స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు భారీ షాకే తగిలింది. ఈ క్రమంలో కొందరు మాత్రమే విజయం దక్కించుకోగా.. మెజారిటీ సభ్యులు ఓడిపోయారు. అయితే.. గెలుపు ఓటములు సహజం అనుకున్నా.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలమనేరు మునిసిపాలిటిలో పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి ప్రసాద్‌రెడ్డి వింత వాదనతో సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేయడం కలకలం రేపింది. ఎన్నికల్లో డబ్బులు పంచినట్టు ఆయనే స్వయంగా ఒప్పుకొన్నారు.
పలమనేరు మున్సిపాలిటీలోని 32వ వార్డు నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున ప్రసాద్ రెడ్డి అభ్యర్థిగా పోటీ చేసి, జనసేన అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. దాదాపు ఇరువురి మధ్య 350 పైచిలుకు ఓట్ల తేడా ఉంది. ఈ నేపథ్యంలో ప్రసాద్ రెడ్డి.. తాను ఎన్నికల్లో ఓటుకు వెయ్యి చొప్పున పంపిణీ చేశానని.. కానీ, తనను ఓడించారని.. తనకు ఓటు వేయని(జనసేన అభ్యర్థికి వచ్చిన మెజారిటీ ఓట్లు) వారు ఆ సొమ్మును తనకు తిరిగి ఇవ్వాలనిడిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన రూ. 10 వడ్డీకి దాదాపు రూ. 10 లక్షలు అప్పుగా తెచ్చినట్టు తెలిపారు.
ప్రతి ఇంటికీ వెళ్లి.. ఓటుకు వెయ్యి రూపాయల చొప్పున ఓటర్లకు పంపిణీ చేసినట్లు స్వయంగా ఆ వీడియోలో పేర్కొన్నారు. దాదాపు 350 మంది తనకు ఓటు వేయకుండా మోసం చేశారని ఆయన ఆక్రోశం వ్యక్తం చేశారు. “నాకు ఓటు వేయని వారంతా నా డబ్బులు నాకు తిరిగి ఇచ్చేయండి, లేదంటే మీ ఇళ్ల ముందు వచ్చి కూర్చుంటా” అంటూ ప్రసాద్ రెడ్డి విడుదల చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నిబంధనల ప్రకారం..
వాస్తవానికి నిబంధనల ప్రకారం.. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకూడదు. డబ్బు, వస్తువులు వంటి వాటిని పంపిణీ చేయకూడదు. వీటికి ఆధారాలు లభిస్తే.. ఎన్నికల సంఘం సిఫారసుతో పోలీసులు కేసులు పెడతారు. అయితే.. ఇప్పటి వరకు ఇలా ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు. గతంలో తెలంగాణలోనూ ఇలానే అభ్యర్థి ఒకరు ఇంటింటికీ తిరిగి తాను పంచిన సొమ్మును వసూలు చేసుకునే ప్రయత్నం చేశారు. ఇది వివాదంగా మారి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక, తాజాగా కేసు పెట్టలేదు కానీ.. టీడీపీ నాయకులు మాత్రం వైసీపీ నేత పరిస్థితిని చూసి ఎద్దేవా చేస్తున్నారు.
This post was last modified on November 4, 2026 3:07 pm
ఏపీలో వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కూటమి బలపరిచిన అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. తమ…
"ఎన్ని స్థానాల్లో పోటీ చేశామన్నది కాదు.. పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ గెలవాలన్నదే ముఖ్యం" అంటూ.. జనసేన అధినేత, ఉప…
స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత.. ఆ పార్టీ అధిపతి, మాజీ సీఎం జగన్‌కు ఎక్కడో తీవ్రమైన…
రాష్ట్రంలో జరిగిన పురపాలక సంఘం ఎన్నికలలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పూర్తి స్థాయిలో విజయం సాధించింది. అయితే కార్పొరేషన్…
బెల్లంకొండ సాయిశ్రీనివాస్ లాంటి మాస్ బ్యాకప్ ఉన్న హీరో సినిమా మూడేళ్లకు పైగా మోక్షం దక్కించుకోకుండా ల్యాబులోనే మగ్గుతూ ఉండటాన్ని…
ఎనిమిది సంవత్సరాల క్రితం వచ్చిన ఈ నగరానికి ఏమైంది థియేటర్ పరంగా ఆశించిన పెద్ద విజయం అందుకోలేదన్నది వాస్తవం. నిన్న…