గ‌వ‌ర్న‌ర్‌కు అన్నీ చెప్పేశా.. లోకేష్ రాజీనామా చేయాల్సిందే

డీఎస్సీ-2025లో అక్ర‌మాలు జ‌రిగాయ‌ని వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ మ‌రోసారి ఆరోపించారు. ఈ విష‌యంపై అన్ని ఆధారాల‌ను గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ న‌జీర్‌కు వివ‌రించాన‌న్నారు. ఇక‌, మిగిలింది.. మంత్రి లోకేష్ రాజీనామా చేయ‌డ‌మేన‌ని డిమాండ్ చేశారు. తాజాగా బుధ‌వారంసాయంత్రం ఆయ‌న గ‌వ‌ర్న‌ర్ న‌జీర్‌ను లోక్‌భ‌వ‌న్‌లో క‌లుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా డీఎస్సీ-2025లో స్పోర్ట్స్ కోటా అభ్య‌ర్థుల విష‌యంలో అక్ర‌మాలు చోటు చేసుకున్నాయ‌ని ఆయ‌న‌కు వివ‌రించారు. సీబీఐ విచార‌ణ‌కు ఆదేశించేలా ప్ర‌భుత్వాన్ని కోరాల‌ని గ‌వ‌ర్న‌ర్‌ను అభ్య‌ర్థించారు. అనంత‌రం.. జ‌గ‌న్ లోక్‌భ‌వ‌న్ ముందు మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా నాలుగు కీల‌క అంశాల‌ను ఆయ‌న వివ‌రించారు.

డీఎస్సీ అక్రమాలకు పాల్పడిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ తన పదవికి రాజీనామా చేయాలని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. బుధవారం లోక్‌భవన్‌లో గవర్నర్‌ జస్టిస్‌ అబ్ధుల్‌ నజీర్‌తో భేటీ అయ్యారు. శాప్‌ కార్యాలయం వద్ద వైఎస్సార్‌సీపీ నాయకులపై జరిగిన దాడికి సంబంధించి ఆయన గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే డీఎస్సీ–2025లో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. గవర్నర్‌తో భేటీ అనంతరం వైఎస్‌ జగన్‌ లోక్‌భవన్‌ వద్ద మీడియాతో మాట్లాడారు.

  1. త‌యారీ నిర్వ‌హ‌ణ ఒక‌రికే
    డీఎస్సీ -2025 ప్ర‌శ్న ప‌త్రం త‌యారీ స‌హా.. ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణను ఒక‌రికే అప్ప‌గించార‌ని జ‌గ‌న్ చెప్పారు. వాస్త‌వానికి ఇక్క‌డ నుంచే అక్ర‌మాలు ప్రారంభ‌మ‌య్యాయ‌ని వివ‌రించారు. ఈ నేప‌థ్యంలో ఈ నియామ‌కంపై విచార‌ణ జ‌ర‌పాల‌ని కోరుతున్నాన‌న్నారు.
  2. విధాన లోపం
    డీఎస్సీ నిర్వ‌హ‌ణ‌లో విధాన‌ప‌ర‌మైన లోపాలు ఉన్నాయ‌ని జ‌గ‌న్ చెబుతున్నారు. ఈ నిర్వ‌హ‌ణ‌లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల‌ను నియ‌మించార‌ని ఆరోపించారు. దీంతో అభ్య‌ర్థుల పేర్లు తారు మార‌య్యాయ‌ని తెలిపారు. మెరిట్ జాబితాలో ఉన్న‌వారి పేర్లు కూడా త‌ర్వాత జాబితాలో లేవ‌న్నారు. ఇది.. అభ్య‌ర్థుల‌ను ప‌క్కాగా మోసగించ‌డ‌మేన‌న్నారు. దీనిని దాచి పెట్టేందుకు ప్ర‌భుత్వం తంటాలు ప‌డుతోంద‌న్నారు.
  3. రెండు జీవోలు..
    స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల విష‌యంలో ప్ర‌భుత్వం రెండు ప్ర‌మాణాలు పాటించింద‌ని జ‌గ‌న్ ఆరోపించారు. ముందు జీవో 4 పేరుతో స్పోర్ట్స్ కోటాలో డీఎస్సీ ఉద్యోగాలు ఇచ్చేందుకు ఎలాంటి రాత ప‌రీక్ష అవ‌స‌రం లేద‌ని పేర్కొంద‌న్నారు. ఆ వెంట‌నే.. జీవో 47 తీసుకువ‌చ్చి.. ఇక‌పై స్పోర్ట్స్ కోటా ఉద్యోగుల‌కు రాత ప‌రీక్ష త‌ప్ప‌నిస‌రి అని పేర్కొన్న‌ట్టు జ‌గ‌న్ చెప్పారు. ఇలా.. జీవోలు మార్చి.. అభ్య‌ర్థుల‌ను మోస‌గించార‌ని ఆరోపించారు.
  4. న‌కిలీ స‌ర్టిఫికెట్లు
    స్పోర్ట్స్ కోటా అభ్య‌ర్థుల‌కు విశాఖ ఎంపీ శ్రీభ‌ర‌త్ న‌కిలీ స‌ర్టిఫికెట్లు ఇచ్చార‌ని జ‌గ‌న్ ఆరోపించారు. ఏపీ సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్ , ఎమ్మెల్యే కూన రవికుమార్‌.. దాదాపు 38 సర్టిఫికెట్లు ఇచ్చారని ఆరోపించారు. ఈ నేప‌థ్యంలో ఆయా అంశాల‌పై సీబీఐ విచార‌ణ‌కు డిమాండ్ చేస్తున్న‌ట్టు చెప్పారు.