ఇటీవల కాలంలో పెద్దగా వార్తల్లో కనిపించని మంత్రి తన్నీరు హరీశ్ రావు.. తాజాగా తీసుకున్న నిర్ణయం ఆసక్తికరంగా మారింది. అత్యున్నత స్థానాల్లో ఉన్న నేతలంతా ప్రజల కోసం తాము చాలా చేస్తామని.. వారి కోసం ఏ త్యాగానికైనా సిద్ధమని చెబుతుంటారు. మాటలు ఇంత తియ్యగా ఉన్నా.. చేతల వరకు వచ్చేసరికి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుంటారు.
తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. తన నియోజకవర్గంలోని ఆటో డ్రైవర్ల జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపేందుకు సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇందుకు తన ఆస్తిని తాకట్టు పెట్టిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బ్యాడ్ లక్ ఏమంటే.. ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నా.. దీనికి సంబంధించిన వార్త మాత్రం మీడియాలో పెద్ద ప్రాధాన్యత అంశంగా రాకపోవటం గమనార్హం.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేటీఆర్ కు ఏం తక్కువంటూ పలువురు టీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానిస్తున్న వేళలోనే.. మంత్రి హరీశ్ తీసుకున్న నిర్ణయం భిన్నంగా ఉంది. రాష్ట్రంలోనే తొలిసారి సిద్దిపేటలో ఆటో క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేశారు. ఆటో డ్రైవర్లకు రుణాలు ఇచ్చేందుకు వీలుగా తన ఆస్తిని తాకట్టులో పెట్టారు.
దీంతో.. సిద్దిపేటలోని ఆటోడ్రైవర్లకు సులువుగా రుణాలు అందనున్నాయి. మంత్రి హరీశ్ చేతుల మీదుగా 850 మంది ఆటోవాలాలకు రుణాలు.. డ్రెస్సులు అందించే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ నిర్ణయం వెనుక కారణాల్ని చూస్తే.. రోజువారీ ఫైనాన్స్ లు తీసుకుంటూ ఆటో నడిపే వారంతా రోజువారీ మిత్తీలు చెల్లించటంతో వాటిని తీర్చలేక అప్పుల పాలవుతున్నారు.
ఈ విషయాలన్ని హరీశ్ వరకు రావటం.. వారి జీవితాల్లో వెలుగు నింపేందుకు సొసైటీని ఏర్పాటు చేశారు. ఇందులో ప్రస్తుతం 850 మంది ఉన్నారు. డ్రైవింగ్ లైసెన్సు.. ఆటో ఆర్ సీ తదితర అంశాల్ని అర్హతగా ఎంతమంది సభ్యులు వచ్చినా చేర్చుకునేందుకు సొసైటీ సిద్ధంగా ఉంది.
This post was last modified on January 21, 2021 12:12 pm
2025 సంక్రాంతికి ప్లాన్ చేసుకున్న అజిత్ గుడ్ బ్యాడ్ ఆగ్లీ పండగ రేసు నుంచి దాదాపు తప్పుకున్నట్టే. నిన్న చెన్నైలో…
ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీల ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. 164 సీట్లతో కూటమి ప్రభుత్వం…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను హీరోగా తెలుగు తెరకు పరిచయం చేసిన చిరుత మూవీతో తెలుగు సినీ…
ఈ హైటెక్ జమానాలో 24 గంటల పాటు పలు కంపెనీలు సేవలందిస్తున్నాయి. దీంతో, సాఫ్ట్ వేర్ కంపెనీలు, బీపీవోలలో నైట్…
లావణ్య త్రిపాఠి.. 2012లో విడుదలైన అందాల రాక్షసి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత ఎందరో…
నిన్న చెన్నైలో జరిగిన పుష్ప 2 సాంగ్ లాంచ్ వేడుకలో దేవిశ్రీ ప్రసాద్ ప్రసంగం ఇండస్ట్రీ మొత్తం హాట్ టాపిక్…