Political News

కొడాలి వార‌సుడికి వ‌ర్క‌వుట్ అయ్యేలా లేదే.. !

గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని రాజకీయ పరిస్థితి ప్రస్తుతం సవాలుగా మారింది. రాజకీయంగా ఆయ‌న త‌న త‌మ్ముడి కొడుకును వార‌సుడిగా ప్ర‌క‌టించినా.. త‌న స్థాయిలో రాజ‌కీయాలు చేయ‌క‌పోవ‌డంతో నాని రీఎంట్రీ ఇచ్చారు. 2024 ఎన్నికల ఓటమి త‌ర్వాత‌.. కొంతకాలం అనారోగ్య సమస్యల కారణంగా కొడాలి నాని ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. సుమారు 18 నెలల విరామం తర్వాత, గుడివాడ కేంద్రంగా ఆయన మళ్లీ ప్రజా ఆందోళనలు, రాజకీయ కార్యక్రమాలతో యాక్టివ్ అయ్యారు.

వైసీపీ సదస్సుల్లో భాగంగా తన రాజకీయ వారసుడిని కూడా పరిచయం చేశారు. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలోనే తాను వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌బోన‌ని చెప్పారు. ఈ క్ర‌మంలోనే త‌మ్ముడి కొడుకును వార‌సుడిగా ప్ర‌క‌టించారు. కానీ, ఆయ‌న దూకుడు లేక‌పోగా.. కార్య‌క‌ర్త‌ల‌ను కూడా స‌మ‌న్వ‌యం చేయ‌లేక పోతున్నారు. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే రాము.. దూకుడుకు ఏమాత్రం వార‌సుడి రాజ‌కీయాలు ప‌నిచేయ‌డం లేదు. దీంతో నాని తిరిగి ఎంట్రీ ఇవ్వ‌క త‌ప్ప‌లేదు. అయితే… నానీకి రాజకీయంగా అనేక స‌వాళ్లు ఎదుర‌వుతున్నాయి.

ప్రస్తుతం నానీ రాజ‌కీయాల‌ను.. గతంతో పోలిస్తే కాస్త డల్ అయినప్పటికీ, ఆయన మళ్లీ యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితి కూట‌మికి అనుకూలంగా ఉంది. డిసెంబర్ 2025లో గుడివాడ కేంద్రంగా ఆయన మళ్లీ రాజకీయాల్లోకి పునఃప్రవేశం చేశారు. స్థానిక కేడర్‌తో సమావేశాలు నిర్వహించి, ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటానని ప్రకటించారు భవిష్యత్తులో తాను ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండే అవకాశం ఉంద‌ని, తన తమ్ముడి కుమారుడు కొడాలి అర్జున్‌ను రాజకీయ వారసుడిగా తెరపైకి తెచ్చారు.

అయితే, నానీని కేసులు-సవాళ్లు.. పెద్ద ఎత్తున ఉక్కిరి బిక్కిరికి గురి చేస్తున్నాయి. ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో ఆయనపై కొన్ని పాత కేసులకు సంబంధించి విచారణలకు ప్రభుత్వం అనుమతించడం వంటి పరిణామాలు ఇబ్బందిగానే మారాయి. పైకి మాత్రం ఇవ‌న్నీ రాజ‌కీయాలేన‌ని చెబుతున్నా.. నిరంత‌రం న్యాయ‌వాదులను క‌లుస్తూ… వాటి నుంచి బ‌య‌ట ప‌డేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇక‌, రాజ‌కీయంగా గ‌తంలో ఉన్నంత ఊపు.. ఉత్సాహం క‌నిపించ‌డం లేదు. ప్ర‌స్తుత ప‌రిస్థితిలో వార‌సుడికంటే కూడా తానే పోటీ చేయ‌డం బెట‌ర్ అని అనుకుంటున్నారు.

This post was last modified on September 24, 2026 12:08 pm

Share

Recent Posts

జ‌న‌సేన ఎంట్రీతో వంగ‌వీటికి పూర్వ వైభ‌వం వ‌చ్చేనా!

విజ‌య‌వాడ రాజ‌కీయాల్లో వంగ‌వీటి రంగా కుటుంబానికి ప్ర‌త్యేక స్థానం ఉంది. రంగా జీవించి ఉన్న రోజుల్లో.. ఆయ‌న తూర్పు నియోజ‌క…

23 minutes ago

చిరుకు నో హీరోయిన్.. నో రొమాన్స్.. నో డ్యూయెట్

మన స్టార్ హీరోలకు ఎంత వయసు వచ్చినా సరే.. హీరోయిన్లతో రొమాన్సులు.. పాటలు.. డ్యాన్సులు ఉండాల్సిందే అనే అభిప్రాయం ఒకప్పుడు…

1 hour ago

దేశం విడిచి వెళ్లిపో… అమీర్ ఖాన్ మేనల్లుడికి ఆదేశాలు

ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలో పాల్గొన్న ప్రసిద్ధ బాలీవుడ్ నటుడు…

2 hours ago

ముత్తువేల్ పాండియన్ మళ్ళీ మొదలెట్టాడా

ఇవాళ జైలర్ 2 భారీ అంచనాల మధ్య విడుదలయ్యింది. మాములుగా బ్లాక్ బస్టర్ సీక్వెల్ కుండే హైప్ దీనికి పూర్తి…

2 hours ago

అయిదు సినిమాలు… ఎక్కడ చిరునామాలు

ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాని పూర్తి చేయడం ఒక యజ్ఞం అనుకుంటే దాన్ని థియేటర్ల దాకా తీసుకురావడం ఇంకో మహా సంకల్పంగా…

6 hours ago

ఎల్ నినో కూడా కరోనా లాంటి విపత్తే

దేశంలో ఎల్ నినో ప్రభావం తీవ్రత మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా దీని ప్రభావం ఉన్నప్పటికీ భారతదేశం మీద అందులోనూ దక్షిణ…

6 hours ago