Political News

విజయ్ జయలలిత పేరు ఎందుకు చెప్పలేదు?

తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి విజయ్ చెప్పిన ఒకే ఒక్క డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. “1967లో అన్నాదురై, 1977లో ఎంజీఆర్, 1982లో ఎన్టీఆర్.. ఇప్పుడు 2026లో విజయ్” అంటూ తన పొలిటికల్ ఎంట్రీని గతంలో వచ్చిన చారిత్రాత్మక మార్పులతో పోల్చుకున్నారు. ఈ డైలాగ్ వినగానే అందరి మైండ్‌లో వెంటనే మెదిలిన ప్రశ్న.. తమిళ రాజకీయాలను దశాబ్దాల పాటు శాసించిన ‘అమ్మ’ జయలలిత పేరు ఆ లిస్ట్‌లో ఎందుకు లేదు?

నిజానికి దీని వెనుక విజయ్ ఆలోచించిన ఒక పక్కా పొలిటికల్ ప్యాటర్న్ ఉంది. 1967లో డీఎంకేతో అన్నాదురై కాంగ్రెస్ కోటను బద్దలు కొట్టారు. 1977లో ఎంజీఆర్ సొంత పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చారు. ఇక 1982లో పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే ఎన్టీఆర్ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఇప్పుడు విజయ్ కూడా సరిగ్గా అదే రూట్‌లో తన సొంత పార్టీతో వచ్చి పవర్‌లోకి వచ్చాడు. అంటే ఇక్కడ విజయ్ తీసుకున్న లెక్క.. సొంతంగా ఒక కొత్త రాజకీయ శక్తిని పుట్టించి, పాత వ్యవస్థను మార్చేసిన నాయకుల ట్రాక్ రికార్డ్ మాత్రమే.

జయలలిత ప్రయాణం దీనికి పూర్తి భిన్నం. ఆమె సొంతంగా కొత్త పార్టీని స్థాపించి అధికారంలోకి రాలేరు. ఎంజీఆర్ మరణం తర్వాత అన్నాడీఎంకే పగ్గాలు చేపట్టి పార్టీని తన గుప్పెట్లోకి తీసుకుని 1991లో సీఎం అయ్యారు. తమిళనాడు రాజకీయాల్లో ఆమె తిరుగులేని శక్తి అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, ‘కొత్త పార్టీతో పొలిటికల్ సునామీ’ అనే విజయ్ ఈక్వేషన్‌కు ఆ ప్రయాణం సెట్ కాదు.

అలాగని జయలలితను విజయ్ ఏమాత్రం పక్కనపెట్టలేదు. అదే అసెంబ్లీ సమావేశంలో రాజకీయాల్లో మహిళలు ఎదుర్కొనే ఇబ్బందుల గురించి మాట్లాడేటప్పుడు.. గతంలో జయలలితకు జరిగిన అవమానాలను ఆయన ప్రత్యేకంగా గుర్తుచేశారు. ఒక బలమైన నాయకురాలిగా ఆమె పట్ల తనకున్న గౌరవాన్ని చూపించారు. ఇక్కడ విజయ్ పాలకుల గురించి మాట్లాడలేదు.. ఒక సరికొత్త రాజకీయ శక్తి పుట్టిన కాలాన్ని మాత్రమే పాయింట్ అవుట్ చేశాడు. ఈ చిన్న లాజిక్ అర్థం చేసుకోకుండానే విజయ్ స్పీచ్‌లో జయలలిత పేరు లేదంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

This post was last modified on September 7, 2026 10:48 pm

Share

Recent Posts

విజయవాడలో 10 కోట్లు… దేశంలోనే మొదటిసారి

సైబ‌ర్ నేరాల గురించి త‌ర‌చుగా వార్త‌లు వ‌స్తున్నాయి. బాధితుల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో ప్ర‌భుత్వాలు స‌హా రిజ‌ర్వ్ బ్యాంకు…

34 minutes ago

ఒక్క యాడ్‌కు 40 కోట్ల పారితోష‌కం?

చాలా ఏళ్ల నుంచి త‌మిళ సినిమాను ఏలుతున్న హీరోల్లో అజిత్ ఒక‌డు. సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్, ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌ర్వాత…

40 minutes ago

ఖైర‌తాబాద్‌లో బీజేపీ క్యాండేట్‌ ఆయ‌నేనా?

తెలంగాణ‌లో కీల‌క‌మైన ఖైర‌తాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుద‌ల…

5 hours ago

బాబు.. ప‌వ‌న్‌.. జోడీకి జ‌నాలు ఫిధా!

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు, డిప్యూటీసీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల జోడీకి ప్ర‌జ‌ల్లో మ‌రింత ఆద‌ర‌ణ…

11 hours ago

బ్లడీ రోమియోకి లెక్కలు కుదురుతున్నాయి

మాస్ మార్కెట్ ని మరింత బలపరుచుకునే ఉద్దేశంతో నాని ఏరికోరి చేసిన ది ప్యారడైజ్ ఫైనల్ ఫలితం ఏంటనేది ఇంకా…

12 hours ago

డ్రాగన్ మాట మీద నిలబడితే చాలు

ఆ మధ్య షూటింగ్ లో ప్రమాదానికి గురైన జూనియర్ ఎన్టీఆర్ కొన్ని వారాల విశ్రాంతి తర్వాత పూర్తిగా రికవర్ అయ్యాడు.…

12 hours ago