పార్టీ పరంగా గెలుపు ఓటములు ఎలా ఉన్నా.. కీలకమైన ఎన్నికల్లో పోటీ చేయడమే గొప్ప అనేలా వైసీపీ వ్యవహారం ఉందా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి పార్టీల హవా పెద్ద ఎత్తున పెరిగిన నేపథ్యంలో వైసీపీకి చోటు లేదని అందరూ అనుకున్నారు. ఆది నుంచి కూడా కూటమి పార్టీలు ఏకగ్రీవాలకు ప్రాధాన్యం ఇచ్చాయి. అలానే కొన్ని మునిసిపాలిటీలు, కొన్ని చోట్ల పూర్తిగా వార్డులను కూడా పార్టీలు సొంతం చేసుకున్నాయి. దీంతో ఏకగ్రీవాలు మరింత పెరుగుతాయని అనుకున్నారు.
అయితే.. ఈ క్రమంలోనే వైసీపీ కూడా బలమైన పోటీ ఇచ్చిందన్న చర్చ జరుగుతోంది. నిజానికి కూటమి ప్రతిష్టాత్మ కంగా భావించిన కుప్పం, పులివెందుల, పిఠాపురం వంటి కీలక ప్రాంతాల్లో వైసీపీ పోటీ చేయడం గమనార్హం. గెలు స్తారా? ఓడుతారా? అనేది పక్కన పెడితే.. ఇంత తీవ్రమైన పోటీలో కూడా వైసీపీ నాయకులు పోటీ చేయడం వైసీపీకి కలిసి వస్తున్న అంశంగానే చెబుతున్నారు. నిజానికి 2021లో వైసీపీ ఎఫెక్ట్‌తో టీడీపీ పూర్తిగా పోటీ నుంచే తప్పుకొంది. అప్పట్లో ఎన్నికల్లో పోటీ చేసేది లేదని చంద్రబాబు స్వయంగా ప్రకటించారు.
కానీ, దీనికి భిన్నంగా.. అసెంబ్లీలో 11 స్థానాలకే పరమితం అయినప్పటికీ.. రెండున్నరేళ్లుగా అసెంబ్లీకి కూడా రాకుండా ఉన్నప్పటికీ.. వైసీపీ నాయకులు పోటీచేయడం ఆ పార్టీలో చర్చకు దారితీసింది. మరీ ముఖ్యంగా సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోను, జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో కూడా.. వైసీపీ చాలా వరకు వార్డుల్లో పోటీ చేయడం చర్చకు దారితీసింది. అలానే.. ఆయా ప్రాంతాల్లో కొన్ని ఘర్షణలు జరిగినా వైసీపీ నాయకులు నిలదొక్కుకునే ప్రయత్నం చేశారని.. తాము గెలుస్తామా లేదా అనేది పక్కన పెడితే.. ఇది తమకు సంతృప్తేనని అంటున్నారు.
జగన్‌కు కూడా..
వైసీపీ అధినేత జగన్‌కు కూడా ఇదే సంతృప్తి మిగిలిందని చెప్పాలని ఒకరిద్దరు నాయకులు అంటున్నారు. ఎన్నిక ల్లో అసలు పోటీ చేసే పరిస్థితి ఉండదని ముందు నుంచి అనుకున్నామన్నారు. కానీ, చివరి నిమిషంలో పోటీకి రెడీ అయ్యామని అంటున్నారు. తాము గెలిచినా.. గెలవకపోయినా.. పోటీలో ఉన్నామన్న సంతృప్తి మిగిలిందని అంటు న్నారు. ఈ పరిణామాలు తమ పార్టీకి కొత్త ఊపు తెస్తాయని.. సజ్జల రామకృష్నారెడ్డి ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. మొత్తంగా స్థానిక ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయడం వరకు చాలు అనే సంతృప్తిలో జగన్ ఉన్నారన్నది పార్టీ వర్గాల మాట.
This post was last modified on November 3, 2026 5:40 pm
రాష్ట్రం మొత్తంలో వైసీపీ పరిస్థితి, జగన్ పరిస్థితి ఎలా ఉన్నా.. తమకు పుట్టిల్లయిన.. పులివెందులలో మాత్రం ఒక ప్రతిష్టాత్మకం. అందుకే…
ఈ నగరానికి ఏమైంది.. పెళ్ళిచూపులుతో సెన్సేషన్ క్రియేట్ చేశాక తరుణ్ భాస్కర్ తీసిన సినిమా. ఎనిమిదేళ్ల కిందట ఈ చిత్రం…
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఐక్యంగా ముందుకు సాగినా.. క్షేత్రస్థాయిలో నెలకొన్న అసంతృప్తుల కారణంగా.. ఆయా పార్టీల నుంచి రెబల్స్…
హిందీ సినిమాల రిలీజులతో మనకు పెద్ద సమస్య ఉండదు కానీ షారుక్ ఖాన్ లాంటి స్టార్ హీరో ఉన్నాడంటే అంత…
వైసీపీ తిరుపతి ఎంపీ గురుమూర్తిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. "ఎంపీగారు అతిగా స్పందిస్తున్నారు. ఇలా అయితే.. భారీ జరిమానాను…
టాలీవుడ్లో ఇమేజ్, ఫ్యాన్స్ అని లెక్కలు వేసుకోకుండా.. కలెక్షన్లు, రికార్డుల గురించి అస్సలు పట్టించుకోకుండా సినిమాలు చేసే హీరో విక్టరీ…