జనం కోసం జర్నలిజం చేస్తూ, ఏ పార్టీ జెండాను మోయకుండా తెలుగు రాష్ట్రాల్లో వార్తా స్రవంతిని అందిస్తున్న తెలుగుప్రభ పత్రిక అక్టోబర్ 15న రీలాంచ్కు సిద్ధమైంది. రాజకీయ పార్టీలకు అతీతంగా, కేవలం జర్నలిస్టులనే ఆహ్వానితులుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుండటం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
లెజెండరీ పత్రికా సంపాదకులు, వివిధ జర్నలిస్ట్ సంఘాల నేతలు, వివాదాలకు అతీతంగా జర్నలిజంలో తమదైన ముద్ర వేసుకున్న సీనియర్ జర్నలిస్టులు ఈ వేడుకకు హాజరుకానున్నారు. ప్రముఖ పత్రికా సంపాదకులు రామచంద్ర మూర్తి వంటి హేమాహేమీలు అతిథులుగా పాల్గొననుండటంతో ఈ రీలాంచ్ వేడుకపై జర్నలిస్టు వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ సందర్భంగా ఎలాంటి కీలక ప్రకటనలు వెలువడనున్నాయన్నది కూడా చర్చనీయాంశంగా మారింది.
పాఠకుల్లో విశ్వసనీయతను సంపాదించుకుంటూ, పత్రికా రంగంలో తనదైన గుర్తింపును తెచ్చుకున్న తెలుగుప్రభ ప్రముఖ జర్నలిస్ట్, పర్యావరణ ఉద్యమకారుడు సమయమంత్రి చంద్రశేఖర శర్మ ఆధ్వర్యంలో ముందుకు సాగుతోంది.
తెలుగు పత్రికా రంగంలో అరుదుగా కనిపించే రీలాంచ్ ప్రయత్నానికి తెలుగుప్రభ సిద్ధమవడం జర్నలిస్టు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రింట్ ఎడిషన్ల ద్వారా పాఠకులకు చేరువవుతూనే, వెబ్సైట్, యూట్యూబ్ వేదికలపైనా తన ఉనికిని విస్తరిస్తోంది.
జర్నలిస్టులే నిర్వహిస్తున్న లాభాపేక్ష లేని పత్రికగా, ఏ రాజకీయ పార్టీకి కొమ్ముకాయకుండా ప్రజల పక్షాన నిలబడటమే తమ లక్ష్యమని తెలుగుప్రభ చెబుతోంది. గత కొన్నేళ్లుగా ఈ పత్రికపై జర్నలిస్టు వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. ‘జనం కోసం జర్నలిజం’ అనే ట్యాగ్లైన్కు అనుగుణంగా పనిచేయాలన్న నిబద్ధతే తమ ప్రత్యేకతగా తెలుగుప్రభ నిలుపుకుంటోంది. అక్టోబర్ 15న జరిగే రీలాంచ్తో పత్రిక తన ప్రయాణంలో మరో కీలక అడుగు వేయనుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates