Political News

కారా కారాలో టిల్లు గ్రూపు రౌడీయిజం

హైదరాబాద్ లోని అత్యంత ఖరీదైన జూబ్లీహిల్స్ కాస్మోపాలిటన్ ఏరియాలో వున్న కారా కారా పబ్లో ఆదివారం తెలవారుజామున జరిగిన గొడవ కలకలం సృష్టించింది. టేబుల్ కేటాయింపు విషయంలో రెండు గ్రూపులు గొడవపడ్డారు. సుమారు మూడు గంటల పాటు రణరంగం సృష్టించారు. దీంతో పబ్ పరిసరాల్లో భయానక వాతావరణం ఏర్పడింది. కుర్చీలు, బీరు సీసాలు గాల్లోకి లేవడంతో జనాలు ఆందోళనకు గురయ్యారు. కేకలు, అరుపులతో గాఢ నిద్రలో వున్న జనాలు ఉలిక్కిపడి లేచారు.

జూబ్లీహిల్స్ లోని కారా కారా పబ్ కు హై సొసైటీకి చెందిన పిల్లల్లో మాంచి క్రేజ్ వుంది. రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తల పిల్లలు ఎక్కువగా ఇక్కడకు వస్తుంటారు. రాత్రంతా తాగుతూ, ఊగుతూ ఎంజాయ్ చేస్తుంటారు. ఎప్పటిలాగే శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ సోదరుడు, హైదరాబాద్ సన్ రైజర్ టీం మేనేజర్ అయిన అరవింద్ యాదవ్ అలియాస్ టిల్లు తన అనుచరులతో కలిసి వచ్చారు. కాసేపటికి పబ్ లో చిన్నపాటి గొడవ మొదలైంది.

పాతబస్తీకి చెందిన వసీమ్ ఖాన్ తన అనుచరుడు అఫ్సర్ ఖాన్ తో కలిసి అదే సమయంలో పబ్ కు వచ్చారు. పబ్ లో టేబుల్ కేటాయింపు, న్యారో స్పేస్ విషయంలో టిల్లు, వసీమ్ ఖాన్ ఇద్దరూ పట్టుపట్టారు. రెండు గ్రూపులుగా విడిపోయి వాదులాడుకున్నారు. అక్కడ వున్న వారంతా ఇది సహజంగా జరిగే చిన్న వాదన అనుకొని వదిలేశారు. కానీ చూస్తూ చూస్తుండగానే వాదన ముదిరి వివాదంగా మారింది. మాట మాట అనుకునే పరిస్థితి దాటి చేయి చేసుకునే దాకా చేరుకుంది. దాంతో ఒకరి మీద మరొకరు కుర్చీలు, బీరు బాటిల్లు విసురుకున్నారు.

గొడవ జరిగిన తర్వాత వసీమ్ ఖాన్ గ్రూపు పబ్ నుంచి బయటకు వచ్చి తన కారులో ఇంటికి వెళ్లేందుకు పార్కింగ్ వద్దకు చేరుకున్నారు. అయినప్పటికీ టిల్లు గ్రూపు వదిలిపెట్టలేదు. వెంబడిస్తూ పార్కింగ్ వద్దకు చేరుకున్నారు. వసీమ్, ఆఫ్సర్ ఖాన్ల మీద భౌతిక దాడికి పాల్పడ్డారు. కారును ధ్వంసం చేశారు. దాంతో ఘర్షణ మరింత ముదిరింది. అటూ ఇటూ భారీగా చేరుకొన్న రెండూ వర్గాలు రోడ్డెక్కారు. సుమారు మూడు గంటలపాటు యుద్ధవాతావారణాన్ని సృష్టించారు. ఈ ఘర్షణలో ముగ్గురికి తీవ్ర గాయలయ్యాయి. పార్కింగ్ లో వున్న పలు వాహనాలు దెబ్బతిన్నాయి. పబ్ ఫర్నిచర్ ధ్వంసం అయ్యింది.

పబ్ వద్ద గంటల తరబడి ఘర్షణ జరుగుతున్నా పోలీసులు అటువైపు తొంగి చూడక పోవడం విమర్శలకు దారితీసింది. వసీమ్ ఖాన్ స్వయంగా జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాల కు చెందిన మొత్తం 21 మంది మీద కేసు నమోదు చేశారు. పబ్ లో ఏమి జరిగిందో తెలుసుకునేందుకు సీసీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు. గొడవలో పాల్గొన్న వారి వివరాలు సేకరిస్తున్నారు. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు గురికాకుండా ఇరు వర్గాల మీద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.

బలమైన రాజకీయ నేపథ్యంతో కలిగివున్న అరవింద యాదవ్ అలియాస్ టిల్లు అనుచరుల మీద పలు ఆరోపణలు వున్నాయని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. సెటిల్మెంట్ల వ్యవహారంలో తలదూర్చడం, గొడవల్లో ఇన్వాల్వ్ కావడం వంటి ఆరోపణలు టిల్లు గ్రూపు మీద ఉన్నట్టు వినిపిస్తుంది. యల్లారెడ్డి గూడ ప్రాంతానికి చెందిన వసీమ్ గురించి కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇదిలావుండగా… పబ్ లో జరిగిన గొడవల్లో తాను పాల్గొనలేదని, తనకు ఎలాంటి సంబంధం లేదని టిల్లు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. గొడవ జరిగిన సమయంలో తాను పబ్ లో వున్నట్లు పోలీస్ విచారణలో చెప్పినట్టు తెలుస్తుంది.

This post was last modified on September 7, 2026 1:00 pm

Share

Recent Posts

ఒత్తిడి తట్టుకోగలవా వశిష్టా

దర్శకుడు వశిష్ఠ మళ్ళీ వార్తల్లోకి వచ్చారు. నిన్న అనౌన్స్ చేసిన నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ సినిమాకి దర్శకుడిగా లాక్ చేయడంతో…

7 minutes ago

రామ్ చరణ్ 17… అడుగులు పడుతున్నాయి

పెద్ది వచ్చి నాలుగు నెలలవుతోంది. దానికన్నా ముందు రామ్ చరణ్ కున్న గ్యాప్ సంవత్సరంన్నర. అందుకే ఆర్సి 17 కోసం…

7 minutes ago

తెలంగాణలో టీడీపీ వచ్చేది లేదు సచ్చేది లేదు: మహేష్

తెలంగాణలో టీడీపీ బలోపేతం చేయాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. ఉమ్మడి ఏపీలో తెలంగాణలోనూ టీడీపీ కేడర్, లీడర్లు…

28 minutes ago

బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలకు ఘోర అవమానం?

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తొలిరోజే తీవ్ర ఉద్రిక్తత వాతావరణం ఏర్పడిన సంగతి తెలిసిందే. నల్ల దుస్తులతో అసెంబ్లీకి వచ్చిన…

48 minutes ago

చరణ్‌కు తగిలిన దెబ్బే దుల్కర్‌కు తగిలింది

ఎందుకో స్టార్ హీరోలకు ఈ మధ్య 'గేమ్' టైటిల్ అచ్చి రావడం లేదు. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ చేసిన…

1 hour ago

టీ షర్ట్ విప్పి హరీశ్ రావు నిరసన

నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై నిరసన వ్యక్తం…

1 hour ago