వైసీపీ అధినేత జగన్ నివాసం ఉండే తాడేపల్లి ప్రాంతం.. మంగళగిరి నియోజకవర్గంలో ఉంటుంది. ఇక్కడ అనేక మంది పేదలు.. దిగువ మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయి. ముఖ్యంగా మాస్ జనాభా ఎక్కువగా ఉన్న నియోజక వర్గం కూడా ఇదే. అయితే.. నియోజవర్గంలో 2014, 2019లో విజయం దక్కించుకున్న వైసీపీ దీనిపై స్పెషల్ గా పోకస్ చేసింది ఏమీ లేదు. పేదలకు.. మధ్యతరగతి వర్గానికి చేసిన మేలు కూడా పెద్దగా లేదని అంటారు.
దీంతో మంగళగిరి నియోజకవర్గంలో వరుస విజయాలు సాధించినప్పటికీ.. వైసీపీకి పెద్దగా ఒరిగింది కనిపించడం లేదు. పైగా అంతర్గత రాజకీయ వివాదాలు తరచుగా తెరమీదికి వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గత ఎన్నికల్లో టీడీపీ యువ నాయకుడు లోకేష్‌ను ఇక్కడి ప్రజలు గెలిపించారు. తర్వాత ఆయన మంత్రి అయ్యారు. అయితే.. వైసీపీకి, లోకేష్‌కు మధ్య తేడాను గమనిస్తే.. చాలానే కనిపిస్తోందన్నది లోకల్ టాక్.
ప్రధానంగా చిరు వ్యాపారాలు చేసుకునే వారికి ఆదరువుగా నిలుస్తున్నారు. కొండ ప్రాంత ప్రజలకు, ప్రభుత్వానికి చెందిన ఎటూ కానిభూముల్లో నివాసం ఏర్పాటు చేసుకున్న వారికి ఆయన పట్టాలు ఇస్తున్నారు. ఇప్పటికి రెండు విడతలుగా పట్టాలు ఇవ్వగా.. తాజాగా సోమవారం మరోసారి పట్టాలు ఇచ్చారు. దీంతో ఇప్పటి వరకు సుమారు 30 వేల కుటుంబాలకు సొంత భూమి, నివాసం ఏర్పడ్డాయి. దీనికి గాను వారి నుంచి రూపాయి కూడా తీసుకోకపోవడం గమనార్హం.
ఇక, స్థానికంగా ఉన్న చేనేతలు, ఇతర కార్మిక వర్గాలకు కూడా మంత్రి లోకేష్ ఆదరువుగా నిలుస్తున్నారు. ఇవన్నీ.. ఆయన భవిష్యత్తు ప్రణాళికలను మరింత బలోపేతం చేస్తున్నాయి. పక్కనే ఉన్న జగన్ కానీ, ఇక్కడ రెండు సార్లు గెలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డి కానీ చేయని మేలును.. ఇప్పుడు లోకేష్ చేసి చూపిస్తుండడం.. ప్రజలకు అండగా ఉండడం వంటివి మంగళగిరి ముఖ చిత్రాన్ని మార్చేస్తున్నాయి. కేవలం సంక్షేమం మాత్రమే కాదు.. 100 పడకలతో కొత్త ఆసుపత్రి నిర్మాణం వడివడిగా సాగుతోంది.
పక్కనే రాజధాని ప్రాంతం ఉండడం కూడా కలిసి వస్తోంది. ఇలా.. అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. చేయాలన్న సంకల్పం.. దీక్ష ఉంటే ఏదైనా సాధ్యమేనన్న విషయం మంగళగిరిలో స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఇది.. వైసీపీలో కనిపించడం లేదు. కులాల ఆధారంగా రాజకీయం చేసి.. గత ఎన్నికల్లో వైసీపీ బోర్లా పడిన నియోజవర్గాల్లో మంగళగిరి ముందుండడం గమనార్హం.
This post was last modified on September 29, 2026 10:40 am
రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఉచిత పథకాలకు తమిళనాడు కేరాఫ్‌గా ఉంది. నాటి జయలలిత, కరుణానిధి ప్రభుత్వాల నుంచి నేటి…
తమిళంలో పేరున్న దర్శకుల్లో వెంకట్ ప్రభు ఒకరు. చెన్నై-28తో మొదలుపెట్టి చాలా హిట్లే ఇచ్చారు. చివరగా విజయ్ హీరోగా గ్రేటెస్ట్…
ఎలక్ట్రానికి ఓటింగ్ మెషీన్(ఈవీఎం)లపై చాలా సంవత్సరాలుగా చర్చ నడుస్తోంది. ఈవీఎంలు ట్యాంపర్ చేయడం సాధ్యమేనని కొందరు ప్రోటోటైప్ ఈవీఎంలను ట్యాంపర్…
రాజకీయాల్లో వ్యూహాలు ఎప్పుడొకప్పుడు బెడిసికొట్టడం సహజం. కానీ, ఒక ఉమ్మడి జిల్లాలో పార్టీ అధినేత నేరుగా రంగంలోకి దిగి పావులు…
కొన్నిసార్లు దర్శకులు కథ చెప్పినంత బాగా సినిమా తీయలేకపోతుంటారు. అందుకు అనుభవ లేమి కూడా కారణం కావచ్చు. లేదంటే రాత…
తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడూ లేని విధంగా సరికొత్త చర్చ తెరపైకి వచ్చింది. ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి జరగబోయే ఉపఎన్నికలో కవిత…