Political News

తెలంగాణా అసెంబ్లీలో బ్లాక్ డే

తెలంగాణా అసెంబ్లీ ప్రారంభం కావడమే యుద్ధ వాతావరణం నెలకొంది. అసెంబ్లీ గేటు వద్ద ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకోవడంతో జంగ్ మొదలైంది. పోలీసుల కట్టడి, బీఆర్ఎస్ నాయకులను అడ్డుకోవడం, కేటీఆర్, హరీష్ రావు చొక్కాలు విప్పి నిరసన తెలపడం, ఎమ్మెల్సీ తాత మధు టూమచ్ కామెంట్స్ తో అసెంబ్లీ వద్ద రణరంగాన్ని తలిపించింది. దీంతో అసెంబ్లీ లోపల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అసెంబ్లీ బయట బీఆర్ఎస్ నాయకులు ఈ రోజు అసెంబ్లీ చరిత్రలో బ్లాక్ డే నిలిచిపోతుందని వ్యాఖ్యానించడం గమనార్హం.

తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ వేయి రోజుల పాలన విఫలమైందని ఆరోపిస్తూ నిరసనగా బీఆర్ఎస్ సభ్యులు నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీకి వచ్చారు. ఇది నిబంధనలకు విరుద్ధం అంటూ పోలీసులు వారిని అసెంబ్లీ గేటు వద్ద అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులకు, పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది. తమను అసెంబ్లీలోకి వెళ్లకుండా అడ్డుకునే హక్కు పోలీసులకు లేదని బీఆర్ఎస్ సభ్యులు వాదించారు. ఇరువురి మధ్య తోపులాట జరగడం వివాదానికి ఆజ్యం పోసింది.

దీంతో ఎమ్మెల్సీ తాతా మధు ఆగ్రహంతో స్పీకర్ గడ్డం ప్రసాద కుమార్ ను ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారని ప్రచారం జరుగుతుంది . ఎవడ్రా స్పీకర్, ఎవడ్రా మీకు అధికారం ఇచ్చిందని అభ్యంతరకరంగా దూషించినట్లు అధికార కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. స్పీకర్ ను ఉద్దేశించి ఏకవచనంతో సంభోదించి అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఎమ్మెల్సీ దూషణలతో స్పీకర్ గడ్డం ప్రసాద్ మనస్తాపానికి గురయ్యారు. తీవ్ర మనోవేదనతో కన్నీరు పెట్టుకున్నారు. దీంతో ముఖ్యమంత్రి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, ఎమ్మెల్సీ మధు సభ్యత్వాన్ని రద్దు చేయాలని అధికార పార్టీ డిమాండ్ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ చరిత్రలో ఇది బ్లాక్ డే గా నిలిచిపోతుందని ప్రకటించారు.

అదే సమయంలో అసెంబ్లీ బయట బీఆర్ఎస్ సభ్యులు కూడా నానా హంగామా సృష్టించారు. అసెంబ్లీ గేటు వద్ద తమను అడ్డుకున్న పోలీసులు తోపులాట సందర్బంగా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి చీర లాగారని, బూటు కాలితో తొక్కారని ఆవేదన వ్యక్తం చేసిన సునీతా లక్ష్మారెడ్డి కన్నీటి పర్యంతం అయ్యారు. అసెంబ్లీ చరిత్రలో ఇదో బ్లాక్ డే అని కామెంట్ చేసిన ఆమె ఈరోజు జరిగింది దుశ్శాసన పర్వం అని అభివర్ణించారు.
స్పీకర్ ను ఉద్దేశించి తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, నల్ల దుస్తులు ధరించి వెళుతున్న తమను అడ్డుకున్న పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశానని, దాన్ని కాంగ్రెస్ పార్టీ వక్రీకరించి ప్రచారం చేస్తుందని ఎమ్మెల్సీ తాతా మధు చెబుతున్నారు.

మొత్తం మీద వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి ముందు జరిగిన పరిణామాలపై ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ప్రజా సమస్యలపై చర్చించి, చట్టాలు చేయాల్సిన సభ్యులు విచక్షణ మరిచి ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడం బాధాకరమని మేధావులు చెబుతున్నారు. ప్రభుత్వ విధానాలపై నిరసన తెలిపే హక్కు ప్రతిపక్షానికి వుందని, దాన్ని అధికార పార్టీ స్వాగతించాలని సూచించారు. అదే సమయంలో ప్రతిపక్షం సంయమనం పాటించాలని, స్పీకర్ స్థానాన్ని కించపరిచడం అంటే తమను తాము కించపరుచుకున్నట్టే అని హితవు చెబుతున్నారు.

This post was last modified on September 7, 2026 10:14 pm

Share

Recent Posts

విజయవాడలో 10 కోట్లు… దేశంలోనే మొదటిసారి

సైబ‌ర్ నేరాల గురించి త‌ర‌చుగా వార్త‌లు వ‌స్తున్నాయి. బాధితుల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో ప్ర‌భుత్వాలు స‌హా రిజ‌ర్వ్ బ్యాంకు…

35 minutes ago

ఒక్క యాడ్‌కు 40 కోట్ల పారితోష‌కం?

చాలా ఏళ్ల నుంచి త‌మిళ సినిమాను ఏలుతున్న హీరోల్లో అజిత్ ఒక‌డు. సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్, ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌ర్వాత…

41 minutes ago

ఖైర‌తాబాద్‌లో బీజేపీ క్యాండేట్‌ ఆయ‌నేనా?

తెలంగాణ‌లో కీల‌క‌మైన ఖైర‌తాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుద‌ల…

5 hours ago

బాబు.. ప‌వ‌న్‌.. జోడీకి జ‌నాలు ఫిధా!

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు, డిప్యూటీసీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల జోడీకి ప్ర‌జ‌ల్లో మ‌రింత ఆద‌ర‌ణ…

11 hours ago

బ్లడీ రోమియోకి లెక్కలు కుదురుతున్నాయి

మాస్ మార్కెట్ ని మరింత బలపరుచుకునే ఉద్దేశంతో నాని ఏరికోరి చేసిన ది ప్యారడైజ్ ఫైనల్ ఫలితం ఏంటనేది ఇంకా…

12 hours ago

డ్రాగన్ మాట మీద నిలబడితే చాలు

ఆ మధ్య షూటింగ్ లో ప్రమాదానికి గురైన జూనియర్ ఎన్టీఆర్ కొన్ని వారాల విశ్రాంతి తర్వాత పూర్తిగా రికవర్ అయ్యాడు.…

12 hours ago