Political News

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం చేసుకున్నారు. ప్రతి సంవత్సరం ఫ్యామిలీతో కలిసి విదేశాల్లో పర్యటిస్తున్న నేపథ్యంలో ఈసారి కూడా ఆయన సతీసమేతంగా కుటుంబంతో సహా విదేశాల్లో పర్యటించి రావాలని నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించి సిబిఐ కోర్టు నుంచి కూడా ఆయన అనుమతులు తెచ్చుకున్నారు.

అయితే ఇప్పుడు ఈ పర్యటనకు సంబంధించి బ్రేక్ పడే అవకాశం ఉందని పెద్ద ఎత్తున సొంత పార్టీ వైసీపీలోనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు తెలంగాణ లోని ఈడీ ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. జగన్ పై నమోదైన అక్రమ ఆస్తుల కేసుల విచారణను వేగవంతం చేయాలని రోజువారీగా విచారణ జరపాలని ఆ పిటిషన్ లో కోర్టును అభ్యర్థించారు. అంతేకాదు జగన్ను కోర్టుకు పిలవాల్సిందేనని కూడా పిటిషన్ లో స్పష్టం చేశారు. దీనిపై కోర్టు ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ఆర్థిక నేరాల కట్టడికి త్వరితగతిన చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు చెప్పిన దరిమిలా జగన్ పై నమోదైన కేసుల విచారణ వడివడిగా ముందుకు సాగే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే జగన్ ను కోర్టుకు పిలవడంతో పాటు ఆయనపై నమోదైన కేసులను మరింత వేగంగా పూర్తి చేయాలని కూడా భావిస్తున్నారు. దీనిపై న్యాయమూర్తి తీసుకునే నిర్ణయం ఆధారంగానే జగన్ విదేశీ పర్యటన ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది.

ఒకవేళ రోజువారీ విచారణ ప్రారంభించి జగన్ పై న‌మోదైన కేసులను తేల్చేయాలని గనుక తీర్పు ఇస్తే ఖచ్చితంగా జగన్ విదేశాలకు వెళ్లే అవకాశం ఉండకపోవచ్చు అని, కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుందని ఒకరిద్దరు నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, దీనిపై పార్టీ పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ జగన్ ఎక్కడ స్పందించలేదు. కోర్టు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటారని మాత్రమే ఆయన చెబుతున్నారు.

ఈ విషయంపై పార్టీలో మాత్రం పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. గతంలో కూడా అనేక సందర్భాల్లో జగన్ విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడు కోర్టులు అనుమతి ఇచ్చాయి. కానీ, ఈసారి అనుమతి ఇచ్చినప్పటికీ ప్రస్తుతం ఈడి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిగితే జగన్ విదేశీ పర్యటనకు బ్రేక్ పడే అవకాశం ఉంటుందని సీనియర్ నాయకులు కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

This post was last modified on October 13, 2026 1:23 pm

Share

Recent Posts

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

2 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

3 hours ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

3 hours ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

11 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

13 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

14 hours ago