ఏపీ విపక్షం(ప్రధాన కాదు) వైసీపీలో అంతర్గత పోరు ఎక్కువగా సాగుతోంది. దీనికి తోడు.. వైసీపీ అధినేత జగన్‌కు అత్యంత సన్నిహితంగా ఉన్న నాయకులు.. ఇప్పుడు పార్టీపై తిరుగుబాటు జెండా.. అజెండాలతో ముందుకు సాగుతున్నారు. ఈ పరిస్థితి వైసీపీకి ముఖ్యంగా జగన్‌కు భారీ ఎత్తున సెగ పెంచుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో సోదరి.. ఇప్పుడు సాయిరెడ్డి వరుసగా వైసీపీని ఇరకాటంలోకి నెడుతున్నారని అంటున్నారు.
గత 2024 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ చీఫ్‌గా అరంగేట్రం చేసిన జగన్ సోదరి షర్మిల.. ఎన్నికల సమయంలో ఏవిధంగా విజృంభించారో అందరికీ తెలిసిందే. తమ బాబాయి దారుణ హత్య ఉదంతాన్ని.. దీన్ని కప్పిపుచ్చేందుకు జగన్ తీవ్రప్రయత్నాలు చేశారని ఆమె ఆరోపించారు. అదేసమయంలో కడప ఎంప అవినాష్ రెడ్డి ఓటమి లక్ష్యంగా కడపలోనూ రాజకీయాల వేడిని పెంచారు. ఫలితంగా వైసీపీకి భారీ మైనస్ వచ్చింది. కేవలం 11 స్థానాలకు పరిమితం అయింది.
కట్ చేస్తే.. ఇప్పుడు వచ్చే ఎన్నికల నాటికి.. జగన్ మిత్రుడు, ఆయనకు ఆడిటర్‌గా సేవలు అందించి, పార్టీలో కీలక రోల్ పోషించిన.. సాయిరెడ్డి కూడా ఎగస్పార్టీ అయిపోయారు. నన్ను కెలికితే.. మీ గుట్టు బయట పెడతా! అంటూ.. ఆయన హెచ్చరించారు. ఒకవైపు వైసీపీ అధినేత జగన్ మంచి వారే అంటున్నా.. సాయి రెడ్డి చేస్తున్న ఇతర వ్యాఖ్యలు.. ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి కేంద్రంగా వేస్తున్న అడుగులు వైసీపీని క్షేత్రస్థాయిలో బలహీనపరుస్తున్నాయి.
నిజానికి వైసీపీ నుంచి గత ఎన్నికల తర్వాత.. చాలా మంది నాయకులు బయటకు వచ్చారు. అయితే.. వైసీపీ అంతర్గత విషయాలు.. ముఖ్యంగా జగన్ అంతర్గత విషయాలపై పూర్తి సమాచారం, అవగాహన ఉన్న నాయకులు ఎవరూలేరు. ఇదే సాయిరెడ్డికి కలసి వస్తోంది. వైసీపీ గురించి ఆయనకు పూర్తిగా తెలుసు. ఇక, జగన్ ఆర్థిక సామ్రాజ్య పునాదుల విషయాలు కూడా ఆయనకు కరతలామలకం. ఈ నేపథ్యంలో నాడు షర్మిలకంటే కూడా ఎక్కువగా సాయిరెడ్డి నోరు తెరిస్తే..వైసీపీ ఇరుకున పడడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. గత ఎన్నికల్లో షర్మిల .. వచ్చే ఎన్నికల్లో సాయిరెడ్డి ప్రభావం వైసీపీపై ఉంటుందని అంచనా వేస్తున్నారు.
This post was last modified on September 8, 2026 4:21 pm
మాస్ మార్కెట్ ని మరింత బలపరుచుకునే ఉద్దేశంతో నాని ఏరికోరి చేసిన ది ప్యారడైజ్ ఫైనల్ ఫలితం ఏంటనేది ఇంకా…
ఆ మధ్య షూటింగ్ లో ప్రమాదానికి గురైన జూనియర్ ఎన్టీఆర్ కొన్ని వారాల విశ్రాంతి తర్వాత పూర్తిగా రికవర్ అయ్యాడు.…
కీలకమైన వీక్ డేస్ పరీక్షలో ప్యారడైజ్ తడబడుతోంది. మొదటి నాలుగు రోజులు ఆదివారం దాకా ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడిన…
2019-24 మధ్య జగన్ జమానాలో ఏపీలో నాణ్యమైన మద్యం కరువైన సంగతి తెలిసిందే. తన మంత్రులు, అనుయాయులకు సంబంధించిన డిస్టిలరీల…
ఏపీ లిక్కర్ రవాణా కుంభకోణం కేసు దర్యాప్తునకు మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఏవో కారణాలు చెప్పి…
యూత్ హీరోలు ప్లానింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఆర్థికంగా ఏమో కానీ కెరీర్ పరంగా ఇబ్బందులు చూడాల్సిన పరిస్థితులు ఇండస్ట్రీలో…