మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ హైదరాబాద్ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఈ సందర్భంగా AI, డీప్‌ఫేక్ టెక్నాలజీ దుర్వినియోగంపై తమ ఆందోళనలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
AI ద్వారా తయారు చేస్తున్న ఫేక్ వీడియోలు, డీప్‌ఫేక్ కంటెంట్ వల్ల నటీనటులు, కళాకారులు, సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.
ఈ భేటీ తర్వాత రామ్ చరణ్ స్పందిస్తూ.. తమ ఆందోళనలపై అమిత్ షా సానుకూలంగా స్పందించడం సంతోషంగా ఉందని తెలిపారు.
ఈ సమస్యపై అత్యవసరంగా పరిశీలన జరిపి, AI దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు కఠినమైన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి హామీ ఇచ్చినట్లు చరణ్ వెల్లడించారు.
కళాకారులు, సినీ పరిశ్రమను AI దుర్వినియోగం నుంచి కాపాడేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు రామ్ చరణ్ పేర్కొన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates