సంతోషంలో చాలా మంది చుట్టూ చేరుతారు, ఆపదలో వున్నప్పుడు అండగా నిలబడేది స్నేహితుడు ఒక్కడే. ఆ సత్యాన్ని అక్షరాలా నిరూపించింది లక్ష్మి. రాప్తాడు స్కూల్లో పదవ తరగతి విద్యార్థిని గోపిక మీద హేమంత్ అనే దుండగుడు రంపంతో దాడి చేయడం తెలిసిందే. ఈ ఘటన జరుగుతున్నప్పుడు క్లాస్ టీచర్ తో సహా మిగతా విద్యార్థినులంతా భయపడి పారిపోయారు. ఒక్క లక్ష్మి మాత్రమే హేమంత్ ను అడ్డుకునేందుకు ప్రయత్నం చేసింది. గోపికను కాపాడడానికి సాహసం చేసింది. ఇప్పుడు రాష్ట్ర ప్రజలంతా లక్ష్మి ధైర్యాన్ని తెగ పొగుడుతున్నారు.
రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10 వ తరగతి చదువుతున్న గోపిక శనివారం తరగతి గదిలో చదువుకుంటుంది. మ్యాథ్స్ టీచర్ రాజేశ్వరి క్లాస్ చెబుతున్నారు. పిల్లలంతా సీరియస్ గా చదువుకుంటున్న సమయంలో ఎలక్ట్రిక్ రంపం చేతిలో పట్టుకొని హేమంత్ క్లాస్ రూంలో ప్రవేశించాడు. వచ్చి రాగానే గోపిక మీద పడ్డాడు. రంపపు బ్లేడు తో ముఖం, తల, మెడ, గొంతు మీద రంపంతో కోసాడు. కుడి చేయి దాదాపుగా తెగిపోయేంత తీవ్రంగా గాయపడింది.
ఈ ఘటన జరుగుతున్న సమయంలో క్లాస్ టీచర్ రాజేశ్వరి కళ్లు తిరిగి పడిపోయినట్లు చెబుతున్నారు. క్లాస్ లో వున్న పిల్లలంతా భయంతో కేకలు వేస్తూ పారిపోయారు. అయితే గోపిక స్నేహితురాలు లక్ష్మి మాత్రం అక్కడి నుంచి కదల్లేదు. గోపికను కాపాడేందుకు శత విధాల ప్రయత్నం చేసింది. దీంతో నిందితుడు హేమంత్ ఆమె మీద కూడా దాడికి దిగాడు. ఈ దాడిలో లక్ష్మీ కాలికి తీవ్ర గాయాలయ్యాయి. అయినా భయపడలేదు. స్నేహితురాలికి రక్షణ కల్పించడం గురించే ఆలోచించింది.
స్నేహితురాలిని కాపాడేందుకు తన ప్రాణాన్ని ఫణంగా పెట్టిన లక్ష్మి ప్రస్తుతం బెంగళూరు హాస్పిటల్ లో చికిత్స పొందుతుంది. టెన్షన్ కు గురైన ఆమె ఆరోగ్యం నిలకడగా వుందని వైద్యులు తెలిపారు. లక్ష్మి చూపిన అసాధారణ ధైర్యసాహసాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు , పలువురు ప్రముఖులు అభినందించారు. లక్ష్మి పూర్తిగా కోలుకునేంత వరకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు.
This post was last modified on November 2, 2026 4:55 pm
గత శుక్రవారం రిలీజైన ‘ఆదర్శ కుటుంబం’ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ వీకెండ్లో మంచి వసూళ్లే రాబట్టింది. ఐతే ఈ…
వైసీపీ మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పార్టీ ఏర్పాటు ముహూర్తం చర్చగా మారడం తెలిసిందే. విజయసాయి వైసీపీలోనూ, జగన్…
మురసు తుఫాన్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ముందస్తు చర్యలపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో…
70 ఏళ్లు పైబడ్డా సరే, ఈ వయసులోనూ మెగాస్టార్ చిరంజీవి చాలా ఉత్సాహంగా సినిమాలు చేస్తున్నారు. ఈ తరం దర్శకులతోనూ…
మేకింగ్ టైంలో మాత్రం తాపీగా షూటింగ్ చేయడం.. అవసరం లేని షాట్లు తీసుకోవడం.. యాక్టర్ల డేట్లు వేస్ట్ చేయడం.. రీషూట్లు…
కొన్ని రోజుల కిందట బాలీవుడ్ స్టార్ టైగర్ ష్రాఫ్ మీద నడి రోడ్డుపై కొందరు దుండగులు తుపాకులతో దాడికి పాల్పడడం…