Political News

తిరుమల వెళ్తున్నారా? ఇది మాత్రం మిస్ అవ్వకండి!

తిరుమ‌ల తిరుప‌తి ప‌ర్య‌ట‌న‌కు వెళ్లేవారికి శ్రీవారిని ద‌ర్శించుకోవ‌డం.. మొక్కులు చెల్లించుకోవ‌డం.. స్వామి వారి ప్ర‌సాదాన్ని స్వీక‌రించ‌డం గొప్ప అనుభూతి. శ్రీవారిని ఒక్క నిమిషం పాటైనా ద‌ర్శించుకోవాల‌ని సామాన్యులు క‌ల‌లు కంటారు. అయితే.. అది పెరుగుతున్న భ‌క్తుల ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే.. ప్ర‌స్తుతం క‌ష్ట‌సాధ్యంగానే మారుతోంది. ఈ నేప‌థ్యంలో తిరుమ‌ల తిరుపతి దేవ‌స్థానం అధికారులు వినూత్న ఆలోచ‌న చేశారు. తిరుమ‌ల శ్రీవారి ఆల‌యానికి స‌మీపంలో ఉండే మ్యూజియంను త్రీడీ విధానంలోకి ఆధునీక‌రించారు. ఈ మ్యూజియం ను తాజాగా సీఎం చంద్ర‌బాబు ప్రారంభించారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సహకారంతో సుమారు 145 కోట్ల వ్యయంతో ఈ త్రీడీ మ్యూజియా న్ని ఆధునీక‌రించారు.

త్రీడీ మ్యూజియం విశేషాలు ఇవీ..

  • మూల మూర్తి అయిన‌ శ్రీవారికి నిత్యం ధ‌రింప‌జేసే పవిత్రమైన విభిన్న కిరీటాలు, చారిత్రాత్మక దివ్యాభరణాలను త్రీడీ మోడల్‌ లో ప్రదర్శిస్తారు.
  • శ్రీకృష్ణదేవరాయలు స‌హా ఇత‌ర రాజులు స్వామివారికి సమర్పించిన ఆభరణాల నమూనాలను స్ప‌ష్టంగా చూడ‌వ‌చ్చు.
  • తిరుమ‌ల ఆల‌యం విశిష్ట‌త‌.. ఎక్క‌డ ఏముంది? వంటి అనేక విశేషాలు ఇక్క‌డ క‌నిపిస్తాయి. త్రీడీ మోడల్ ఆఫ్ సెవెన్ హిల్స్ ప్రదర్శన ఉంటుంది.
  • మ్యూజియంలోని మూడో అంత‌స్తులో ఇమ్మర్సివ్ సాంకేతికతను ఉపయోగించి సృష్టి రహస్యాలు, గ్రహాల గమనం, కాలచక్రం, స్వామివారి విశ్వరూపంను వంటివాటిని చూసి దివ్యానుభూతిని సొంతం చేసుకోవ‌చ్చు.
  • శ్రీవారికి ప‌ద్మావ‌తీ దేవితో జ‌రిగిన‌ వివాహ వేడుకలను అత్యంత అద్భుతమైన పనోరమిక్ డిస్‌ప్లేపై ఏఐ-జెనరేటెడ్ వీడియో రూపంలో ఉంటుంది.
  • 14,000 పైగా కళాఖండాల చరిత్రను భక్తులకు వివరించడానికి హోలోగ్రాఫిక్ స్క్రీన్లు, 360 డిగ్రీల ఇంటరాక్టివ్ డిస్‌ప్లేలు, స్పేషియల్ సౌండ్ సిస్టమ్‌ను అమర్చారు.

అంద‌రికీ ప్ర‌వేశం..

తిరుమ‌ల త్రీడీ ఎస్వీ మ్యూజియంను అంద‌రూ ద‌ర్శించ‌వ‌చ్చు. ప్ర‌స్తుతానికి ఉచిత‌మే. అయితే.. స‌మ‌యాల ప్ర‌కారం.. షెడ్యూల్ కేటాయించ‌నున్నారు. బ్యాచ్‌ల వారీగా త్రీడీ మ్యూజియంలోకి అనుమ‌తించ‌నున్నారు.

This post was last modified on September 16, 2026 9:09 pm

Share

Recent Posts

రియాలిటీకి దగ్గరగా ఉన్నా కామెంట్స్ తప్పలేదు

నిన్న కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' టైటిల్ రివీల్ టీజర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అరిటాకులో భోజనాలు వడ్డించే ఒక…

4 minutes ago

సరైన పుకారు ఎవరు సృష్టించారు

సరైనోడు ఇచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు బోయపాటి శీను కాంబోలో ఒక సినిమా తెరకెక్కే అవకాశముందంటూ నిన్న…

16 minutes ago

రాకాతో ఆస్కార్ కొట్టి త‌మిళంలో మాట్లాడ‌తా

ఒక‌ప్పుడు ఆస్కార్ అవార్డుల గురించి ఇండియ‌న్ ఫిలిం మేక‌ర్స్ ఆలోచించ‌డం కూడా క‌ష్టంగా ఉండేది. కానీ ఆర్ఆర్ఆర్ సినిమా త‌ర్వాత…

3 hours ago

టీనేజ్ ప్రేమలు కాసులు కురిపిస్తాయా

మొన్న గాంధీ జయంతికి విడుదలైన సినిమాల్లో బడ్జెట్ తక్కువే అయినా తెల్లకాగితం అంతో ఇంతో సౌండ్ చేయడంలో సక్సెసయ్యింది. వీడియోలు…

4 hours ago

మంట‌లు రేపుతున్న `ఫాం-6..`

కొత్త‌గా ఓటు న‌మోదు చేసుకోవాల‌ని అనుకునేవారు.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం వెబ్ సైట్ లేదా..అధికారుల నుంచి ఫాం-6ను తీసుకుని దానిని…

4 hours ago

అఖండ-3 నిజంగా సాధ్యమేనా?

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. బాలయ్య చాలా ఏళ్ల…

9 hours ago