Political News

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు, ముఖ్యమంత్రులు ఒకవైపు, ఉడుకునెత్తురు ఉరకలెత్తే యువత మరోవైపు రణన్నినాదం చేస్తుంటే ప్రధాన మంత్రి మోదీ, హోం మంత్రి అమిత్ షా బృందం ప్రధాన ఎన్నికల కమిషనర్ ను తొలిగించేందుకు ససేమీరా అంటున్నారు. రోజుల తరబడి పోరాటం కొనసాగుతోంది. నెలలు, సంవత్సరాలైనా ఇలాగే పోరాడుతామని రాహుల్ గాంధీ ప్రకటించడంతో ఈ ఉద్యమానికి ఇప్పట్లో తెరపడే సూచనలు కాన రావట్లేదు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సుత్తి లేకుండా సూటిగా అడిగిన ప్రశ్నలు మంటలు రేపుతున్నాయి.

ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఢిల్లీలో జరుగుతున్న ధర్నాలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడిన మాటలు చర్చనీయాంశంగా మారాయి. దేశంలో జనాభా పెరుగుతుంటే ఓట్ల సంఖ్య ఎలా తగ్గుతుందని ఆయన ప్రశ్నించడం ప్రజల్లో ఆలోచన రేకేత్తిస్తుంది. ఉజ్జాయింపుగా ఆయన ఈ మాటలు చెప్పలేదు. పక్కా లెక్కల ప్రకారమే మాట్లాడారు. 2014లో 81 కోట్ల ఓట్లు వుంటే 2019లో 91 కోట్ల ఓట్లకు పెరిగాయని తెలిపారు. ఆ తర్వాత 2023లో 97 కోట్లకు పెరిగినట్లు వివరించారు. మోదీ ప్రభుత్వం 13 కోట్ల ఓట్లు తొలగించిందని, ఇప్పుడు దేశ జనాభా ఎంతుందో చెప్పాలని ప్రశ్నించారు.

మోదీ ప్రభుత్వం దేశాన్ని రెండు రకాలుగా విడగోడుతుందని, తనకు అనుకూలంగా వున్న ఓటర్లు, తనకు వ్యతిరేకంగా వున్న ఓటర్లు గా విభజిస్తుందని చెప్పారు. ఎక్కడ ఓట్లు తొలగిస్తుందో అక్కడ బీజేపీ గెలవడం దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో బీజేపీ గెలవడం గురించి ప్రస్థావించారు. మమతా బెనర్జీ ఓడి పోవడం వెనక సర్ కుట్ర వుందని ఆరోపించారు.

దేశం మొత్తం ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను తొలిగించాలని కోరుకుంటుంటే ప్రధాన మంత్రి మోదీ ఆయనను ఎందుకు కాపాడుతున్నారో చెప్పాలని నిలదీశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగుతున్న ఈ ప్రశ్నే కాక్రోచ్ యువకులు ప్రశ్నిస్తున్నారు. ఒక్క మనిషి కోసం లక్షలాది మంది విద్యార్థులు, యువకులు రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేయాల్సిన దుస్థితి తీసుకొని వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రధాని మోదీ వెంటనే జ్ఞానేష్ కుమార్ ను తొలిగించాలని, సర్ ను రద్దు చేసి దేశ ప్రజలకు ఉపశమనం కల్పించాలని కోరుతున్నారు.

This post was last modified on October 13, 2026 10:06 am

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

8 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

10 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

10 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

11 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

11 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

12 hours ago