ఓమ్ విడుదలయ్యాక సంగీత దర్శకుడు సాయి అభ్యంక్కర్ పనితనం గురించి మ్యూజిక్ లవర్స్ లో ఎడతెగని చర్చ జరుగుతోంది. ఈ సినిమాకు ఇంత హైప్ రావడంలో అతను కంపోజ్ చేసిన రెండు పాటల పాత్ర చాలా ఉంది. ముఖ్యంగా ఫస్టాఫ్ లో వచ్చే మొదటి సాంగ్ గొప్పగా పేలింది. అయితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో అంచనాలు పూర్తిగా అందుకోలేదనే కామెంట్స్ సాధారణ ప్రేక్షకుల నుంచి క్రిటిక్స్ దాకా అత్యధిక శాతం వర్గాల నుంచి వినిపించింది. క్లైమాక్స్ లాంటి ఎపిసోడ్స్ తను సరిగా హ్యాండిల్ చేయలేదు.
ఇక్కడ అనిరుధ్ ప్రస్తావన ఎందుకంటే బిజిఎం పనితనంలో తనకు సాటివచ్చేవాళ్ళు దగ్గర్లో లేరు. ఒక మాములు సన్నివేశాన్ని కూడా తన సౌండ్ తో పదింతలు ఎలివేట్ అయ్యేలా చేయడంలో అతని శైలికి పోటీ ఇవ్వడం అంత సులభం కాదు. జైలర్, దేవర, విక్రమ్ విజయాల్లో తన కాంట్రిబ్యూషన్ ఆ స్థాయిలో ఉండటం వల్లే రెమ్యునరేషన్ ఎంత అడిగినా నిర్మాతలు రెడీ అవుతున్నారు. ఆడియో కంపెనీలు కూడా కాంప్రొమైజ్ లేకుండా హక్కుల కోసం కోట్ల రూపాయలు ధారపోస్తున్నారు.
అయితే కొంత కాలంగా అనిరుధ్ కి తన రేంజు బ్లాక్ బస్టర్ పడలేదు. సబ్జెక్టు బాగుండి ఎగ్జైట్ చేస్తేనే అతని నుంచి బెస్ట్ రాబట్టుకోవచ్చు. అలా కాకుండా యావరేజ్ లేదా బిలో యావరేజ్ ప్రోడక్ట్ ఇస్తే తనైనా ఏం చేయలేడు. సాయి అభ్యంక్కర్ ప్రస్తుతం ఈ అంశం మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. నేపధ్య సంగీతం విషయంలో ఏఆర్ రెహమాన్, ఇళయరాజా, హారిస్ జైరాజ్ లాంటి వాళ్ళు సెట్ చేసిన స్టాండర్డ్స్ అందుకోవాలంటే ఏం చేయాలో దాని మీద కసరత్తు మొదలుపెట్టాలి. కేవలం పాటలతో పనవ్వదు.
ఇదంతా తెలుసు కాబట్టే నిర్మాతలు ఇప్పటికీ అనిరుధ్ రవిచందర్ నే ఫస్ట్ ఛాయస్ గా పెట్టుకున్నారు. సాయి అభ్యంన్కర్ చేతిలో ప్రస్తుతం అల్లు అర్జున్ రాకా ఉంది. ఇది ఎంత క్రేజీ ప్రాజెక్టో చెప్పనవసరం లేదు. బన్నీ, అట్లీ ఇద్దరూ రాజీపడే రకాలు కాదు. దీనికి కనక సాయి మంచి స్కోర్ ఇస్తే ఇంటర్నేషనల్ లెవెల్ లో పేరు మారుమ్రోగుతుంది. ఆ స్థాయిలో మార్కెటింగ్ చేయబోతున్నారు. సో అనిరుధ్ ని మ్యాచ్ చేయాలన్నా లేక దాటాలన్నా సాయి అభ్యంక్కర్ బాగా కష్టపడాల్సిందే.
This post was last modified on November 24, 2026 8:46 am
మూడు వారాల ముందు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ల సినిమా ‘ఆదర్శ కుటుంబం’ నుంచి ఒక…
త్వరలోనే తెలంగాణాకు మరో డిప్యూటీ సీఎం వస్తారని జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొండా సురేఖను మంత్రి వర్గం నుంచి తొలిగించినప్పటి…
పెద్ది సినిమాలో తన పాత్రను ప్రెజెంట్ చేసిన తీరు గురించి బాలీవుడ్ భామ జాన్వి కపూర్ ఈ మధ్య కాఫీ…
శ్రీవిష్ణు ఈసారి సంక్రాంతికి సందడి చేయబోతున్నాడు. ఈ ఏడాది నారి నారి నడుమ మురారిలో చిన్న క్యామియో చేసి ఆ…
ఈసారి బాక్సాఫీస్ పోటీ చాలా విచిత్రంగా జరుగుతోంది. శుక్రవారం విడుదలైన వాటిలో ఈ నగరానికి ఏమైంది రిపీట్ కు యూత్…
పట్టువదలని విక్రమార్కుడి బిరుదు ఎవరికైనా ఇవ్వాలంటే ముందు వరసలో ఉండే వాళ్లలో విజయ్ ఆంటోనీ పేరు ఉంటుంది. ఎందుకంటే బిచ్చగాడు…