Political News

ఆప‌ద వేళ‌.. అర్ధ‌రాత్రి వ‌ర‌కు… చంద్ర‌బాబు రివ్యూలు!

మురసు తుఫాన్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ముందస్తు చర్యలపై దృష్టి సారించారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఆదివారం అర్ధ‌రాత్రి దాటాక కూడా అమ‌రావ‌తిలోని ఆర్టీజీఎస్ కేంద్రంలోనే ఉండి.. స‌మీక్ష‌లు నిర్వ‌హించారు. నిజానికి ఆదివారం ఉద‌యం నుంచి రాత్రి వ‌ర‌కు కూడా స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల పోలింగ్ జ‌రిగింది. ఈ క్ర‌మంలో ఒక‌వైపు ఆ విష‌యాల‌ను ప‌రిశీలిస్తూ.. పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు దిశానిర్దేశం చేశారు. మ‌రోవైపు మురసు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో భారీ ఎత్తున విద్యుత్ స్తంభాలు నేలకొరిగే ప్రమాదం ఉందనే సూచనలను దృష్టిలో పెట్టుకుని, అదేవిధంగా లోత‌ట్టు ప్రాంతాలు, జిల్లాల్లో ప‌రిస్థితుల‌ను తెలుసుకుని వాటిపైనా దృష్టి సారించారు.

ఇదే స‌మ‌యంలో క‌ర్ణాట‌క‌, తెలంగాణ‌, త‌మిళ‌నాడు వంటి పొరుగు రాష్ట్రాలతో సమన్వయం చేసుకునే ప‌నిలో ప‌డ్డారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు విజయ్, డీకే శివకుమార్ లతో సీఎం చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. తుఫాను నేపథ్యంలో విద్యుత్ వ్యవస్థల పునరుద్ధరణ పనులకు అవసరమైన సిబ్బందిని, యంత్రాలను పంపాలని రెండు రాష్ట్రాల సీఎంలను ఆయన కోరారు. దీనిపై ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు సానుకూలంగా స్పందించారు. ఏపీకి అవసరమైన మేరకు సహకరిస్తామని తెలిపారు. ఇప్ప‌టికే అర్నబ్ తుఫాను వల్ల దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను పునరుద్దరించే పనుల నిమిత్తం తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చిన సిబ్బంది క్షేత్రస్థాయిలో విధుల్లో ఉన్నారు.

మరోవైపు అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పునరుద్దరణ పనులను ముగించుకున్న పలువురు విద్యుత్ శాఖ సిబ్బందిని ముందు జాగ్రత్తగా మురసు తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు ఏపీ ప్రభుత్వం సిద్దంగా ఉంచింది. ఇక‌, రాష్ట్రంపై ముర‌సు తుఫాను ప్రభావం, వర్షాలు, గాలుల అంచనాలు, జలాశయాల పరిస్థితిపై ముఖ్యమంత్రి రివ్యూ నిర్వ‌హించారు. తుఫాను ప్రభావం నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై అధికారుల‌కు దిశానిర్దేశం చేశారు. సోమ‌వారం దక్షిణ, మధ్య కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, అక్కడక్కడ అతిభారీ వర్షాలు కురిసే అవ‌కాశం ఉండ‌డంతో ఆయా ప్రాంతాల ప్ర‌జ‌ల ప‌రిస్థితులు, ప్ర‌స్తుతం కురుస్తున్న వ‌ర్షాల వివ‌రాల‌ను తెలుసుకుని ప‌లు అంశాల‌పై ఆయ‌న దిశానిర్దేశం చేశారు.

ఢిల్లీ ప‌ర్య‌ట‌న ర‌ద్దు..

ముంద‌స్తు షెడ్యూల్ ప్ర‌కారం సీఎం చంద్ర‌బాబు సోమ‌వారం ఢిల్లీలో ప‌ర్య‌టించాల్సి ఉంది. పున‌రుత్పాద‌క ఇంధ‌న స‌ద‌స్సుకు ఆయన హాజ‌రై.. ఏపీలో చేప‌డుతున్న ప‌నుల‌ను వివ‌రించి పెట్టుబ‌డుల‌కు మార్గాన్ని సుగ‌మం చేయాల‌ని భావించారు. అయితే, తుఫాను హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో ఢిల్లీ పర్యటనను కూడా సీఎం చంద్ర‌బాబు రద్దు చేసుకున్నార‌ని ముఖ్య‌మంత్రి కార్యాల‌యం ప్ర‌క‌టించింది. ఈ మ‌ధ్య‌కాలంలో ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దు చేసుకోవ‌డం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. సోమ‌వారం కూడాపూర్తిస్థాయిలో తుఫాను ప్ర‌భావంపైనే సీఎం చంద్ర‌బాబు దృష్టి సారించ‌నున్నారు.

This post was last modified on November 2, 2026 3:21 pm

Share

Recent Posts

పరిటాల కలను నెరవేర్చిన కుమారుడు శ్రీరామ్

శ్రీస‌త్య‌సాయి జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్‌గా.. శ‌నివారం  సీనియ‌ర్ నాయ‌కుడు, దివంగ‌త ప‌రిటాల ర‌వి వార‌సుడు ప‌రిటాల శ్రీరాం ప్ర‌మాణ స్వీకారం…

2 hours ago

యలహంక ప్యాలెస్… ఇప్పుడేం చెప్తారు జగన్?

బెంగుళూరులోని యలహంక ప్యాలెస్ విషయంలో వైసీపీ అధినేత జగన్, ఆయన సోదరి వైఎస్ షర్మిలల మధ్య వివాదం ముదిరి పాకానపడినట్లు…

2 hours ago

కామెంట్లు చేసినోళ్లే కలెక్షన్లు కుమ్మరిస్తారు

అనిల్ రావిపూడి సినిమా వస్తోందంటే సోషల్ మీడియాలో ఒక వర్గం అలెర్టయిపోతుంది. కామెడీ పేరుతో క్రింజ్ చేస్తున్నాడని కొందరు, టీవీ…

3 hours ago

చైతు చేయి జారనున్న మంచి ఛాన్స్ ?

డిసెంబర్ 4 విడుదల కావాల్సిన వృషకర్మ మీద అనుమాన మేఘాలు కమ్ముకుంటున్నాయి. వాయిదా తప్పదనే ప్రచారం ఫిలిం నగర్ వర్గాల్లో…

3 hours ago

సొంత చెల్లిపై అడ్డమైన రాతలా… సీఎం చంద్రబాబు ఆవేదన

దేనికైనా హద్దు, అదుపు ఉంటుంది. రాజకీయాలు వేరు, వ్యక్తిగత బంధాలు వేరు. రెంటిని కలిపి చూడటం మూర్ఖులు చేసే పని…

4 hours ago

భారత్ ను చూసి నేర్చుకోమంటున్న ట్రంప్

అవసరమైనప్పుడు భారత్‌ను ప్రశంసించడం.. ప్రయోజనాల విషయంలో మాత్రం భారతీయులకు ఆంక్షలు విధించడం! అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహారశైలిలో కనిపిస్తున్న…

4 hours ago