ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్ కపూర్, సాయిపల్లవి తమ శాయశక్తులా ప్రమోషన్లలో పాల్గొంటూ, ఈవెంట్లకు వెళ్తూ, ఇంటర్వ్యూలు ఇస్తున్నా ఏదో మిస్ అవుతోంది. గ్రౌండ్ లెవెల్ లో భీభత్సమైన హైప్ రావడం లేదు. ఢిల్లీలో రాజకీయంగా జరుగుతున్న పరిణామాలు, సిజెపి పార్టీ ఆందోళనల వల్ల హిందీ మీడియా ఎక్కువగా వాటి మీద ఫోకస్ పెట్టి రామాయణకు తగినంత కవరేజ్ ఇవ్వలేకపోతోంది.
ఇక్కడ రాజమౌళి ప్రస్తావన ఎందుకు వచ్చిందో చూద్దాం. ఇంత పెద్ద ప్యాన్ ఇండియా మూవీ తీసిన నిర్మాత నమిత్ మల్హోత్రా, దర్శకుడు నితేశ్ తివారి పబ్లిసిటీ విషయంలో తమ బలహీనతను బయట పెట్టుకున్నారు. సరైన ప్లానింగ్ లేకపోవడం వల్ల జనాలకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందలేదు. పైగా ట్రైలర్ కు మిక్స్డ్ రెస్పాన్స్ రావడం, పోస్టర్లు అధిక శాతం ఏఐతో చేసిన ఫీలింగ్ కలిగించడం లాంటి కారణాలు అంచనాల బరువుని పెంచలేకపోయాయి. దీని వల్లే ఓపెనింగ్స్ రిస్క్ లో పడ్డాయి.
ఒకవేళ ఇదే రామాయణ మన జక్కన్న తీసి ఉంటే లెక్క వేరుగా ఉండేది. ఇప్పటికే కొన్నివందల సార్లు చూసేసిన కథ కాబట్టి ఇందులో తానేం కొత్తగా చూపించబోతున్నాడో ముందుగానే ప్రేక్షకులను ప్రిపేర్ చేయడానికి తనదైన స్ట్రాటజీని రచించేవారు. మేకింగ్ వీడియోస్ కావొచ్చు, లేదా వినూత్నంగా అనిపించే పోస్టర్స్ అవ్వొచ్చు, లేదా పల్స్ తెలుసుకోవడానికి వదిలే లీక్స్ కావొచ్చు ఏదైతేనేం ప్రతిదీ మీడియాతో పాటు సోషల్ మీడియాలో హైలైట్ అయ్యేలా చేసుకుంటారు.
రామాయణ ఇలాంటి ప్రణాళికను మిస్ అవుతోంది. చేతిలో మూడు వారాలు మాత్రమే సమయమున్నా హడావిడి చేయడంలో వెనుకబడుతోంది. నిజానికి ఇంత పెద్ద విజువల్ గ్రాండియర్ వస్తున్నప్పుడు ఎవరూ పోటీకి వచ్చే సాహసం చేయరు. కానీ అన్ని భాషల్లో వేర్వేరు సినిమాలు కాంపిటీషన్ కు రెడీ అవుతున్నాయి. అందుకే అనేది సినిమా తీయడం ఎంత ముఖ్యమో దానికి పబ్లిక్ లో ఎగ్జైట్ మెంట్ కలిగించడం అంతకన్నా ముఖ్యం. ఈ విషయంలో రాజమౌళిని మించినవారు లేరు.
This post was last modified on October 13, 2026 11:56 am
తెలుగులో నేరుగా సినిమా చేయడానికి ముందే మన దగ్గర మంచి ఫాలోయింగ్ సంపాదించిన మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్. అతను…
సాంకేతిక ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టిస్తున్న మార్పులు రోజురోజుకూ వేగం పుంజుకుంటున్నాయి. ఇప్పటివరకు మనుషుల మేధస్సు, అనుభవం అవసరమైన అనేక…
విజయవాడ మేయర్‌గా జనసేన నాయకుడు, వంగవీటి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో 86 మంది కార్పొరేటర్లు…
జూనియర్ ఎన్టీఆర్ లాంటి ప్యాన్ ఇండియా హీరో, ఆర్ఆర్ఆర్ ఇండస్ట్రీ హిట్ తర్వాత చేసిన సినిమాగా దేవర ఎంత సంచలనం…
నిన్నా మొన్నటి వరకు బ్యాగు భుజాన వేసుకొని కాలేజీకి వెళ్లిన ఆమె ఇప్పుడు డిప్యూటీ మేయర్ గా ప్రజా జీవితంలోకి…
యూత్ హీరో కిరణ్ అబ్బవరం మంచి దూకుడు మీద ఉన్నాడు. స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న రియాలిటీ ఇటీవలే షూటింగ్ పూర్తి…