వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, మండలిలో వైసీపీ సభాపక్ష నేత బొత్స సత్యన్నారాయణ తన రాజకీయ వారుసురాలిగా కూతురు బొత్స అనూషను ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో రంగంలోకి దింపిన సంగతి తెలిసిందే. తన కూతురిని జడ్పీ ఛైర్మన్ గా చూడాలన్న తపనతో బొత్స పావులు కదిపారు. అయితే, అనూహ్యంగా బొత్సకు షాక్ తగిలింది. విజయనగరం జిల్లా బొండపల్లి జడ్పీటీసీ ఎన్నికల బరిలో నిలిచిన అనూషకు ఆదిలోనే హంసపాదు పడింది.
తొలిసారి ఎన్నికల బరిలో దిగిన అనూష ఓటమిపాలయ్యారు. ఆమెపై టీడీపీ అభ్యర్థి పాశల నీరజ 5136 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. దీంతో, ఉత్తరాంధ్రలో బొత్స ప్రాభవం తగ్గుతోంది అనడానికి ఇది సంకేతంగా కనిపిస్తోంది. అంతేకాదు, ఇటీవల వైసీపీని వీడి పార్టీకంటే బొత్స సత్తిబాబుకు ఎక్కువ షాకిచ్చిన చిన్న శీను ఎఫెక్ట్ ఈ లోకల్ వార్ లో బాగా కనిపించింది. మరో పక్క కూతురి కులంపై వివాదంతో చిన్న శీను కూడా గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఇలా, బొత్స, చిన్న శీను విడిపోవడం వల్ల ఇద్దరూ నష్టపోయినట్లు కనిపిస్తోంది.
కాగా, కూతురు ఓటమిపాలై కుంగిపోయిన బొత్సకు కోడలు ఊరటనిచ్చారు. బొత్స కోడలు పూజిత విజయనగరం జిల్లా గరివిడి జడ్పీటీసీ స్థానం నుండి గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి కిమిడి సంధ్యపై 1,599 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. టీడీపీ తరఫున విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ రేసులో నిలవాలనుకున్న కిమిడి సంధ్యకు ఓటమి ఎదురైంది. టీడీపీ సీనియర్ నేత, చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు కోడలు సంధ్యకు తొలిపోరులోనే చుక్కెదురైంది.
This post was last modified on November 7, 2026 11:23 pm
మలయాళంలో చాలా చిన్న వయసులో నటిగా గొప్ప పేరు సంపాదించింది అనస్వర రాజన్. మోహన్ లాల్ ప్రధాన పాత్రలో ‘దృశ్యం’…
దేశంలో ఎమర్జెన్సీ విధించిన విషయం తెలిసిందే. 1975 జూన్ 25 నుండి 1977 మార్చి 21 వరకు సరిగ్గా 21…
నటులు దర్శకులుగా మారడం ఎప్పట్నుంచో చూస్తున్నాం. కానీ సూపర్ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నవాళ్లు మాత్రం దర్శకత్వం జోలికి వెళ్లడం అరుదు.…
వైసీపీ సీనియర్ నేత, శాసన మండలిలో విపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ వారసురాలిగా రాజకీయ అరం గేట్రం చేసిన బొత్స…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ మధ్య కొత్త లుక్ లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి క్లీన్ షేవ్…
వైసీపీ అధినేత జగన్ సొంత నియోజకవర్గం.. పులివెందుల పూర్తిగా టీడీపీ వశం అయిపోయింది. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో పులివెందుల…