వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యవహార శైలి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన నోటి దురుసుతో, ప్రవర్తనతో అంబటి నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. పలు సందర్భాల్లో పోలీసుల విధులకు ఆటంకం కలించిన అంబటి…తిరిగి వారిపైనే విమర్శలు చేస్తుంటారు. ఇక,కొన్ని సార్లు పూర్తిగా అపరిచుతుడిగా మారిపోయి పోలీసులకు రోజా పూలిచ్చి కూల్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. మరోసారి పోలీసులకు డెడ్లీ వార్నింగ్ ఇస్తుంటారు. ఈ క్రమంలోనే పోలీసులకు అంబటి సరికొత్త రీతిలో ఇచ్చిన వార్నింగ్ హాట్ టాపిక్ గా మారింది.
‘‘నెక్స్ట్ మనమే…మన గవర్నమెంట్ వస్తే ఫస్ట్ 6 నెలలు నేనే హోం మంత్రి’’…అంటూ అంబటి చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పోలీసులకు అంబటి ఈ రేంజ్ లో మాస్ వార్నింగ్ ఇవ్వగానే అక్కడ సీన్ సీరియస్ గా ఉండాల్సింది పోయి…సిల్లీగా మారింది. ఆ డైలాగ్ చెప్పగానే…అక్కడున్న వైసీపీ కార్యకర్తలతో పాటు పోలీసులు కూడా నవ్వుకున్నారు. ఈ క్రమంలోనే అంబటిపై నెటిజన్లు ఓ రేంజ్ లో ట్రోలింగ్ మొదలెట్టారు.
వైసీపీ ఓడిపోయిన తర్వాత పోలీసుల మీదికి ఒంటికాలితో లేస్తూ…లా అండ్ ఆర్డర్ ను డిస్టర్బ్ చేస్తున్న అంబటి హోం మినిస్టర్ అయితే ఇక అంతే సంగతులు అంటూ ట్రోల్ చేస్తున్నారు. చట్టాలను పాటించని అంబటి హోం మంత్రి అయితే ఇక ఏపీలో చట్టాలు ఏ రకంగా అమలవుతాయో..శాంతిభద్రతలు ఏ విధంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని చురకలంటిస్తున్నారు. ‘‘పెద్ద ఐడియా ఇది..పెద్ద గుండె అంబటిది…పోలీసులకు పెద్ద వార్నింగ్ ఇది’’ అంటూ అంబటిపై అల వైకుంఠపురం సినిమాలో డైలాగ్ లతో మీమ్స్ పెడుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates