Political News

జ‌గ‌న్ గారూ.. మ‌మ్మ‌ల్ని ప‌ట్టించుకోండి…!

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం మొదలైంది. ఎక్కడికి అక్కడ నాయకులు పార్టీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. తమకు అవకాశం ఇవ్వాలని కూడా కోరుతున్నారు. కూటమి విషయానికి వస్తే సమన్వయ కమిటీలు ఎంపిక చేసిన అభ్యర్థులకు కచ్చితంగా అవకాశం కల్పించాలని ఒక నిర్ణయానికి వచ్చారు. అదేవిధంగా పార్టీలో కష్టపడుతున్న వారికి గత ఎన్నికల సమయంలో అవకాశం లభించని వారికి కూడా ఈసారి అవకాశం ఇవ్వాలని టిడిపి జనసేన బిజెపి లు దాదాపు నిర్ణయానికి వచ్చాయి.

ఇక కీలకమైన వైసీపీ విషయానికి వస్తే గత ఎన్నికల సమయంలో పార్టీకి విశేషంగా కృషి చేసిన వారు చాలామంది ఉన్నారు. కొంతమంది డబ్బులు పెట్టారు. మరికొందరు పార్టీ తరఫున ఇంటింటి ప్రచారం చేశారు. ముఖ్య నాయకుల అనుచరులు అనేకమంది వైసిపి గెలుపు కోసం కృషి చేశారు. అయితే ఇప్పుడు వారిని పట్టించుకునే వారు కనిపించడం లేదన్నది క్షేత్రస్థాయిలో వినిపిస్తున్న ప్రధాన విమర్శ. ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా వందల మంది కార్యకర్తలు నాయకులు పార్టీ కార్యాల‌యం చుట్టూ తిరుగుతున్నారు.

తమకు అవకాశం ఇవ్వాలని పార్టీ కోసం శ్రమించామని వారు చెబుతున్నారు. ఈ క్రమంలో కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలకు చెందిన అనేకమంది నాయకులు ఏకంగా తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి రావడం ఆసక్తిగా మారింది. వరుసగా వస్తున్న నాయకులు, కార్యకర్తల తాకిడితో ప్రధాన కార్యాలయం కిక్కిరిసిపోతోంది. అయినప్పటికీ వారికి ఎటువంటి హామీ లభించకపోవడం విశేషం. కనీసం తమకు హామీ అయినా ఇవ్వాలని స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని వారు కోరుతున్నారు.

అయితే ఈ విషయంలో పార్టీ పరంగా నాయకుల బలాబలాలను పరిగణనలోకి తీసుకుంటున్నామని సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సీనియర్ నాయకులు చెబుతున్నారు. ఆర్థికంగా బలంగా ఉండడం, అదేవిధంగా కూటమి నాయకులపై పైచేయి సాధించటం, సామాజిక సమీకరణలు ఇలా మూడు కోణాల్లో కార్యకర్తల పనితీరును అంచనా వేస్తున్నారు. అయితే పార్టీ ఆఫీసుకు వస్తున్నటువంటి నాయకులు మాత్రం తమ‌కు కనీసం జగన్ కనిపించి ఏదో ఒక హామీ ఇవ్వాలని వారు కోరుతున్న మాట. కానీ ఈ విషయంలో ఇటు పార్టీ పరంగా కానీ అటు జగన్ పరంగా కానీ స్పష్టమైన హామీ లభించటం లేదన్నది వాస్తవం..

దీంతో వచ్చిన వారు వచ్చినట్టు వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఈ పరిణామాలను గమనిస్తున్న కొంతమంది సీనియర్ నాయకులు ఇదే పరిస్థితి కొనసాగితే కార్యకర్తలు నాయకుల్లో పార్టీపై మరింత అనిశ్చితి ఏర్పడే పరిస్థితి వస్తుందని భావిస్తున్నారు. పార్టీ పరంగా క్షేత్రస్థాయిలో జండా పట్టుకున్న వారికి ఇప్పటికైనా గుర్తింపు రావాలని కోరుతున్నారు. గతంలో ఐదు సంవత్సరాలపాటు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వలేదని కనీసం ఇప్పుడైనా ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్న వారు వందల మంది కార్యాలయానికి వస్తుండడం వారికి జగన్ అపాయింట్మెంట్ ఇవ్వకుండా తిప్పుతూ ఉండడం వంటివి పార్టీలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

అంతేకాదు పార్టీ అంటే కేవలం ఒకరిద్దరేనా అనే ధోరణి ఇంకా కొనసాగుతూ ఉండడం తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చేలా చేస్తుంది. మరి ఇప్పటికైనా వైసీపీలో ఉన్న క్షేత్రస్థాయి పరిస్థితిని గుర్తించి జగన్ పరిస్థితిని సరిదిద్దాల్సిన అవసరం ఉందని మెజారిటీ నాయకులు కార్యకర్తలు కూడా అభిప్రాయపడుతున్నారు. లేకపోతే వారు వేరే మార్గాలను ఎంచుకోవడం ఖాయం అని మాట కూడా వినిపిస్తోంది.

This post was last modified on October 14, 2026 12:50 pm

Share

Recent Posts

స్పిరిట్ వాయిదాని ఇన్‌డైరెక్ట్‌గా చెప్పేశారు

ప్రభాస్ అభిమానులు కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న 'స్పిరిట్' మార్చి 5 విడుదలని ఎప్పుడో లాక్ చేసుకున్న సంగతి…

1 hour ago

రుక్మిణి పరుగుని ఫాలో కావడం బెటర్

ఇమేజ్ ఉన్న హీరోలతో సినిమా వేగంగా తీయడమనేది దర్శకులకు పెద్ద సవాల్ గా మారిపోయింది. నో కాంప్రోమైజ్ పేరుతో నెలలు…

1 hour ago

ట్రోలింగ్ సరే… ఛేంజింగ్ కూడా జరగాలి

నిన్న జరిగిన రణబాలి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ తన మీదే అందరి కంటే…

3 hours ago

నవంబర్ ఇరవై… పోటీకి అందరూ సైసై

దీపావళికి రామాయణ, సూర్య సీన్,. కిరణ్ అబ్బవరం నిర్మించిన హతతో పోటీ నెలకొనగా ఆ తర్వాత వారం శర్వానంద్ భోగి…

4 hours ago

స్వీట్ బాక్స్ అడిగిన పాపానికి..

వీరమణి.. ఇప్పుడీ పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్. మంచు విష్ణు సైతం ఈ పేరు వాడి ఒక ట్వీట్…

6 hours ago

రజినీ కొట్టకూడదని కండిషన్

80, 90 దశకాల్లో తన డిస్కో డ్యాన్సులతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఒక ఊపు ఊపిన నటుడు మిథున్ చక్రవర్తి. ఇప్పటికీ…

7 hours ago