Movie News

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు మాత్రం ఆశించినంత గొప్పగా లేకపోవడం ట్రేడ్ వర్గాలను నిరాశ పరుస్తోంది. ఒరిజినల్ వెర్షన్ హైదరాబాద్ లో చూసిన మూవీ లవర్స్ తో మొదలుకుని చెన్నైలో క్రిటిక్స్ దాకా బత్తా మీద ప్రశంసల జల్లు కురిసింది. అద్భుతంగా ఉందంటూ సోషల్ మీడియా వేదికగా ఎందరో పోస్టులు పెట్టారు. తెలుగు డబ్బింగ్ కోసం ప్రయత్నాలు జరిగాయనే టాక్ కూడా వచ్చింది.

తీరా చూస్తే ఇప్పటిదాకా బత్తా వరల్డ్ వైడ్ గ్రస్స్ ముప్పై కోట్లు కూడా దాటాకపోవడం ఆందోళనకు గురి చేస్తోంది. ఇంత పాజిటివ్ టాక్ వచ్చిన తర్వాత ఎలాంటి సినిమా అయినా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. పక్క రాష్ట్రంలో ప్రేమద ఊరల్లీ కన్నా మంచి ఉదాహరణ అక్కర్లేదు. కానీ దానికన్నా బెటర్ టాక్ వచ్చిన బత్తా ఇంత నెమ్మదిగా ఉండటం విచిత్రమే. విజయ్ సేతుపతి వరస ఫ్లాపుల ప్రభావం మార్కెట్ ప్లస్ ఆడియన్స్ మీద పడిందని పంపిణీదారులు భావిస్తున్నారు.

చూస్తుంటే మన భాషలో బత్తాని చూసే ఛాన్స్ లేనట్టే కనిపిస్తోంది. ఈ నెల చివరి వారంలో ఓటిటి రిలీజ్ జరిగే అవకాశం ఉండటంతో అనువాదం చేసినా థియేటర్ పరంగా లాభం ఉండకపోవచ్చు. పైగా జైలర్ 2, రణబాలి, గరివిడి లక్ష్మి, క్రేజీ కళ్యాణం అంటూ దసరా పండక్కు మన దగ్గర హడావిడి ఎక్కువగానే ఉంది. ఆదర్శ కుటుంబం ఏకె 47 అక్టోబర్ 30 వచ్చే అవకాశాలు ఉన్నందున బత్తాకు ఎక్కడా స్పేస్ లేదు. సో డిజిటల్ లో వచ్చే దాకా ఎదురు చూడటం తప్ప వేరే ఆప్షన్ లేదు.

అయినా డిజాస్టర్ల ఎఫెక్ట్ విజయ్ సేతుపతి మీద గట్టిగానే కనిపిస్తోంది. లేదంటే బత్తాకొచ్చిన టాక్ కి కనీసం అరవై డెబ్భై కోట్ల మార్కు అందుకోవాల్సింది. అందులోనూ పెద్దగా కాంపిటీషన్ లేని టైంలో ఆ అవకాశాన్ని వాడుకోకపోవడం విచిత్రమే. ఒక స్కూల్ బాత్ రూమ్ లో చిక్కుకున్న కరుడుగట్టిన రౌడీకి, అతను అలా కావడానికి కారణమైన ఒక చిన్న పిల్లాడికి మధ్య జరిగిన సంఘటనల ఆధారంగా మంచి భావోద్వేగాలతో బత్తా రూపొందించారు దర్శకుడు బాలాజీ తరనీంతరన్.

This post was last modified on October 13, 2026 10:47 am

Share

Recent Posts

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

60 minutes ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

9 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

11 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

11 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

12 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

12 hours ago