రాష్ట్రం మొత్తంలో వైసీపీ పరిస్థితి, జగన్ పరిస్థితి ఎలా ఉన్నా.. తమకు పుట్టిల్లయిన.. పులివెందులలో మాత్రం ఒక ప్రతిష్టాత్మకం. అందుకే ఇక్కడ అయినా.. పార్టీ విజయం దక్కించుకుని తీరాలని జగన్ భావించారు. కానీ, దీనికి భిన్నంగా తాజాగా జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో పులివెందుల కూడా పోయింది. మంగళవారం ఉదయం ప్రారంభమైన పులివెందుల మునిసిపల్ ఎన్నికల్లో వైసీపీ తరఫున బరిలో ఉన్న మునిసిపల్ చైర్ పర్సన్ అభ్యర్థి వైఎస్ ప్రమీల కొంత మేరకు పుంజుకునే రేంజ్‌లో కొనసాగారు. దీంతో ప్రమీల గెలుస్తున్నారంటూ వార్తలు హల్చల్ చేశాయి. అయితే.. కౌంటింగ్ రౌండ్లు పెరుగుతున్న కొద్దీ ప్రమీల పలాయనం చిత్తగించారు.
చివరి రౌండ్ కౌంటింగ్ ముగిసే సరికి.. పులివెందులలో టీడీపీ చైర్ పర్సన్ అభ్యర్థి గీతా కుమారి విజయం దక్కించుకున్నారు. ఆమె 13875 ఓట్ల మెజారిటీ దక్కించుకున్నారు. దీంతో వైసీపీ ఖాతాలో కొన్ని దశాబ్దాలుగా ఉన్న పులివెందుల ప్రస్తుతం కూటమిలోని టీడీపీ ఖాతాలోకి చేరింది. ఈ పరిణామం ఏమీ చిన్నది కాదు. దీనికి చాలా వ్యూహాత్మకంగా టీడీపీ వ్యవహరించింది. పక్కా ప్రణాళికతలో ముందుకు సాగింది. ముఖ్యంగా సీనియర్ నాయకుడు బీటెక్ రవి సహా.. స్థానిక కేడర్ కూడా పట్టుదలతో పులివెందులను దక్కించుకునేందుకు కృషి చేశారు. ఈ పరిణామాలే కలిసి వచ్చాయి. జగన్ దర్నాకు దిగినా.. ఫలితం దక్కలేదు. సింపతీ కూడా రాలేదు.
పులివెందులలోని మొత్తం 40 వార్డులకు గాను 20 వార్డుల్లో జరిగిన ఎన్నికల పోలింగ్‌లో 17 వార్డుల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి అభ్యర్థులు విజయం దక్కించుకున్నారు. ఇప్పటికే జరిగిన ఏకగ్రీవాలతో కలిపి మొత్తంగా 40 వార్డుల్లో 37 చోట్ల కూటమి గెలుపు గుర్రం ఎక్కింది. వీటి రెండు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు, జనసేన తరఫున బరిలో నిలిచిన అభ్యర్థి కూడా గెలుపు గుర్రం ఎక్కారు. ఇక, మరో 3 స్థానాల్లో మాత్రమే వైసీపీ అభ్యర్థులు గెలిచారు. దీంతో వైసీపీకి కౌన్సిల్‌లో బలం లేకుండా పోయింది. కనీసం సంఖ్యా బలం కూడా లేకపోవడం గమనార్హం.
కడప వ్యాప్తంగా కూడా..
కడప జిల్లా వ్యాప్తంగా కూడా.. వైసీపీ ప్రభావం కోల్పోయింది. పులివెందులలో వైసీపీ మూడు స్థానాలు దక్కించుకోగా.. కడప జిల్లాలోని బద్వేలు, జమ్మలమడుగు, కమలాపురం, మైదుకూరు, ప్రొద్దుటూరు, రాజంపేట, యర్రగుంట్ల మున్సిపాలిటీలను కూడా వైసీపీ దారుణంగా కోల్పోయింది. ఇది పూర్తిస్థాయిలో కూటమికి కలిసి వచ్చింది. వైసీపీ నేతలు.. ఘోర పరాజయం పాలయ్యారు.
This post was last modified on November 3, 2026 9:09 pm
ఈ నగరానికి ఏమైంది.. పెళ్ళిచూపులుతో సెన్సేషన్ క్రియేట్ చేశాక తరుణ్ భాస్కర్ తీసిన సినిమా. ఎనిమిదేళ్ల కిందట ఈ చిత్రం…
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఐక్యంగా ముందుకు సాగినా.. క్షేత్రస్థాయిలో నెలకొన్న అసంతృప్తుల కారణంగా.. ఆయా పార్టీల నుంచి రెబల్స్…
హిందీ సినిమాల రిలీజులతో మనకు పెద్ద సమస్య ఉండదు కానీ షారుక్ ఖాన్ లాంటి స్టార్ హీరో ఉన్నాడంటే అంత…
వైసీపీ తిరుపతి ఎంపీ గురుమూర్తిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. "ఎంపీగారు అతిగా స్పందిస్తున్నారు. ఇలా అయితే.. భారీ జరిమానాను…
టాలీవుడ్లో ఇమేజ్, ఫ్యాన్స్ అని లెక్కలు వేసుకోకుండా.. కలెక్షన్లు, రికార్డుల గురించి అస్సలు పట్టించుకోకుండా సినిమాలు చేసే హీరో విక్టరీ…
స్వీయ దర్శకత్వంలో, ఎవరూ టచ్ చేయని జానర్ అంటూ పూర్తిగా వయొలెంట్ రూటు పట్టిన విశ్వక్ సేన్ కు 'కల్ట్'…