Movie News

స్పిరిట్ వాయిదాని ఇన్‌డైరెక్ట్‌గా చెప్పేశారు

ప్రభాస్ అభిమానులు కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న ‘స్పిరిట్’ మార్చి 5 విడుదలని ఎప్పుడో లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే. దానికి అనుగుణంగానే దర్శకుడు సందీప్ రెడ్డి వంగ షూటింగ్ చేసుకుంటూ వచ్చారు. అయితే డిసెంబర్ లో రావాల్సిన ఫౌజీ అనూహ్యంగా వాయిదా పడటమే కాదు మార్చి రిలీజ్ ఆప్షన్ గా పెట్టుకోవడంతో స్పిరిట్ ని తప్పించాలనే ప్రచారం ఫిలిం నగర్ వర్గాల్లో గత కొద్దిరోజులుగా తిరుగుతూనే ఉంది. తాజా పరిణామాలు దాన్ని నిజం చేసేలా ఉన్నాయి.

టి సిరీస్ సంస్థ నిర్మిస్తున్న ‘ఖోస్లా కా ఘోస్లా 2’ మార్చి అయిదు థియేటర్లకు తీసుకొస్తున్నట్టు ఇవాళ అధికారికంగా ప్రకటించారు. అంటే ఇదే ప్రొడక్షన్ హౌస్ నిర్మాణ భాగస్వామిగా ఉన్న స్పిరిట్ వాయిదా పడిందని ఇన్‌డైరెక్ట్‌గా చెప్పేసినట్టే. అక్టోబర్ 23 ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఫౌజీ రిలీజ్ డేట్ తో పాటు దీనికి సంబంధించిన కొత్త అనౌన్స్ మెంట్ ఉండొచ్చు. లేదా డేట్ లేకుండా జస్ట్ విషెస్ చెప్పి కొత్త తేదీ గురించి నిర్ణయం తర్వాత తీసుకోవచ్చు. ఇదంతా ఒక రకంగా షాక్ లాంటిదే.

రెండు ప్రభాస్ సినిమాలు తక్కువ గ్యాప్ లో రెడీ అవుతున్న క్రమంలో వచ్చిన తిప్పలివి. చిరంజీవి (విశ్వంభర – కాకా), వెంకటేష్ (ఆదర్శ కుటుంబం – జనవరి 12 విడుదల) ఇదే సమస్య ఫేస్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఒకటి తప్ప మిగిలినవి ప్యాన్ ఇండియా కాదు. సో తక్కువ గ్యాప్ లో వచ్చినా రిస్క్ లేదు. కానీ ఫౌజీ, స్పిరిట్ రెండూ దేనికవే బడ్జెట్, హైప్ పరంగా నువ్వా నేనా అనే రేంజ్ లో రూపొందుతున్నాయి. సో వీటి మధ్య అవసరమైనంత స్పేస్ ఉండటం ముఖ్యం.

ఈ లెక్కన స్పిరిట్ వచ్చే ఏడాది దసరా లేదా దీపావళికి వచ్చే ఛాన్స్ ఉంది. లేదూ సందీప్ వంగా యానిమల్ సెంటిమెంట్ ఫాలో అయితే కనక 2027 డిసెంబర్ లోనే చూడాల్సి ఉంటుంది. పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ వయొలెంట్ అవతారం ఇందులో ఎలా ఉంటుందోననే ఎగ్జైట్ మెంట్ ఆడియన్స్ లో విపరీతంగా ఉంది. దానికి తగ్గట్టే వంగా బ్రదర్స్ అప్పుడప్పుడు ఇంటర్వ్యూలలో ఇస్తున్న ఎలివేషన్లు ఓ రేంజ్ లో ఉంటున్నాయి. కాకపోతే ఫ్యాన్స్ కు మాత్రం ఎక్కువ వెయిటింగ్ తప్పేలా లేదు.

This post was last modified on October 14, 2026 12:16 pm

Share

Recent Posts

బిచ్చగాడు హీరోకి నాన్న హిట్టిస్తాడా

పట్టువదలని విక్రమార్కుడి బిరుదు ఎవరికైనా ఇవ్వాలంటే ముందు వరసలో ఉండే వాళ్లలో విజయ్ ఆంటోనీ పేరు ఉంటుంది. ఎందుకంటే బిచ్చగాడు…

22 seconds ago

ట్రైల‌ర్ దెబ్బ అర్థ‌మైందా నానీ?

ఏ కొత్త సినిమా వ‌చ్చినా.. రిలీజ్ ముంగిట థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ రిలీజ్ చేయ‌డం మామూలే. దాన్ని బ‌ట్టే తాము ఎలాంటి…

1 hour ago

జెన్సన్ హువాంగ్ రీ ఎంట్రీ వెనుక అసలేం జరిగింది?

ప్రపంచ టెక్నాలజీ రంగంలో అత్యంత ప్రభావం చూపుతున్న సంస్థల్లో ఎన్విడియా ఒకటి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం విస్తరిస్తున్న కొద్దీ…

1 hour ago

గ్రామీణ ఎన్నిక‌లు ఏక‌ప‌క్షం

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు ముహూర్తం సిద్ధ‌మైన విష‌యం తెలిసిందే. ఈ నెలలోనే రెండు ద‌ఫాలుగా వ‌చ్చే నెల 2న మూడో…

2 hours ago

అమెరికాలో ఆయన అరెస్ట్.. ఇక్కడ రంగంలోకి చిన్మయి

కర్నాటక సంగీతంలో ఎంతో ప్రసిద్ధి చెందిన వయొలెన్ విధ్వాంసుడు హెచ్.ఎన్.భాస్కర్ అమెరికాలో అరెస్ట్ కావడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆయన అరెస్ట్ అయింది…

4 hours ago

సుకుమార్ కొత్త శిష్యుడి మీదే అందరి కళ్ళు

ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ ‘ఆర్జీవీ ఫిలిం ఫ్యాక్టరీ’ అని నిర్మాణ సంస్థ పెట్టి అనేకమంది శిష్యులను దర్శకులుగా పరిచయం…

4 hours ago