Movie News

టామ్ హాంక్స్ మెచ్చిన మహారాజ

గత కొన్నేళ్లలో కోలీవుడ్లోనే కాదు ఇండియన్ సినిమాలోనే అత్యుత్తమ చిత్రాల్లో ‘మహారాజ’ ఒకటి. విజయ్ సేతుపతి లీడ్ రోల్ చేసిన ఈ చిత్రాన్ని నిథిలన్ స్వామినాథన్ అనే కొత్త దర్శకుడు రూపొందించాడు. థియేటర్లలో రిలీజ్ అయినపుడు ఈ మూవీ అటు తమిళంలో, ఇటు తెలుగులో ఘనవిజయం సాధించింది. ఓటీటీలోకి వచ్చాక మిగతా భాషల్లోనూ ఆదరణ పొందింది. దీని రీచ్ మరింత పెరిగింది.

ఈ సినిమా స్క్రీన్ ప్లేను ఫిలిం స్కూల్స్‌లో పాఠ్యాంశంగా చేర్చేంత గొప్పగా ఉంటుంది. సినిమా రిలీజ్ అయి రెండేళ్లు దాటినా దీని గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంటుంది. ఈ సినిమా ఇప్పుడు హాలీవుడ్లో కూడా రీమేక్ అవుతున్నట్లు నిర్మాత సుధన్ ఇటీవలే వెల్లడించాడు కూడా. అయితే హాలీవుడ్లో ఈ సినిమా రిలీజ్ కావడానికి ముందే ఒక మేటి నటుడి నుంచి ప్రశంసలు పొందడం విశేషం. ఆ నటుడు మరెవరో కాదు టామ్ హాంక్స్.

ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ టెలివిజన్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ బోర్డు సభ్యురాలు కవితా గుప్తా, ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియాతో మాట్లాడుతూ ఈ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఎల్‌ఏసీఎంఏ గాలా వేడుకలో టామ్ హాంక్స్ తనతో మాట్లాడుతూ ఏవైనా మూడు ఇండియన్ మూవీస్ సజెస్ట్ చెయ్యమని అడిగాడు.. అప్పుడు తాను ‘మహారాజ’ పేరు చెప్పానని కవితా గుప్తా తెలిపారు. ఆ తర్వాత మరో వేడుకలో కలిసినప్పుడు టామ్ హాంక్స్ స్వయంగా ఈ సినిమా ప్రస్తావన తెచ్చారన్నారు. 

ఈ చిత్రంపై ప్రశంశలు కురిపించడంతో పాటు ఇందులో విజయ్ సేతుపతి కూతురి పాత్రలో నటించిన సచానా నమిదాస్ నటనను కొనియాడారని.. “నేను ఇంకా ఆ అమ్మాయి నటన నుంచి బయటపడలేకపోతున్నాను” అని కామెంట్ చేశారని ఆమె వెల్లడించారు. ఆ కథలో తండ్రి పాత్ర చేసినట్లుగా తాను చేసి ఉండలేనని.. తనకైతే ఆ విలన్‌ను చంపేయాలన్నంత కోపం వచ్చేదని టామ్ హాంక్స్ భావోద్వేగంతో స్పందించినట్లు కవిత తెలిపారు. ఫారెస్ట్ గంప్, కాస్ట్ అవే సహా ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి ప్రపంచ సినీ చరిత్రలోనే అత్యుత్తమ నటుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న టామ్ హాంక్స్ నుంచి ఇలాంటి ప్రశంసలు పొందడం మహారాజ టీంకు గర్వకారణమే.

This post was last modified on November 27, 2026 11:24 am

Share

Recent Posts

రాజీ కుదిర్చే భారం చిరంజీవి మీదే

సంక్రాంతికి విడుదల కాబోతున్న సినిమాల విషయంలో చిరంజీవికి ఎదురవుతున్న సందిగ్దత గురించి నెలరోజులకు పైగానే సోషల్ మీడియాలో రకరకాల డిస్కషన్లు…

11 minutes ago

14 ఏళ్ల నాగ్ రికార్డు బద్దలు

నవంబర్ అంటే సినిమాలకు అసలు కలిసి రాని నెల అనే ఒక ముద్ర పడిపోయింది. ఒక 10 ఏళ్ల లెక్కలు…

5 hours ago

ఓటుకు 60 వేల రూపాయలా… వామ్మో..!

రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల వార్తలు విస్మయం కలిగిస్తున్నాయి. సర్పంచ్ పదవి అంటేనే గ్రామం మీద పెత్తనం చేయడమని కొందరి భావన.…

5 hours ago

జగన్ స్వగ్రామంలో టీడీపీ జెండా రెపరెపలు

రాష్ట్రంలో జరిగిన తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కూడా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఆధిపత్యం స్పష్టంగా నిరూపించుకుంది.  మున్సిపల్ ఎన్నికల…

11 hours ago

సుకుమార్ ఇన్వాల్వ్ అయితే

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో సుకుమార్ కు ఉన్న క్రెడిబిలిటీ, ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ వేరు. ఆయన తీసే సినిమాలే కాదు…

13 hours ago

అలియాస్ రుక్మిణీ… చేసేలా ఉంది బోణీ

చాలా కాలంగా నితిన్ సక్సెస్ లేక ఎంత ఇబ్బంది పడుతున్నాడో అభిమానులే కాదు సగటు మూవీ లవర్స్ కూడా గమనిస్తున్నారు.…

13 hours ago