తమిళనాడులో చిన్నమ్మగా పాపులరైన శశికళ విషయంలో ఏమి జరుగుతోందో అర్ధంకాక ఆమె అభిమానులు టెన్షన్ పడిపోతున్నారు. ఈనెల 27వ తేదీన బెంగుళూరులోని పరప్పన అగ్రహార జైలు నుండి శశికళ విడులవుతారని అందరు ఆశతో ఎదురు చూస్తున్నారు. ఆమె విడుదల సందర్భంగా జైలు నుండి తమిళనాడులో ఆమె నివాసం వరకు భారీ స్వాగత ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. 27వ తేదీన విడులయ్యే చిన్నమ్మను ఊరేగింపుగా చెన్నైకు తీసుకెళ్ళేందుకు వెయ్యికార్లతో భారీ ర్యాలీని కూడా ఆమె మద్దతుదారులు రెడీ చేస్తున్నారు.
ఇంతలో చిన్నమ్మ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారనే విషయం బయటపడటంతో అభిమానుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఆమె ఆరోగ్య పరిస్ధితిని తెలుసుకునేందుకు తమిళనాడులోని నాలుగు మూలల నుండి ఆమె మద్దతుదారులు బెంగుళూరుకు చేరుకుంటున్నారు. కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అవ్వటంతో చిన్నమ్మను బెంగుళూరులోని విక్టోరియా ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. జ్వరం, వెన్నునొప్పితో శ్వాశ తీసుకోవటంలో చిన్నమ్మ బాగా ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం.
జైలులో ఉన్నపుడు శశికళకు అనారోగ్యం మొదలైంది. దాంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో రక్త పరీక్షలు చేసినపుడు ఆమెకు కరోనా వైరస్ సోకినట్లు గుర్తించారు. అలాగే ఆమె ఊపిరితిత్తులు కూడా బాగా దెబ్బతినటం వల్లే శ్వాశ తీసుకోవటంలో ఇబ్బందులు పడుతున్నట్లు డాక్టర్లు గుర్తించారు. ఇక హైబీపీ, షుగర్ అదనంగా తోడవ్వటంతో ఆమె పరిస్ధితి బాగా సీరియస్ గానే ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు.
గతంలో అంటే దివంగత ముఖ్యమంత్రి జయలలిత తర్వాత శశికళే ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోవటానికి అన్నీ ఏర్పాట్లు జరిగిపోయాయి. ఇక కొద్దిగంటల్లో చిన్నమ్మ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుంటారనే సమయంలో హఠాత్తుగా ఆమె అరెస్టయ్యారు. ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో జయలలితతో పాటు శిక్షపడిన శశికళను అరెస్టు చేసి వెంటనే కర్నాటక జైలుకు అప్పట్లో అధికారులు తరలించుకుపోయారు.
అప్పట్లో సీఎం పీఠం ఎక్కే కొద్దిగంటల ముందు జైలుపాలయ్యారు. ఇపుడు మరో వారంరోజుల్లో జైలు నుండి బయటపడతారని అందరు అనుకుంటుంటే హఠాత్తుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరటాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అందులోను ఆమె ఆరోగ్యపరిస్ధితి చాలా విషమించిందనే వార్త తమిళనాడులో సంచలనంగా మారింది. ఎన్నికలకు ముందు చిన్నమ్మ కేంద్రంగా జరుగుతున్న పరిణామాలను అభిమానులు, పార్టీ నేతలు తట్టుకోలేకపోతున్నారు. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.
This post was last modified on January 23, 2021 11:57 am
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…