అంటున్నారు.

This post was last modified on January 27, 2021 6:52 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అదానీ-జగన్ లింకుపై చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్

సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…

2 hours ago

ఈవన్నీ చేస్తే AP టూరిజంకు తిరుగుండదు

జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…

4 hours ago

రేవంత్ రెడ్డి.. అదానీ ఒప్పందాలు రద్దు చేస్తారా?

అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…

4 hours ago

మంచు విష్ణు అసలు ప్లానింగ్ ఇదా

మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…

5 hours ago

సాక్షి మీడియా నన్ను కవర్ చేయదు…షర్మిల సెటైర్లు

మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…

6 hours ago