“వివాహం పదికాలాల పాటు నిలవాలన్నా.. కొత్తగా పెళ్లిళ్లు చేసుకునేవారు సంతోషంగా ఉండాలన్నా.. ఈ కోర్సులో చేరండి” అంటూ గోవాకు చెందిన ‘కాలేజ్ ఆఫ్ హోం సైన్సెస్’ భారీ ప్రకటన ఇచ్చింది. ఈ కోర్సు వ్యవధి మొత్తం 15 నుంచి 20 రోజులు మాత్రమే. ఈ స్వల్ప వ్యవధిలోనే వివాహ బంధం.. అది ఎలా కొనసాగించాలి. చిరకాలం భార్యా భర్తలు అన్యోన్యంగా ఎలా ఉండాలి.. అనే అంశాలను బోధిస్తామని చెబుతోంది. అంతేకాదు.. వివాహానికి-సహజీవనానికి-డేటింగ్‌కు మధ్య వ్యత్యాసాలు.. సమాజ విలువలు, పిల్లల పెంపకం.. భార్యా భర్తలు ఇద్దరూ ఉద్యోగులు అయితే.. ఆ కుటుంబాలు ఎలా నడవాలన్న విషయాలను కూడా ఈ కోర్సులో భాగం చేసినట్టు పేర్కొంది.
ఈ కోర్సులో చేరాలనుకునే వారు నేరుగా గోవాకు వెళ్లాల్సిన అవసరం కూడా లేదని కాలేజీ తెలిపింది. ఆన్‌లైన్ ద్వారా కూడా ఈ కోర్సులో చేరవచ్చని పేర్కొంది. కేవలం 15-20 రోజుల వ్యవధి ఉండే ఈ కోర్సును డిసెంబరు 2వతేదీ నుంచి ప్రారంభించనున్నారట. దీనికి సంబంధించి గోవా సీఎం ప్రమోద్ సావంత్ కూడా ఓ ప్రకటన విడుదల చేశారు. ఇది అత్యంత విలువైన కోర్సు అని.. దీనిలో అనేక మంది నిపుణులు పాల్గొంటారని తెలిపారు. ప్రస్తుతం వివాహమైన దంపతులు కూడా ఈ కోర్సులో చేరవచ్చన్నారు. అలానే కొత్తగా పెళ్లిళ్లు చేసుకునే వారికి ఇదొక అద్భుత అవకాశమని కూడా పేర్కొన్నారు.
ఎందుకంటే.. !
దేశంలోనే తొలిసారిగా గోవా ప్రభుత్వమే అదికారికంగా ప్రారంభించిన ఈ కోర్సుకు కీలక కారణం ఉంది. గోవా రాష్ట్రంలో ఇటీవల కాలంలో భారీ సంఖ్యలో విడాకుల కేసులు పెరుగుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారమే.. 2022 నుంచి 2025 మధ్య గోవాలోని సివిల్ కోర్టుల్లో విడాకులు, వివాహ సంబంధిత కేసుల సంఖ్య 3000పైకే ఎగబాకింది. ఇక, 2024లో 995 మంది జంటలు విడిపోయాయి. ఈ పరిణామాల నేపథ్యంలో వివాహ బంధాన్ని పదిలంగా ఉంచాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈ కోర్సును ప్రారంభించినట్టు ముఖ్యమంత్రి ప్రకటనలో పేర్కొన్నారు. దేశంలోనే ఇది తొలిసారి అని కూడా చెప్పడం గమనార్హం.
ఎవరు చేరొచ్చు!
18 ఏళ్ల వయసు నిండిన యువతీయువకుల నుంచి ఎవరైనా ఈ కోర్సులో చేరవచ్చు. ఇప్పటికే పెళ్లిళ్లు అయిన వారు.. వివాహాలు చేసుకునే వారు.. అలానే.. ప్రయత్నాల్లో ఉన్నవారు ఇలా ఎవరైనా కూడా ఈ కోర్సులో చేరడం ద్వారా పెళ్లిళ్లు.. అనంతర కుటుంబ వ్యవస్థపై అవగాహన కల్పించనున్నారు. మొత్తం 15 రోజలు నుంచి 20 రోజుల్లోనే ఈ కోర్సు పూర్తికానుంది. దీనికి సంబంధించి సర్టిఫికెట్ కూడా ప్రభుత్వ రాజముద్రతో ఇవ్వనున్నారు. అయితే.. కోర్సుకు సంబంధించి ఫీజుల వివరాలను మాత్రం వెల్లడించలేదు.
This post was last modified on November 5, 2026 10:43 am
"జగనన్నా ఇది న్యాయమా? నమ్మినోళ్లే మమ్మల్ని ముంచేశారు. నిలువునా ఓడించారు. మాకు మాట మాత్రం కూడా సాయం చేయ లేదు.…
అమెరికా మిడ్ టర్మ్ ఎన్నికల ఫలితాల్లో అధికారంలో వున్న ట్రంప్ పార్టీ ఓటమి పాలయ్యింది. తగువులమారి తెంపరి ట్రంప్ కు…
రాష్ట్రంలో ఎన్నికల జాతర జరుగుతుంది. విజయోత్సలా ఊరేగింపులతో పండుగ వాతావరణం నెలకొంది. మున్సిపల్ ఎన్నికల్లోనూ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే రిపీట్…
వీరసింహారెడ్డి కాంబినేషన్ రిపీట్ చేస్తూ బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో రూపొందుతున్న దాదా డిసెంబర్ 24 నుంచి వాయిదా…
ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో కొత్త వెబ్ సిరీస్ 'అక్క' స్ట్రీమింగ్ అవుతోంది. కీర్తి సురేష్, రాధికా ఆప్టే ప్రధాన…
టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరయ్యా అంటే ఇప్పటికీ ముందు వరసలో వినిపించే పేరు తమన్. అయితే తన స్థాయికి…