సమాజంలో ఐఏఎస్, ఐపీస్ అధికారులకు ఎంతో గౌరవం వుంది. యువకులు, విద్యార్థులైతే వారిని రోల్ మోడల్ గా ఊహించుకుంటారు. సొసైటీ కోసం పనిచేసే అధికారులను అభిమానిస్తుంటారు. పల్నాడు జిల్లాలో ఒక గ్రామానికి ఐఏఎస్ అధికారి పూనం మాలకొండయ్య పేరు పెట్టుకోవడం ఇందుకు ఒక ఉదాహరణ. ఇప్పుడు రోజులు మారాయి. అన్నీ వ్యవస్థలతో పాటుగా సివిల్ సర్వీస్ వ్యవస్థలో కూడా పెను మార్పులు చోటు చేసుకున్నాయి. కొందరు ఐఏఎస్, ఐపీస్ అధికారుల వ్యవహార శైలి మీద పలు ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్ మద్యం మత్తులో పోలీసుల మీద చిందులు వేయడం సంచలనంగా మారింది.
చిత్తూరు జిల్లా కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ , ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్ వివాదంలో చిక్కుకున్నారు. బెంగళూరు రెసిడెన్సీ రోడ్డులోని కావోర్ బార్ అండ్ రెస్టారెంట్ కు కవర్ పబ్ అనే పేరుతో పిలుస్తుంటారు. ఈ నెల 10 వ తేది తెల్లవారుజామున వికాస్ మర్మత్ తన మిత్రులు అభయ్ ఉదయ్ సింగ్, నితీష్, రోషన్ లతో కలిసి వెళ్లారు. అదే సమయంలో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పబ్ కు వచ్చిన కస్టమర్ల వివరాలు సేకరించడం మొదలుపెట్టారు. కస్టమర్ల ఐడి కార్డులు పరిశీలించేందుకు వికాస్, అతడి స్నేహితులున్న చోటుకు వచ్చారు. ఇక్కడ వివాదం చోటు చేసుకుంది.
అప్పటికే మద్యం మత్తులో వున్న ఐఏఎస్ వికాస్ మర్మత్ తన హోదా గురించి చెప్పి పోలీసులతో తీవ్రంగా వాగ్వాదానికి దిగారు. స్నేహితులతో కలిసి సీసీబీ పోలీసులను తీవ్రంగా దూషించడమే కాకుండా ఇన్స్పెక్టర్ అరుణ్ సాలుంకే, ఇతర సిబ్బందిపై దాడి చేసినట్లు సమాచారం. ఇన్స్పెక్టర్ అరుణ్ సాలుంకే ఇచ్చిన ఫిర్యాదు మేరకు, కబ్బన్ పార్క్ పోలీసులు భారతీయ న్యాయ సంహిత లోని పలు సెక్షన్ల కింద వికాస్ మర్మత్ను ప్రధాన నిందితుడిగా కేసు నమోదు చేశారు. ఆయన స్నేహితుల మీద కూడా కేసు నమోదు చేశారు. విధుల్లో ఉన్న పోలీసులను అడ్డుకున్నట్లు ఎఫ్ఐఆర్ లో పేర్కొనడం గమనార్హం.
ఐఏఎస్ వికాస్ పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన దృశ్యాలు నిముషాల వ్యవధిలోనే సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యాయి. దేశం మొత్తం చూసింది. బాధ్యత కలిగిన ఒక ఐఏఎస్ ఇలా ప్రవర్తించడం, అదీ తనిఖీలు చేస్తున్న పోలీసుల మీద జులుం ప్రదర్శించడం ఏంటని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2019 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన వికాస్ మర్మత్ ఐఐటీ కాన్పూర్ లో బీ టెక్ పూర్తి చేశారు. ఆయన రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన అధికారి. ఇప్పుడు ప్రెస్టేజికి పోయి చిన్న విషయానికి పెద్ద తలనొప్పి తెచ్చుకున్నారని బ్యూరోక్రాట్స్ చెబుతున్నారు.
This post was last modified on October 14, 2026 8:07 am
వీరమణి.. ఇప్పుడీ పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్. మంచు విష్ణు సైతం ఈ పేరు వాడి ఒక ట్వీట్…
80, 90 దశకాల్లో తన డిస్కో డ్యాన్సులతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఒక ఊపు ఊపిన నటుడు మిథున్ చక్రవర్తి. ఇప్పటికీ…
నీతి టేలర్.. ఈ పేరు గుర్తుందా? ‘నచ్చావులే’ ఫేమ్ తనీష్ అల్లాడి హీరోగా నటించిన ‘మేం వయసుకు వచ్చాం’ అనే…
దసరా పండగ బాక్సాఫీస్ ఈసారి వైరెటీగా కనిపిస్తోంది. భీభత్సమైన హైప్ ఉండాల్సిన జైలర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ నెమ్మదిగా ఊపందుకుంటుండగా,…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్.. మంగళవారం సాయంత్రం విజయవాడలో పర్యటించేందుకు వచ్చారు. తొలుత కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించుకున్న ఆయన.. అనంతరం..…
ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…